నోకియా ఫోన్లోని ర‌హ‌స్య కోడ్స్‌కు ఇంట్ర‌డ‌క్ట‌రీ గైడ్‌

స్మార్ట్‌ఫోన్ల త‌రం వ‌చ్చాక నోకియా ఫోన్లు పెద్ద‌గా స‌క్సెస్ కాలేక‌పోయినా.. ఈ బ్రాండ్ ఇష్టప‌డే వాళ్ల‌కు ఇప్ప‌టికీ ఈ స్మార్ట్‌ఫోన్ల‌నే వాడ‌తారు.  అయితే నోకియా ఫోన్లు ఉప‌యోగించేవాళ్ల‌కు వీటిలో ఉండే ర‌హ‌స్య కోడ్స్ గురించి తెలియ‌దు. వీటిని ఉప‌యోగించి మ‌నం షార్ట్ కట్స్ ద్వారా వేగంగా ప‌నులు చేసుకోవ‌చ్చు. మ‌రి నోకియా అందిస్తున్న ఆ ర‌హ‌స్య కోడ్స్ ఏమిటో చూద్దామా..

అన్ని ర‌కాల అవ‌స‌రాల‌కు
నోకియా ఫోన్ల‌ను ఉప‌యోగించే వినియోగ‌దారుల‌కు వివిధ అవ‌స‌రాల కోసం ఈ ర‌హ‌స్య కోడ్స్‌ను ఉప‌యోగించే విధంగా ఆ సంస్థ కొన్ని మార్గద‌ర్శ‌కాలు అందిస్తోంది. నోకియా హ్యాండ్‌సెట్‌లో వ‌చ్చే ప్రాబ్ల‌మ్స్‌ని ఈ కోడ్స్ ద్వారా  ట్రబుల్‌షూట్ చేసుకోవ‌చ్చు. ఈ కోడ్స్ దాదాపు అన్ని నోకియా మొబైల్ ఫోన్ల‌లో వ‌ర్క్ అవుతాయి.  మ‌రి ఈ కోడ్స్ ఏమిటి వాటిని ఎలా ఉప‌యోగించాలో అనేది చాలామందికి తెలియ‌దు. వాటి జాబితా ఇదే.

కోడ్స్‌...వాటి ఉప‌యోగం
*#06#      ఐఎంఈఐ నంబ‌ర్‌ను క‌నుక్కోవ‌డానికి
*#7780#  రెసెట్ టు ఫ్యాక్ట‌రీ సెట్టింగ్స్ 
*#67705646#  ఎల్‌సీడీ డిస్‌ప్లేని క్లియ‌ర్ చేయ‌డం
*#0000#  సాఫ్ట్‌వేర్ వెర్ష‌న్ తెలుసుకోవ‌డం కోసం
*#2820# బ్లూటూత్ డివైజ్ అడ్రెస్‌
*#4720#  హాఫ్ రేట్ కోడ్ యాక్టివేష‌న్‌
*#4720* హాఫ్‌రేట్ కోడ్ డీయాక్టివేష‌న్‌
#బీటీఏ0# డిస్‌ప్లే ద బ్లూటూత్ మాక్ అడ్రెస్‌
*#మాక్‌0వాన్# డిస్‌ప్లే  ద వాన్ మాక్‌
*#పీసీఏ0# యాక్టివ్ ద జీపీఆర్ ఎస్ పీసీసీసీహెచ్ స‌పోర్ట్‌
*#పీసీడీ0@ డీయాక్టివేట్ ద జీపీఆర్ ఎస్ పీసీసీసీహెచ్ స‌పోర్ట్  

Nokia Secret Codes Useful Mobile Phone Secret Codes List