ప్రస్తుత పరిస్థితుల్లో ఫోన్ కొనడానికి ఇన్ డెప్త్ గైడ్

స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఎవరికీ విలాసవస్తువు కాదు. అందరికీ అవసరమైపోయింది. అందుకే కొన్ని వంద‌ల సెల్‌ఫోన్ కంపెనీలు ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల బిజినెస్ చేయ‌గ‌లుగుతున్నాయి. వ్యాపారం చేసుకోవ‌డానికి కంపెనీలు రోజుకో మోడ‌ల్‌ను మార్కెట్లోకి దింపుతున్నాయి. వాటిలో ఏ ఫోన్ కొనాల‌న్న‌ది అంద‌రికీ డైల‌మానే. అలాంటి డైల‌మా నుంచి మిమ్మ‌ల్ని బ‌య‌ట‌ప‌డేయ‌డానికే ఈ ఇండెప్త్ గైడ్‌.  

హోంవ‌ర్క్ చేయండి
మీరో స్మార్ట్‌ఫోన్ కొనాల‌నుకుంటే దానిమీద హోం వ‌ర్క్ చేయండి.  ముందు మీరే ధ‌ర‌లో, ఏ ఫీచ‌ర్ల‌తో ఫోన్ కొనాల‌నుకుంటున్నారో ఓ ఐడియా తెచ్చుకోండి. ఆ త‌ర్వాత ఆ రేట్‌లో ఆ ఫీచ‌ర్ల‌తో ఉన్న ఫోన్లేమిటో సెర్చ్ చేయండి. ట్ర‌స్టెడ్ సైట్ల‌లో రివ్యూలు చ‌దవండి. వీలైతై ద‌గ్గ‌ర‌లో ఉన్న సెల్‌ఫోన్ షాప్‌కు వెళ్లి ఆ ఫోన్ ఫిజిక‌ల్‌గా ఎలా ఉందో చెక్ చేసుకుని రండి. ఎవ‌ర‌న్నా అలాంటి వాడుతుంటే పెర్‌ఫార్మెన్స్‌, కెమెరా, బ్యాట‌రీ బ్యాక‌ప్ ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకోండి. 

పిండి కొద్దీ రొట్టె
మీరు 1జీబీ ర్యామ్ ఉన్న ఫోన్ కొని నాలుగైదేళ్ల‌పాటు ప‌నిచేయాల‌ని ఆశిస్తే అది మీ పొర‌పాటే.  ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఏ స్మార్ట్‌ఫోన్ కూడా రెండేళ్ల‌కు మించి ప‌నిచేసే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే యూజ‌ర్ అంత‌కాలం కూడా దాన్ని వాడ‌డం లేదు. ఈలోగానే ఏ ఎక్స్చేంజ్ ఆఫ‌ర్‌లోనే పెట్టి వేరే ఫోన్‌కు, మరింత మంచి ఫీచ‌ర్లు, అప్‌గ్రేడెడ్ ఓఎస్ ఉన్న‌దానికి అప్‌డేట్ అయిపోతున్నారు.  కాబ‌ట్టి మీరు ఫోన్ ఎంత ధ‌ర పెట్టి కొన్నా అది మ్యాగ్జిమం రెండేళ్లే. అలాగ‌ని త‌క్కువ ధ‌ర‌లో, లిమిటెడ్ ఫీచ‌ర్ల‌తో స్మార్ట్‌ఫోన్ వాడ‌డం కూడా స‌మ‌స్యే. కాబ‌ట్టి  ఏ యూజ‌ర్‌కు ఎలాంటి ఫోన్ అవ‌స‌ర‌మో తెలుసుకోండి. 

స్క్రీన్ రిజ‌ల్యూష‌న్ చూడండి
స్మార్ట్ ఫోన్ స్క్రీన్ ఎంత పెద్ద‌గా ఉంద‌నేది ఎంత ముఖ్య‌మో దాని రిజ‌ల్యూష‌న్ ఎంతుందో చూడ‌డం కూడా అంతే ముఖ్యం. క్వాడ్ హెచ్‌డీ (2కే) రిజ‌ల్యూష‌న్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. అయితే యావరేజ్ యూజ‌ర్‌కు ఫుల్ హెచ్‌డీ ఫోన్ చాలు. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే టెక్నిక‌ల్‌గా కాస్త తెలిసుంటే త‌ప్ప ఈ రెండు రిజ‌ల్యూష‌న్ల మ‌ధ్య తేడా కూడా గుర్తించ‌లేరు. ఔట్‌డోర్‌లో  ఉన్న‌ప్పుడు కూడా బ్రైట్‌గా, షార్ప్‌గా క‌నిపించే స్క్రీన్ ఉన్న ఫోన్ తీసుకోండి. సాధార‌ణంగా 5.8 నుంచి 6.4 ఇంచెస్ వ‌ర‌కు స్క్రీన్ సైజ్ ఉన్న ఫోన్లు బెట‌ర్‌.  ఫోన్‌లో సినిమాలు, వీడియోలు కూడా చూసేవారికి 1920 x 1080p (Full HD) రిజల్యూష‌న్ ఉన్న స్క్రీన్ అవ‌స‌రం. . త‌క్కువ ధ‌ర‌లో కొనుక్క‌వాలంటే 720p (HD) స్క్రీన్ కూడా ఓకే.  ఇక స్క్రీన్ విష‌యానికి వ‌స్తే ఓఎల్ఈడీ స్క్రీన్ ఉన్న ఫోన్లు ది బెస్ట్‌.

ర్యామ్‌
ఇప్పుడు 8జీబీ, 10 జీబీ ర్యామ్‌తో కూడా ఫోన్లు కూడా వ‌స్తున్నాయి. మీరు హెవీ యూజ‌ర్ అంటే హెచ్‌డీ గేమ్స్‌, బాగా ర్యామ్ అవ‌స‌ర‌మైన ప‌బ్‌జీ లాంటి గేమ్స్ ఆడేవాళ్లు అయితే త‌ప్ప సాధార‌ణంగా ఇంత ర్యామ్‌తో ప‌ని ఉండ‌దు. మామూలు యూజ‌ర్‌కు 3జీబీ ర్యామ్ ఉన్న ఫోన్ చాలు.  3జీబీ, 4జీబీ ర్యామ్ ఫోన్ల మ‌ధ్య ధ‌ర‌ల వ్య‌త్యాసం రెండు, మూడు వేల‌లోపే ఉంటుంది క‌నుక 4జీబీ ర్యామ్ ఉన్న ఫోన్ కొనుక్కుంటే ఇంకా మంచిది. 

రామ్ (ఇంట‌ర్న‌ల్ స్టోరేజి)
సాధార‌ణంగా 2జీబీ ర్యామ్ ఉన్న ఫోన్లు 16 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌తో వ‌స్తుంటాయి. అలాగే 3జీబీ ర్యామ్ ఉన్న ఫోన్లు 32 జీబీ రామ్‌తో ఉంటాయి. అందుకే 4జీబీ ర్యామ్ ఉన్న ఫోన్ల‌కు వెళ్ల‌డ‌మే మంచిది. ఎందుకంటే  ఈఫోన్ల‌లో ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ 64 జీబీ ఉంటుంది. యావ‌రేజ్ యూజ‌ర్‌కు 4జీబీ ర్యామ్‌, 64 జీబీ రామ్ ఉన్న స్మార్ట్‌ఫోన్ స‌రిపోతుంది. ఇప్పుడు హాన‌ర్‌, హువావే త‌దిత‌ర కంపెనీలు డ్యూయ‌ల్ సిమ్‌తోపాటు మెమ‌రీ కార్డ్ స్లాట్ కూడా ఇస్తున్నాయి. ఇలాంటి ఆప్ష‌న్ ఉన్న ఫోన్ తీసుకుంటే ఫోటోలు, మ్యూజిక్‌, వీడియోల‌తోపాటు యాప్స్‌ను కూడా ఎస్డీ కార్డ్‌లోకి మూవ్ చేయొచ్చు. దీంతో ఫోన్ మీద భారం త‌గ్గి స్పీడ్‌గా ప‌నిచేస్తుంది. ఫోన్ స్టోరేజ్ కూడా మిగులుతుంది.  

ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ (ఓఎస్‌)
ఆండ్రాయిడ్‌, ఐవోఎస్ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను శాసిస్తున్న ఓఎస్‌లు. వీటిలో ఆండ్రాయిడ్ ఫోన్లు చౌక ధ‌ర నుంచి దొరుకుతాయి. అయితే దీనికి త‌గ్గ‌ట్టే ఈ ఫోన్‌లో మీ డేటాకు సెక్యూరిటీ త‌క్కువ‌. అదే ఐవోఎస్‌తో న‌డిచే ఐఫోన్ల వంటి వాటికి సెక్యూరిటీ విష‌యంలో ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు. 

రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌
ఓఎస్‌ను రెగ్యుల‌ర్‌గా అప్‌డేట్ చేసే కంపెనీల ఫోన్లు కొన‌డానికే ప్రిఫ‌రెన్స్ ఇవ్వండి. గూగుల్ పిక్సెల్ అయితే ఓఎస్ అప్‌డేట్స్ ఇవ్వడంలో నెంబ‌ర్ వ‌న్‌. కానీ ధ‌ర భారీగా ఉంటుంది. మీ బ‌డ్జెట్‌లో వ‌చ్చే ఫోన్ల‌లో రెగ్యుల‌ర్ ఓఎస్ అప్‌డేట్స్ వ‌చ్చే ఫోనేంటో తెలుసుకోండి. ప్ర‌స్తుతం ఆండ్రాయిడ్ 9.0 వెర్ష‌న్ ఓఎస్ న‌డుస్తోంది. త్వ‌రలో ఆండ్రాయిడ్ 10గా పిలుచుకునే ఆండ్రాయిడ్ క్యూ కూడా రాబోతోంది. కానీ ఇప్ప‌టికీ చాలా ఫోన్లు ఆండ్రాయిడ్ 8.1 ఓరియో అంత‌కంటే పాత ఓఎస్‌ల‌తో న‌డుస్తున్నాయి. ఇవి చెక్ చేసుకోండి. ఓఎస్ ఎంత కొత్త వెర్ష‌న్ అయితే ఫోన్ అంత కొత్త ఫీచ‌ర్ల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతుంది. 

కెమెరా ఆప‌ర్చ్యూర్ చూడండి
స్మార్ట్‌ఫోన్ కెమెరా అన‌గానే ఎన్ని మెగాపిక్సెల్స్ అనేస్తాం. కానీ ఇక్క‌డ పిక్సెల్స్ కంటే దాని ఆప‌ర్చ్యూర్ , ఇప్పుడు బాగా ముఖ్య‌మైపోయింది. అలాగే డ్యూయ‌ల్ లెన్స్‌, ఆప్టిక‌ల్ ఇమేజ్ స్టెబిలైజేష‌న్ వంటి ఫీచ‌ర్లుంటే మీరు కూడా సూప‌ర్ ఫోటోలు తీసేయొచ్చు. ఒప్పో, వివో లాంటి ఫోన్ల‌లో ఇలాంటి ఫీచ‌ర్లు బాగుంటాయి. 

బ్యాట‌రీ బ్యాక‌ప్‌
స్మార్ట్‌ఫోన్ ఎంత తోపు అయినా దాని ప్రాణ‌మంతా బ్యాట‌రీలోనే ఉంటుంది. అద్భుత‌మైన ఫీచ‌ర్లున్న ఫోన్ కూడా బ్యాట‌రీ బ్యాక‌ప్ బాగోలేక‌పోతే మార్కెట్ నుంచి ఔట‌యిపోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఒప్పో, వివో, వ‌న్‌ప్ల‌స్‌లాంటి కంపెనీలు బ్యాట‌రీకి మంచి ప్రిఫరెన్స్ ఇస్తున్నాయి. 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, క్విక్ ఛార్జింగ్ ఫీచ‌ర్ ఉన్న ఫోన్ తీసుకోవ‌డం మంచి ఆప్ష‌న్‌.

స్మార్ట్ ఫోన్ కొన‌డానికి టిప్స్‌ స్మార్ట్ ఫోన్ కొన‌డానికి ఇండెప్త్ గైడ్‌ In depth guide for smart phone buyers smart phone buying guide Â