మీ సొంత గూగుల్ మ్యాప్ ని మీరే తయారు చేసుకోవడానికి ఫస్ట్ గైడ్

మన అవసరాలకు తగ్గట్టు కొన్ని అప్లికేషన్స్ ను మనమే తయారు చేసుకుంటే బాగుంటుందని అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటిప్పుడు ఏం చేస్తారు? మనకు కావాల్సిన యాప్ ల కోసం ప్లే స్టోర్లో వెతుకుతాం. అయితే మనం ఇలా వెతక్కుండానే కావాల్సిన యాప్ లను కూడా తయారు చేసుకునే అవకాశం ఉంది. గూగుల్ మ్యాప్స్ యాప్ ఇదే కోవకు చెందుతుంది. మనకు నచ్చినట్లుగా గూగుల్ మ్యాప్స్ ను తయారు చేసుకోవచ్చు. 

కస్టమ్స్ మ్యాప్

గూగుల్ మ్యాప్స్ డెస్క్ టాప్ వెర్షన్లో ఎడమ చేతి వైపు యువర్ ప్లేసెస్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. మీ అకౌంట్లోకి లాగిన్ అయ్యారో లేదో చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత మ్యాప్స్ మీద క్లిక్ చేయాలి. ఎడమవైపు క్రింది భాగంలో మీకు క్రియేట్ మ్యాప్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మ్యాప్ క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత అన్ టైటిల్డ్ మ్యాప్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన పేరు, టైటిల్ డిస్క్రిప్షన్ ఇవ్వాలి.

సెర్చ్ బాక్స్

సెర్చ్ బాక్స్ మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన లొకేషన్ ను ఎంచుకోవాలి. ఆ లొకేషన్ ను మీ మ్యాప్ కు యాడ్ చేసుకోవాలి. పారిస్ కు వెళ్లాలని అనుకుంటే మీ మ్యాప్ లో పారిస్ యాడ్ అవుతుంది. దీనిలో అంతా సమాచారం కూడా ఉంటుంది.  యాప్ టు మ్యాప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ లొకేషన్ లో ఎక్కడికి వెళ్లాలో పిన్ చేసుకోవచ్చు. మీరు పెట్టిన పిన్ లొకేషన్ సరిగా లేకపోతే అడ్జెస్ట్ చేసుకోవచ్చు. మీరు లొకేషన్ల కోసం డిఫరెంట్ కలర్స్ కూాడా యూజ్ చేెసుకోవచ్చు.  స్టయిల్ ఆప్షల్ ఇవి అందుబాటులో ఉంటాయి. అన్ని పూర్తయ్యాక మీ మ్యాప్ లను ప్రివ్యూ చూసుకుని వాటిని షేర్ చేయచ్చు. 

Own Custom Google Maps style security