లాక్‌డౌన్‌లో అంత‌ర్రాష్ట్ర ప్ర‌యాణానికి ఈ పాస్ పొంద‌డానికి సింపుల్ గైడ్‌

క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అడ్డుకోవ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం తెచ్చిన లాక్‌డౌన్‌ను నాలుగోసారి పొడిగించింది. మే 31 వ‌ర‌కు లాక్‌డౌన్ కొన‌సాగుతుంది. వ్యాపారాల‌కు, లోక‌ల్ ప్రయాణాల‌కు కొన్ని ప‌రిమితుల‌తో స‌డ‌లింపు కూడా ఇచ్చింది. అయితే ఒక రాష్ట్రం నుంచి మ‌రో రాష్ట్రానికి వెళ్లాలంటే మాత్రం ప‌ర్మిష‌న్ త‌ప్ప‌నిస‌రి. దానికోసం ఈ పాస్ తీసుకోవాలి. ఈపాస్ ఎలా తీసుకోవాలో చెప్పేదే ఈ సింపుల్ గైడ్‌. 

అత్య‌వ‌స‌ర ప‌నుల మీద తాము ఉన్న చోట నుంచి వేరే రాష్ట్రంలో ఉన్న త‌మ స్వ‌స్థలాల‌కు వెళ్లేవారికోసం లాక్డౌన్‌లో ప్ర‌భుత్వం స‌డ‌లింపులు ఇచ్చింది. ఈ ప్ర‌యాణానికి పాస్‌లు ఇచ్చేందుకు నేష‌న‌ల్ ఇన్ఫ‌ర్మేటిక్స్ సెంట‌ర్ ఒక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసింది.

ఈ పాస్ పొంద‌డం ఎలా?
*మీ వెబ్‌బ్రౌజ‌ర్‌లో http://serviceonline.gov.in/epass/ను టైప్ చేయండి.  

* ఇది ఒక సింగిల్ పాయింట్ యాక్సెస్ వెబ్‌సైట్‌. దీని ద్వారా ఇండియాలోని 17 రాష్ట్ర్రాలు  ఈపాస్‌లు ఇస్తున్నాయి. 

* మీరు మీ స్వ‌స్థ‌లం ఎంట‌ర్ చేసి, రాష్ట్రాన్ని సెలెక్ట్ చేయ‌గానే వెబ్‌సైట్ ఆ రాష్ట్ర ప్ర‌భుత్వ ఈపాస్ వెబ్‌సైట్‌కు డైరెక్ట్ చేస్తుంది.  

* ఇక్క‌డ మీ ఫోన్ నెంబ‌ర్ ఎంట‌ర్ చేసి ఓటీపీతో వెరిఫై చేయాలి. 

* త‌ర్వాత మీ డిటెయిల్స్ ఎంట‌ర్ చేసి స‌బ్మిట్ చేయాలి.

* సంబంధిత అధికారులు మీ వివ‌రాలు చూసి మీకు ఈపాస్ ఇవ్వ‌చ్చో లేదో నిర్ణ‌యిస్తారు. 

*  ఈపాస్ ఇష్యూ అయితే మీ ఫోన్‌కు ఒక మెసేజ్ వ‌స్తుంది. దానిలో ఉన్న లింక్‌ను క్లిక్‌చేసి ఈ పాస్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.

 

Lockdown Interstate travel e-pass how to get an e-pass India E-pass website India E-pass Apply for India E-pass E-pass for coronavirus  అంత‌ర్రాష్ట్ర ప్ర‌యాణానికి ఈ పాస్  లాక్‌డౌన్‌లో అంత‌ర్రాష్ట్ర ప్ర‌యాణానికి ఈ పాస్