స్మార్ట్‌ఫోన్ సెకండ్ హ్యాండ్ కొనాలా, వ‌ద్దా చెప్పే క్విక్ గైడ్‌

స్మార్ట్‌ఫోన్ సెకండ్ హ్యండ్ కొనొచ్చా?  చాలామందికి ఎప్పుడో ఒక‌ప్పుడు వ‌చ్చే డౌట్ ఇది.  ఒక‌ప్పుడు స్మార్ట్‌ఫోన్ రేట్లు చాలా ఎక్కువ‌గా ఉండేవి. జ‌నం కూడా దానికోసం వేల‌కు వేలు పెట్టేవారు కాదు.  కాల్ ఆన్స‌ర్ చేయ‌డానికి ప‌చ్చ‌బ‌ట‌న్‌, రిజెక్ట్ చేయ‌డానికి ఎర్ర‌బ‌ట‌న్ ఉండే ఫీచ‌ర్ ఫోన్లు చాల‌నుకునేవారు. కానీ డేటా చౌక‌వ‌డం, స్మార్ట్‌ఫోన్లు అందుబాటు ధ‌ర‌లోకి రావ‌డం, ఆన్‌లైన్‌తో, ఇంట‌ర్నెట్‌తో జ‌నానికి అవ‌స‌రం పెర‌గ‌డంతో ఇప్పుడు  కాలేజ్ పిల్ల‌ల నుంచి ముస‌లివారి వ‌రకు అంద‌రూ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారు. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొత్త‌వే కొనాలా?  సెకండ్ హ్యాండ్ దొరికితే కొనుక్కోవ‌చ్చా అని చెప్పే క్విక్ గైడ్ ఇది. 

ఎందుకు కొనొచ్చు? ఎప్పుడు కొనొచ్చు?
సెకండ్ హ్యాండ్ ఫోన్ తక్కువ ధ‌ర‌కు దొరుకుతుంది. కానీ దాన్ని కొన‌డంలో కాస్త తెలివి ఉండాలి. 

* సెకండ్ హ్యాండ్ ఫోన్ తెలిసిన‌వాళ్ల ద‌గ్గర లేదా పెద్ద షాపుల్లో అయితేనే కొనండి.

* మీకు ఆల్రెడీ ఒక ఫోన్ ఉండి సెకండ్ ఫోన్‌గా ఇంకో స్మార్ట్‌ఫోన్ కావాల‌నుకుంటే అప్పుడు సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనుక్కోవ‌చ్చు. కానీ మీ ఫ‌స్ట్ ఫోనే సెకండ్ హ్యాండ్‌ది కొన‌కూడ‌దు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఏదైనా రిపేర్ వ‌స్తే మీ చేతిలో ఫోన్ లేకుండా అయిపోతుంది. 

* సెకండ్ హ్యాండ్ ఫోన్ వారంటీలో ఉంటేనే కొనాలి. లేదంటే రిపేర్ వ‌స్తే దాన్ని స‌రి చేయించుకునేస‌రికి మీ జేబుకు చిల్లు ప‌డుతుంది.   

* చాలామంది ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త మోడ‌ల్ స్మార్ట్‌ఫోన్‌కు వెంట‌వెంట‌నే అప్‌డేట్ అయిపోతుంటారు. మూడు, నాలుగు నెల‌ల‌కు కూడా ఫోన్లు మార్చే కాలేజ్ కుర్రాళ్లున్నారు. కొంత‌మంది వ‌ర్కింగ్ ప్రొఫెష‌న‌ల్స్‌, కొత్త టెక్నాల‌జీని వెంటనే అందిపుచ్చుకోవాల‌నుకునేవాళ్లు కూడా వెంట‌వెంట‌నే ఫోన్లు మారుస్తుంటారు. ఇలాంటి వారి ఫోన్లు అమ్ముతుంటే కొనుక్కోవ‌చ్చు.  

* ఒక్క‌రోజు వాడినా అది సెకండ్  హ్యాండ్ ఫోనే కాబ‌ట్టి బాగా బేరం ఆడండి. 40% నుంచి 50% వ‌ర‌కు ధ‌ర త‌గ్గించమ‌ని అడ‌గండి.

* సెకండ్ హ్యాండ్ ఫోన్లు అమ్మే వెబ్‌సైట్లు, మార్ట్‌లు కూడా ఉన్నాయి. వాటిలో జాగ్ర‌త్త‌గా సెలెక్ట్ చేసుకుని కొనుక్కోవ‌చ్చు. అయితే రిఫ‌ర్బిష్డ్ (పాత ఫోన్ల‌కు పార్ట్‌లు మార్చి అమ్మే) ఫోన్లుంటాయి. జాగ్ర‌త్త‌. 

ఎందుకు కొన‌కూడ‌దు? ఎప్పుడు కొన‌కూడ‌దు?
* ముక్కూమొహం తెలియ‌నివాళ్ల ద‌గ్గ‌ర ఫోన్లు కొన‌కండి. ఎందుకంటే అది దొంగిలించింది అయి ఉండొచ్చు. అంతేకాదు ఆ ఫోన్‌ను వాళ్లు వేరే ఏదైనా అసాంఘిక కార్య‌క‌లాపాల‌కు వాడి ఉండొచ్చు.  అలాంటిది ఏమైనా ఉంటే ఐఎంఈఐ నెంబ‌ర్ ద్వారా ఆ ఫోన్‌ను ట్రేస్ చేస్తే మీరు బుక్క‌వుతారు.

* కొంత‌మంది స్మార్ట్‌ఫోన్‌ను బాగా ర‌ఫ్‌గా వాడ‌తారు. ఆ త‌ర్వాత వాటికి చీప్ పార్ట్‌లు వేయించి అమ్మేస్తారు. అలాంటి వాటి బారిన‌ప‌డ‌కుండా ఉండాలంటే ఫోన్‌ను జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించాలి. ఫోన్ కేసు, స్క్రీన్‌, ప‌వ‌ర్‌,వాల్యూమ్ బ‌ట‌న్స్ బాగా కొత్త‌గా క‌నిపిస్తే లోతుగా ప‌రిశీలించండి. అది ఒరిజిన‌లా డూప్లికేట్ అనేది మీకే అర్ధ‌మైపోతుంది. అలాంటి వాటిని కొన‌కండి. 
 

సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్‌ స్మార్ట్‌ఫోన్ బ‌యింగ్ టిప్స్‌ Smartphone buying tips Second Hand Smartphones Â