ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా.. మీకు తెలియకుండానే మీ ఫోన్లోకి యాప్స్ డౌన్‌లోడ్ అయిపోతున్నాయా? దీనికి చాలా కారణాలుండొచ్చు. ఆ కారణాలేంటి? ఇష్టారాజ్యంగా ఇలా వాటంతటవే యాప్స్ డౌన్‌లోడ్ కాకుండా చూడాలంటే ఏం చేయాలి?
తెలియజెప్పేందుకే ఈ గైడ్
ఎందుకు డౌన్‌లోడ్ అవుతాయి?
ఇలా యాప్స్ వాటికవే డౌన్‌లోడ్ అవడానికి చాలా కారణాలున్నాయి. ప్లేస్టోర్‌లో ఉన్న లక్షల యాప్స్‌లో కొన్ని మన డివైజ్‌కు హాని కలిగించేవి, మన డేటాను కొట్టేసే యాప్స్ కూడా ఉంటాయి. వీటిని రోగ్ యాప్స్ అంటారు. ఫ్రీ యాప్స్‌లో ఇలాంటి రోగ్ యాప్స్ లేదా రాంగ్ యాప్స్ ఉండే అవకాశాలు ఎక్కువ. అంతేకాదు ఫ్రీగా వచ్చే గేమింగ్ యాప్స్ కూడా ఇలాంటి రోగ్ యాప్స్‌ను వెంట తీసుకొస్తాయి. ఇవి మీ ఫోన్‌ను హ్యాక్ చేస్తాయి. దీంతో మీ ప్రమేయం లేకుండానే యాప్స్ ఫోన్లోకి డౌన్‌లోడ్ అయిపోతుంటాయి.
ఎలా హ్యాక్ అవుతుంది?
ఆండ్రాయిడ్ యాడ్ డెవలపర్స్ తమ యాడ్ ద్వారా డబ్బులు సంపాదించడానికి యాడ్ మాబ్ మీద ఆధారపడతారు. మీరు డౌన్‌లోడ్ చేసిన యాప్‌లో చాలా యాడ్ కోడ్స్ ఉండొచ్చు. ఆ యాప్ మీ ఆండ్రాయిడ్ ఎకోసిస్టమ్‌ను డిస్ట్రబ్ చేయడం మొదలుపెడుతుంది. ఆ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.. ఆ సర్వీస్ వాడుకోండి అంటూ పాప్ అప్ మెసేజ్‌లు రావడం మొదలవుతుంది. కొన్ని సందర్భాల్లో మీకు తెలియకుండానే యాప్స్ డౌన్‌లోడ్ అయిపోతుంటాయి. కొన్ని చెత్త యాప్స్ ఉంటాయి. అవైతే మీ ఆండ్రాయిడ్ పుష్ నోటిఫికేషన్స్‌ను నెగిటివ్‌గా వాడుకుంటాయి. మీకు తెలియకుండానే మీ ఫోన్ సిస్టమ్‌ను తమ చేతుల్లోకి తీసుకుంటాయి. అంతే మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో పనికొచ్చేవి, పనికిరానివి, చెత్తవి, రోగ్ యాప్స్ ఇలా అడ్డమైనవీ వాటికవే డౌన్‌లోడ్ అయ్యేలా చేస్తాయి.
ఎలా ఆపాలి?
ఈ సమస్యకు కారణాలు చాలా ఉన్నట్లే.. వీటికి పరిష్కారాలు కూడా ఎక్కువే ఉన్నాయి.
ఆండ్రాయిడ్ పుష్ నోటిఫికేషన్స్‌ను ఆఫ్ చేయండి
ఆండ్రాయిడ్ పుష్ నోటిఫికేషన్స్ వల్ల ఉపయోగాలున్నా అయితే వీటివల్ల సమస్యలు కూడా వస్తున్నందున ఈ నోటిఫికేషన్స్‌ను ఆఫ్ చేయడం మంచిది.
* సెట్టింగ్స్‌లోకి వెళ్లి యాప్స్ క్లిక్ చేయండి..
* ఇప్పుడు అప్లికేషన్ మేనేజర్‌ను టాప్ చేయండి.
* com.android.push.alarm అనే పేరుతో ఉన్న యాప్ కనిపిస్తుంది.
* దాన్ని క్లిక్ చేసి Force Stop నొక్కండి.
* తర్వాత Disable బటన్‌ను టాప్ చేయండి.
* అంతే మీ ఫోన్ ఎలాంటి ట్రోజన్స్ లేదా రోగ్ యాప్స్‌ను యాక్సెస్ చేయదు.
ట్రోజన్ కిల్లర్ యాప్ వాడండి
ట్రోజన్‌లను కంట్రోల్ చేయడానికి ట్రోజన్ కిల్లర్ ఆ యాప్స్ కూడా ఉన్నాయి. ప్లే స్టోర్‌లోకి వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోండి. Stubborn Trojan Killer లాంటి మంచి యాప్స్ చాలా ఉన్నాయి.
అవసరం లేని యాప్స్ తీసేయండి
ఫ్రీగా వస్తున్నాయి కదా అని పనికొచ్చేవి పనికిరానివి అన్ని యాప్స్ డౌన్‌లోడ్ చేసేస్తున్నారా.. ఇవి స్పేస్ తినేయడమే కాదు అనవసరమైన చిక్కులు తెచ్చిపెడతాయి.. వాటిని అన్ఇన్‌స్టాల్ చేసేయండి. అంతగా మీకు వాటితో అవసరం ఉంటే డౌన్‌లోడ్ చేసుకుని పనయ్యాక అన్ ఇన్‌స్టాల్ కొట్టేయండి.
గూగుల్ అకౌంట్ లాగవుట్ అండ్ లాగిన్
ఇప్పటికీ మీ సమస్య అలాగే ఉంది. అయితే మీ ఆండ్రాయిడ్ ఫోన్‌కి సింక్ అయి ఉన్న గూగుల్ అకౌంట్ కూడా దీనికి కారణమై ఉండొచ్చు. అందుకే మీ గూగుల్ అకౌంట్‌ను లాగవుట్ చేయండి. మీ ఫోన్ నుంచే కాదు దానికి సింక్ అయి ఉన్న అన్ని డివైస్‌ల నుంచి మీ గూగుల్ అకౌంట్‌ను లాగవుట్ కొట్టండి. ఇప్పుడు మీ గూగుల్ అకౌంట్ పాస్‌వర్డ్ మార్చండి. ఫ్రెష్‌గా మళ్లీ గూగుల్ అకౌంట్‌లోకి లాగిన్ అవండి.
బ్యాక్‌గ్రౌండ్ యూసేజ్‌ను ఆపేయండి
బ్యాక్‌గ్రౌండ్ డేటా యూసేజ్ వల్ల కూడా ఇలా యాప్స్ వాటంతటవే డౌన్‌లోడ్ అయ్యే ప్రమాదముంది. కాబట్టి బ్యాక్‌గ్రౌండ్ యూసేజ్‌ను ఆపేయండి.
* సెట్టింగ్స్‌లోకి వెళ్లి డేటా యూసేజ్‌ను టాప్ చేయండి.
* ఒక్కో యాప్‌ను క్లిక్ చేసుకుంటే వెళ్లండి
* వాటన్నింటికీ Restrict app background dataను క్లిక్ చేయండి.
సెక్యూరిటీ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి
మంచి క్వాలిటీ సెక్యూరిటీ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి.
ఆండà±à°°à°¾à°¯à°¿à°¡à± ఫోనà±â€Œà°²à±‹ యాపà±à°¸à± డౌనà±â€Œà°²à±‹à°¡à±â€Œ ఆండà±à°°à°¾à°¯à°¿à°¡à± సెకà±à°¯à±‚à°°à°¿à°Ÿà±€ à°ªà±à°°à°¾à°¬à±à°²â€Œà°®à±â€Œ Android Phone Downloading Apps by Itself Â