ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నాం అంటే కచ్చితంగా మనం ప్రపంచానికి అందుబాటులో ఉన్నట్లే. మనం ఏం చేస్తున్నామో.. ఎక్కడున్నామో.. ఏం తిన్నామో.. ఎక్కడికి వెళుతున్నామో కూడా ఆండ్రాయిడ్ ట్రాకింగ్ ద్వారా చెప్పేయచ్చు. హ్యాకర్లు చేసే పనే ఇది. మనకు సంబంధించిన సున్నితమైన విషయాలను తెలుసుకుని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించడం ఇప్పుడు హ్యాకింగ్‌లో ఒక భాగం అయిపోయింది. మరి మన ఆండ్రాయిడ్ హ్యాకర్లకు చిక్కకూడదనుకున్నా.. లేదా మన డేటా సేఫ్‌గా ఉండాలన్నా మంచి సెక్యూరిటీ కావాలి. అందుకు చాలా యాప్‌లు ఉన్నాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మరి అలాంటి యాప్‌లు ఏంటో చూద్దామా..
అవాస్ట్ మొబైల్ సెక్యూరిటీ
మొబైల్ ఫోన్లకు రక్షణ కల్పించడంలో ద బెస్ట్ సెక్యూరిటీ యాప్స్‌లో అవాస్ట్ ఒకటి. దీనిలో చాలా ఆప్షన్లు మనకు అందుబాటులో ఉన్నాయి. ఫ్రీ వెర్షన్ ద్వారా మనకు ఉచితంగా ఫైర్‌వాల్, యాంటీ థెప్ట్, కాల్ బ్లాకింగ్ లాంటి సదుపాయాలు లభిస్తాయి. యాప్ లాకింగ్‌తో పాటు ప్రిమియం వెర్షన్లో వీపీఎన్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఫ్రీ వెర్షన్లో యాడ్స్ ఉండడమే కాస్త ఇబ్బంది కలిగించే విషయం.
బిట్ డిఫెండర్
మన మొబైల్‌ను హ్యాకర్ల నుంచి కాపాడేందుకు బిట్ డిఫెండర్ ద బెస్ట్ యాప్ అని చెప్పుకోవచ్చు. దీనికి తక్కువ స్థాయి ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నా సరిపోతుంది. యాంటీ థెప్ట్, వీపీఎన్, ర్యామ్సమ్వైర్ ప్రొటెక్షన్ లాంటి మైరైడ్ ఫీచర్లు దీనిలో ఉన్నాయి. రిమోట్ కంట్రోల్, మోనిటరింగ్ దీనిలో అదనపు ప్రత్యేకతలు. అయితే స్కానింగ్‌ను షెడ్యూల్డ్ లేదా మాన్యువల్‌గా చేసుకోవాల్సి ఉంటుంది.
కాస్పర్‌స్కై
మొబైల్‌ను సైబర్ దాడుల నుంచి కాపాడడంలో కాస్పర్ స్కై కూడా బాగా యూజ్ అవుతుంది. ద చీఫ్ అండ్ బెస్ట్‌గా కూడా దీన్ని చెప్పుకోవచ్చు. మంచి మాల్వేర్ ప్రొటెక్షన్, 20 డివైజ్‌లను ప్రొటెక్ట్ చేసే సత్తా ఉండడం, పేరంటల్ కంట్రోల్, పాస్వర్డ్ మేనేజ్మెంట్, వీపీఎన్ లాంటి ఫీచర్లు దీనిలో ఉన్నాయి. సెక్యూరిటీని మేనేజ్ చేయడానికి ఆన్లైన్ డాష్‌బోర్డు కూడా ఉంది.
మెకాఫె
ఆన్లైన్ దాడుల నుంచి ఫోన్‌ను రక్షించుకోవడానికి మెకాఫె సాఫ్ట్వేర్ కూడా బాగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఇన్ ఎక్స్‌పెన్సీవ్ 10 లైసెన్స్ వెర్షన్లో ఇది అందుబాటులో ఉంది. యాప్ డేటా లీకేజ్‌ని ఇది పసిగడుతుంది. యాంటీ ఫిషింగ్ సపోర్ట్ చాలా బలంగా ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ర్యామ్సన్వేర్ ప్రొటెక్షన్ ఇస్తుంది.
Best Android Antivirus Security Apps