జియో ఇప్పుడు జియో ఫైబర్ చందాదారులకు అమెజాన్ ప్రైమ్ వీడియో సర్వీస్ను ఏడాదిపాటు ఫ్రీగా ఇస్తానని అనౌన్స్ చేసింది. జియో ఫైబర్ గోల్డ్, డైమండ్, ప్లాటినం, టైటానియం ప్లాన్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. జియో ఫైబర్లో ఈ ప్లాన్లు వాడుతున్న వినియోగదారులు ఎలాంటి అదనపు ఛార్జీ లేకుండా రూ. 999 విలువైన అమెజాన్ ప్రైమ్ ఏడాది సభ్యత్వాన్ని అందుకోవచ్చు. ఇప్పటికే ఉన్న అమెజాన్ అకౌంట్ ద్వారా కానీ, కొత్త దానిని క్రియేట్ చేసి కానీ ఏడాది ప్రైమ్ సభ్యత్వాన్ని పొందవచ్చు.
ఎలా వాడుకోవాలంటే
*మీ ఫోన్లో మై జియో యాప్ లేదా పీసీలో జియో.కామ్ను ఓపెన్ చేయండి.
* మీ జియో ఫైబర్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
* మెయిన్ పేజీలో అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ వన్ ఇయర్ ఫ్రీ అనే బ్యానర్ కనిపిస్తుంది.
* ఆ బ్యానర్ను క్లిక్ చేయండి. (జియో ఫైబర్ గోల్డ్, డైమండ్, ప్లాటినం, టైటానియం యూజర్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. కాబట్టి బ్రాంజ్, సిల్వర్ ప్లాన్లు వాడుతున్నవారికి ఈ బ్యానర్ కనిపించదు.)
* బ్యానర్ క్లిక్ చేశాక అది అమెజాన్ అకౌంట్కు లాగిన్ అవమని అడుగుతుంది. మీకు ఉంటే లాగిన్ అవండి. లేదంటే అమెజాన్ ప్రైమ్ అకౌంట్ను క్రియేట్ చేసుకుని లాగిన్ అవ్వండి.
* లాగిన్ అయ్యాక మీ ప్రైమ్ మెంబర్షిప్ యాక్టివేటెడ్ అని మెసేజ్ వస్తుంది.
* దీంతో మీరు ప్రైమ్ మెంబర్షిప్ ద్వారా వచ్చే ప్రైమ్ వీడియో, ప్రైమ్ మ్యూజిక్, ప్రైమ్ ఎర్లీ యాక్సెస్ వంటి సదుపాయాలన్నీఏడాదిపాటు ఫ్రీగా పొందవచ్చు.
జియో ఫైబ‌రà±â€Œ జియో ఫైబ‌రౠఅమెజానౠపà±à°°à±ˆà°®à± వీడియో à°«à±à°°à±€ ఆఫ‌రà±â€Œ Jio Fiber Jio Fiber Amazon Prime video free offer