ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తెలుసుగా.. ఒకటి తెచ్చుకుంటే ఫ్యామిలీ మొత్తం తినొచ్చని. అలాగే మొబైల్ నెట్వర్కు కంపెనీలు కూడా ఫ్యామిలీ అంతటినీ తమ యూజర్లుగా మార్చుకోవడానికి ఇలాంటి ఫ్యామిలీ ప్యాక్స్ తీసుకొచ్చాయి. దాదాపు ఇవన్నీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లే. ఒక రీఛార్జి లేదా ప్రీపెయిడ్ బిల్లుతో ఇంట్లో ఇద్దరు, ముగ్గురు, నలుగురు ఫ్యామిలీ మెంబర్లు కూడా ఫోన్లు వాడుకోవచ్చు. ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాల్లో ఉన్న అలాంటి ఫ్యామిలీప్యాక్ వివరాలు మీకోసం..
ఎయిర్టెల్ 999 పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్
* ఈ ప్లాన్‌ను నలుగురు వాడుకోవచ్చు.
* అన్లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్
* రోజుకు 100 ఎస్ఎంస్లు ఫ్రీ
* నెలకు 150 జీబీ డేటా ఇస్తుంది. వాడకుండా మిగిలిపోయిన డేటాను తర్వాత నెలకు క్వారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు.
* అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఏడాది ఉచితం.
ఎయిర్టెల్ 1599 పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్
ఇది బాగా హై యూసేజ్ ఉండేవారికి బాగా పనికివస్తుంది.
* ఈ ప్లాన్ ఇద్దరు వాడుకోవచ్చు.
* అన్లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్, అన్ లిమిటెడ్ డేటా వస్తుంది.
* రోజుకు 100 ఎస్ఎంస్లు ఫ్రీ
* నెలకు 200 ఐఎస్డీ మినిట్స్ ఫ్రీ.
* రోమింగ్ కాల్స్ మీద 10% డిస్కౌంట్ కూడా ఇస్తుంది.
* అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఏడాది ఉచితం.
వొడాఫోన్ ఐడియా 598 పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్
* ఈ ప్లాన్‌లో రెండు కనెక్షన్లు వాడుకోవచ్చు.
* నెలకు 80 జీబీ డేటా ఇస్తుంది. ప్రైమరీ కనెక్షన్‌కు 50జీబీ, సెకండరీ కనెక్షన్‌కు 30జీబీ డేటా ఇస్తుంది.
* వాడకుండా మిగిలిపోయిన డేటాను క్వారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. లిమిట్ 200 జీబీకే పరిమితం.

వొడాఫోన్ ఐడియా 749 పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్
* ఈ ప్లాన్‌లో మూడు కనెక్షన్లు వాడుకోవచ్చు.
* నెలకు 120 జీబీ డేటా ఇస్తుంది. ప్రైమరీ కనెక్షన్‌కు 60జీబీ, సెకండరీ, థర్డ్ కనెక్షన్‌కు 30 జీబీ చొప్పున డేటా ఇస్తుంది.
* వాడకుండా మిగిలిపోయిన డేటాను క్వారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. లిమిట్ 200 జీబీకే పరిమితం.
* అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఏడాది ఉచితం.
వొడాఫోన్ ఐడియా 999 పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్
* ఈ ప్లాన్‌లో 5 కనెక్షన్లు వాడుకోవచ్చు.
* నెలకు 200 జీబీ డేటా ఇస్తుంది. ప్రైమరీ కనెక్షన్‌కు 80జీబీ,తర్వాత నాలుగు కనెక్షన్లకు ఒక్కోక్కరికి 30 జీబీ డేటా ఇస్తుంది.
* వాడకుండా మిగిలిపోయిన డేటాను క్వారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. లిమిట్ 200 జీబీకే పరిమితం.
* 100 ఎస్ఎంఎస్లు కూడా ఫ్రీ.
* అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఏడాది ఉచితం.
ఎయిరà±â€Œà°Ÿà±†à°²à± à°«à±à°¯à°¾à°®à°¿à°²à±€ à°ªà±à°²à°¾à°¨à±â€Œ వొడాఫోనౠà°à°¡à°¿à°¯à°¾ à°«à±à°¯à°¾à°®à°¿à°²à±€ à°ªà±à°²à°¾à°¨à±â€Œ à°«à±à°¯à°¾à°®à°¿à°²à±€ à°ªà±à°²à°¾à°¨à±â€Œ Airtel Family plans Vodafone Idea Family plans Â