సర్వేలు గురించి మనకు బాగా తెలుసు. ఏదైనా విషయం గురించి కులంకషంగా తెలుసుకోవడానికి అన్ని కంపెనీలు సర్వేలను ప్రతిపాదికగా తీసుకుంటాయి. ముఖ్యంగా ఆన్‌లైన్లో ఎన్నో రకాల సర్వేలు అందుబాటులో ఉంటాయి. వీటిలో ఎక్కువ పెయిడ్ సర్వేలే ఉంటాయి. అయితే మీ మొబైల్ ద్వారా కూడా సర్వేలు చేసుకోవచ్చన్న విషయం మీకు తెలుసా? .. ఇందుకోసం ఒక యాప్ ఉంది. దాని పేరే జోట్‌ఫ్రమ్. ఈ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడ నుంచైనా సులభంగా సర్వేలు చేయచ్చు. అన్నిటికన్నా విశేషం ఏమిటంటే ఆన్‌లైన్లోనే కాదు ఆఫ్‌లైన్‌లోనూ దీని ద్వారా మనం పని చేయచ్చు. మరి ఈ యాప్ సంగతేంటో చూద్దామా..
ఎలా పని చేస్తుంది?
జోట్‌ఫ్రమ్ యాప్ ఒక మొబైల్ బేస్డ్‌గా పని చేసే యాప్. ఇది సర్వేలను క్రియేట్ చేసి డిస్టిబ్యూట్ చేసి డేటాను కలెక్ట్ చేస్తుం. వెబ్‌సైట్ మాదిరిగా కాకుండా మీరు ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పుడు కూడా డేటాను లోకల్‌గా కలెక్ట్ చేసి ఆ తర్వాత ఇంటర్నెట్ కనెక్టివిటీ వచ్చిన తర్వాత మీ అకౌంట్‌తో సింక్ చేస్తుంది. ఇది లోకల్‌గా సర్వే చేయడం వల్ల ఆ డేటాను ఎప్పుడైనా వాడుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు వేరే యూజర్లు కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకపోయినా కూడా సర్వేలు ఫిల్ చేయచ్చు. వాటిని సబ్‌మిట్ చేయచ్చు. ఇంటర్నెట్ కనెక్టివిటీ వచ్చిన తర్వాత వాళ్లు చేసిన సర్వేలు మన అకౌంట్‌తో సింక్ అవుతాయి.
క్రియేట్ చేయండిలా..
1. బ్లాంక్ ఫామ్ ఇవ్వాలి
2. టెంప్లెట్ ఒక టి తీసుకుని యాడ్ చేయాలి
3. ఫామ్‌ను ఇంపోర్ట్ చేసుకోవాలి.
4.సెట్టింగ్‌లోకి వెళ్లి ఆ ఫామ్‌ను బిల్డ్ ఆప్షన్ ద్వారా సర్వేగా బిల్డ్ చేయాలి
5. ఆ తర్వాత పబ్లిష్ సెక్షన్‌కు వెళ్లి వర్డ్ ప్రెస్, జొయ్, ఫేస్‌బుక్, టంబ్లర్ ద్వారా పబ్లిష్ చేయాలి.
CONDUCT OFFLINE SURVEY MOBILE JotForm