లాక్‌డౌన్‌తో వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్స్ హవా మొదలైంది. జూమ్, హౌస్‌పార్టీ ఇలా ఈ జాబితా రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా దేశీయ టెలికం దిగ్గజం జియో కూడా ఈ రేసులోకి వచ్చేసింది. జియో లాంటి పెద్ద ప్లేయర్ రావడంతో పోటీ పీక్స్‌కు చేరినట్లేనని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఎక్కువగా వీడియో కాల్స్ చేసేవారికి, గ్రూప్ కాల్స్ అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉన్నవారికి తమ జియో మీట్ సరిగ్గా సరిపోతుందని జియో ప్రకటించింది. ఈయాప్ ఇన్‌స్టలేషన్, వినియోగం గురించి ఈ సింపుల్ గైడ్ మీకోసం.
ఇన్‌స్టాలేషన్ ఇలా..
* జియోమీట్ (JioMeet) యాప్‌ను స్మార్ట్‌ఫోన్, ట్యాబ్, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ ఇలా దేనిలోనైనా యాక్సెస్ చేయొచ్చు.
* జియో మీట్ యాప్ గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
* వెబ్ వెర్షన్ కావాలంటే మైక్రోసాఫ్ట్ విండోస్ మార్కెట్‌ప్లేస్ నుంచి, మ్యాక్ యాప్ స్టోర్ నుంచి యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఔట్‌లుక్‌లో కూడా ప్లగిన్ కూడా ఉంది.
* జియోమీట్‌లో మీటింగ్‌లో జాయిన్ కావాలని మీరు ఎవరికైనా లింక్ పంపిస్తే వాళ్లు గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్‌ఫాక్స్ లాంటి వెబ్ బ్రౌజర్లలో కూడా డైరెక్ట్‌గా వీడియో కాల్ మాట్లాడొచ్చు. యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు.
ఎలా వాడుకోవాలి?
* స్మార్ట్‌ఫోన్ లేదా పీసీ లేదా మ్యాక్‌లో జియోమీట్ యాప్ డౌన్‌లోడ్ చేయండి.
* మీ ఈ-మెయిల్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ చేయండి. గెస్ట్ మోడ్ లేదా ఓటీపీ ద్వారా కూడా లాగిన్ అవ్వచ్చు.
* గెస్ట్ మోడ్‌లో కావాలంటే యాప్‌లో గెస్ట్ పైన క్లిక్ చేయాలి. తర్వాత మీ పేరు, మీటింగ్ ఐడీ యూఆర్ఎల్ ఎంటర్ చేయాలి.
* యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ లేదా ఓటీపీతో లాగిన్ చేస్తే జియోమీట్ ప్లాట్‌ఫామ్ పైన ఉన్న కాంటాక్ట్స్ కనిపిస్తాయి. వారిని ఇన్వైట్ చేయొచ్చు.
* తర్వాత వీడియో కాల్స్ చేసుకోవచ్చు.
విండోస్‌లో ఎలా?
* విండోస్ డివైస్‌లో జియోమీట్ వాడుకోవాలంటే https://jiomeet.jio.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.హోమ్ పేజీ నుంచి విండోస్ వెర్షన్ డౌన్‌లోడ్ చేయొచ్చు.
.exe ఫైల్ డౌన్‌లోడ్ చేసిన తర్వాత యాప్ ఇన్‌స్టాల్ చేయండి.
మీ డెస్క్‌టాప్ పైన షార్ట్‌కట్ క్రియేట్ అవుతుంది.
యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ ఐడీ, పాస్‌వర్డ్ లేదా ఓటీపీతో లాగిన్ అవ్వండి.
ఓటీపీ లాగిన్ ఉపయోగించాలంటే మాత్రం మీ స్మార్ట్‌ఫోన్‌లో జియోమీట్ యాప్ కచ్చితంగా ఉండాలని గుర్తు పెట్టుకోండి.
జియో వీడియో కాలింగౠయాపà±â€Œ జియో మీటà±â€Œ JioMeet Jio video calling app