ఆండ్రాయిడ్‌లో నోటిఫికేష‌న్‌ని షెడ్యూల్ చేసే అద్భుత యాప్ -డేవైజ్‌

ఆండ్రాయిడ్ నోటిఫికేష‌న్ల‌ను షెడ్యూల్ చేసే ఉచిత ఆండ్రాయిడ్ యాప్ గురించి ఈ ఆర్టిక‌ల్‌లో తెలుసుకుందాం. ప్రస్తుత మొబైళ్ల‌లో ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో మ‌న‌కు చికాకు క‌లిగించే అంశం నోటిఫికేష‌న్స్ ! మ‌న‌మేదో ఇంట్ర‌స్టింగ్‌గా వ‌ర్క్ చేసుకుంటూ ఉంటే.. ఇంత‌లోనే మ‌న ఏకాగ్ర‌త‌ను భ‌గ్నం చేస్తూ.. నోటిఫికేష‌న్లు.. హోరెత్తి.. మ‌న‌కు చిర్రెక్కిస్తుంటాయి. నిజానికి ఫోన్ల‌లో ఎన్ని ఎక్కువ యాప్‌లు ఉంటే.. అన్ని ఎక్కువ నోటిఫికేష‌న్లు మ‌న బ్రెయిన్ తినేస్తుంటాయి. గ‌తంలో ఒక యాప్ ద్వారానే మ‌న‌కు కావాల్సిన నోటిఫికేష‌న్ల‌ను పొందేవాళ్లం. కానీ, ఇప్పుడు యాప్‌ల సంఖ్య పెర‌గ‌డంతో నిత్యం మ‌న ఫోన్‌కు జోరెత్తే నోటిఫికేష‌న్ల సంఖ్య కూడా మ‌హా జోరుగానే ఉంటోంది.

మ‌రి వీటిని అరిక‌ట్ట‌డం ఎలా? మ‌న ఏకాగ్ర‌త‌కు భంగం వాటిల్ల‌కుండా మ‌న ప‌ని మ‌నం చేసుకోవ‌డం ఎలా? అనే అంశ‌మే ఇప్పుడు ప్ర‌ధానం. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం అందుబాటులోకి వ‌చ్చింది. ఓఎస్ ఆండ్రాయిడ్‌(పై అండ్ క్యూ) యాప్.. డేవైజ్‌. దీని ద్వారా నోటిఫికేష‌న్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం చూపుతోంది. దీనివ‌ల్ల ఖ‌చ్చితంగా మీరు అన‌వ‌స‌ర‌మైన నోటిఫికేష‌న్ల నుంచి ఇబ్బందులు త‌గ్గించుకోవ‌చ్చు. అయితే, మ‌న‌కు వ‌చ్చే నోటిఫికేష‌న్ల‌లో ఏవి ముఖ్య‌మైనవి.. ఏవి కాదు అనేవి గుర్తించ‌డం ద్వారా అంత‌రాయాల‌ను త‌గ్గించుకునే వెసులుబాటు ఉంటుంది. 

డేవైజ్‌: ఇది ఒక ఉచిత ఆండ్రాయిడ్ యాప్‌. ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో నోటిఫికేష‌న్ల‌ను దీనిద్వారా మీరు షెడ్యూల్ చేసుకోవ‌చ్చు. ఈ యాప్‌ను ఉప‌యోగించి నోటిఫికేష‌న్ల‌ను 4 విభాగాలుగా వ‌ర్గీక‌రించుకునే వెసులుబాటు ఉంది. ఫోన్ల‌కు వ‌చ్చే నోటిఫికేష‌న్ల‌ను అన్నింటినీ ఇది స్వీక‌రించి స‌మ‌యానుకూలంగా మీకు చేర‌వేస్తుంది. ఫ‌లితంగా మ‌న‌కు ఎలాంటి అంత‌రాయం లేని విధంగా ఉంటుంది. ప‌నికి ఎలాంటి ఆటంకం కూడా ఉండ‌దు. ఒక‌వేళ ఏదైనా నోటిఫికేష‌న్ చాలా ముఖ్య‌మైందైతే దానికి సంబంధించిన యాప్‌ల‌కు అనుమ‌తించ‌డం ద్వారా విడిగా కూడా నోటిఫికేష‌న్ల‌ను పొందే సౌక‌ర్యం ఉంటుంది. అదేస‌మ‌యంలో కొన్ని ముఖ్య‌మైన కాంటాక్టుల‌కు సంబంధించిన నోటిఫికేష‌న్ల‌ను కూడా వైట్‌లిస్ట్‌లో మ‌నం పొందే సౌక‌ర్యం ఉంది. సో.. ఎంతో ఉప‌యుక్త‌మైన డేవైజ్ యాప్ ఎలా ప‌నిచేస్తుందో తెలుసుకుందాం.

ఆండ్రాయిడ్ నోటిఫికేష‌న్ల‌ను షెడ్యూల్ చేయ‌డం: అన‌వ‌స‌ర‌మైన వాటి నుంచి దూరంగా ఉండ‌డం
డేవైజ్ యాప్ అనేది అన‌వ‌స‌ర‌మైన నోటిఫికేష‌న్ల‌ను మ‌న‌కు దూరంగా ఉంచి, మ‌నం చేసుకునే ప‌నికి ఎలాంటి అవాంత‌రాలు లేకుండా చేస్తుంది. ముఖ్య‌మైన నోటిఫికేష‌న్ల‌ను మ‌న‌కు చూపుతూ.. అంత ఇంపార్టెంట్ కాని వాటిని త‌ర్వాత చెక్‌చేసుకునే వెసులుబాటు క‌లిగి ఉంది. 

నోటిఫికేష‌న్ షెడ్యూల్‌:
ఈ విధానం.. ఆండ్రాయిడ్‌ ఫోన్ల‌లో అందుబాటులో ఉంది. ఉద‌యం, మ‌ధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అనే నాలుగు విభాగాలుగా ఇది ఉంటుంది. నోటిఫికేష‌న్ల‌ను ఈమూడు త‌ర‌గ‌తులుగా విభ‌జించే వెసులుబాటు డేవైజ్‌లో అందుబాటులో ఉంటుంది. 

డేవైజ్ యాప్‌ను తొలిసారి ఇన్‌స్టాల్ చేసుకున్నాక మ‌న‌కు నాలుగు తర‌గ‌తులు లేదా విభాగాలు క‌నిపిస్తాయి. ఉద‌యం, మ‌ధ్యాహ్నం(లంచ్‌), సాయంత్రం, రాత్రి. ఆయా స‌మ‌యాల్లో ఇవి నోటిఫికేష‌న్ల‌ను సేక‌రించి పెడ‌తాయి. మీకు అనువైన స‌మ‌యాల్లో వాటిని డిస్‌ప్లే చేస్తుంది. ఈ క్ర‌మంలో మీ బ్యాచ్ టైమ్‌ను ఫిక్స్ చేసుకుంటే స‌రిపోతుంది. ఒక‌సారి షెడ్యూల్ క్రియేట్ చేసుకున్నాక వాటిని ఫాలో కావొచ్చు. 
గ‌మ‌నిక‌: ఈ యాప్‌ను ఎంచుకుని, దీనికి రీడ్ నోటిఫికేష‌న్ ప‌ర్మిష‌న్స్ ఇచ్చిన వెంట‌నే అది ప‌నిచేయ‌డం ప్రారంభిస్తుంది. 

యాప్స్ నియ‌మాలు:

డేవైజ్ యాప్‌లో నోటిఫికేష‌న్ల బ్యాచ్‌ల‌ను ఏర్పాటు చేసుకున్న త‌ర్వాత ఈ యాప్‌మీకు యాప్ జాబితాను చూపిస్తుంది. దీనిలో రెండు వేర్వేరు సెక్ష‌న్‌లు ఉంటాయి. ఇప్ప‌టికిప్పుడు(ఇన్‌స్టంట్‌), బ్యాచ్‌(మీరు ఎంచుకున్న‌ది) అనే రెండు విభాగాలు ఉంటాయి. ఇప్ప‌టికిప్పుడు అనే విధానం ఎంచుకుంటే.. నోటిఫికేష‌న్ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు మీకు చూపిస్తుంది. అలాకాకుండా బ్యాచ్‌ల విధానంలో మీరు ఎంచుకుంటే.. ఆయా స‌మయాల్లోనే ఆయా నోటిఫికేష‌న్లు ఫోన్ తెర‌పై క‌నిపిస్తాయి. అదేస‌మ‌యంలో మీ ప్రాధాన్యాల‌ను అనుస‌రించి యాప్‌ను మేనేజ్ చేసుకోవ‌చ్చు. అదేవిధంగా ఒక బ్యాచ్‌లో వ‌చ్చిన నోటిఫికేష‌న్‌ను మ‌రో బ్యాచ్‌కు కూడా బ‌దిలీ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఫ‌లితంగా అత్యంత కీల‌క‌మైన‌, ముఖ్య‌మైన నోటిఫికేష‌న్ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకోవ‌డంతోపాటు.. అంత ఇంపార్టెంట్ కానివాటిని త‌ర్వాత బ్యాచ్‌ల వారీగా తెలుసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. ఇక్క‌డితో యాప్ మేనేజ్‌మెంట్ ముగుస్తుంది. 

కాంటాక్ట్ రూల్స్‌:

డేవైజ్ యాప్‌లోని మ‌రో సౌల‌భ్యం ఏంటంటే.. మీ కాంటాక్ట్ జాబితా నుంచి వ‌చ్చే ముఖ్య‌మైన నోటిఫికేష‌న్ల‌ను షెడ్యూల్ చేయ‌డం. యాప్‌లోని ఈ అసిస్టెంట్ సెక్ష‌న్ ద్వారా కాంటాక్ట్‌ల నుంచి వ‌చ్చే నోటిఫికేష‌న్ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు లేదా బ్యాచ్‌ల వారీగా పైన చెప్పుకొన్న‌ట్టు నిర్దేశించుకునే వెసులుబాటు ఉంటుంది. 

నోటిఫికేష‌న్ బ్యాచ్ ప‌రిశీల‌న‌:

ఆండ్రాయిడ్ ఫోన్‌లోని ఇన్‌బాక్స్ సెక్ష‌న్‌లో ప్ర‌స్తుత బ్యాచ్ స‌మ‌యాన్ని మీకు చూపిస్తుంది. ఒక‌వేళ స‌ద‌రు బ్యాచ్ స‌మ‌యం ముగిసిపోతే.. పెండింగ్ నోటిఫికేష‌న్ల‌ను ఇది తెలియ‌జేస్తుంది. అనంత‌రం త‌ర్వాత బ్యాచ్ స‌మ‌యాన్ని చూపిస్తుంది. త‌ర్వాత మీరు నోటిఫికేష‌న్ల‌ను మిస్ కాకుండా చూసుకునే వెసులు బాటు ఉంటుంది. 

ఫోన్ వినియోగించే అల‌వాటు:

డేవైజ్ యాప్ కేవ‌లం నోటిఫికేష‌న్ల‌కే కాకుండా మీరు ఫోన్ వినియోగించే అల‌వాటు(స‌మ‌యాలు)ను కూడా న‌మోదు చేస్తుంది. దీనికిగాను యూసేజ్ యాక్స‌స్ ప‌ర్మిష‌న్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. వెంట‌నే ఈ యాప్ మీ ఫోన్ వినియోగాన్ని కూడా న‌మోదు చేయ‌డం ప్రారంభిస్తుంది. ఎన్ని నోటిఫికేష‌న్లు వ‌చ్చాయి. వాటిలో ఇప్ప‌టికిప్పుడు చూడాల్సిన‌వి, లేదా బ్యాచ్‌ల వారీగా ఎంచుకున్న‌వి కూడా చూపిస్తుంది. అదేస‌మ‌యంలోఫోన్‌ను మీరు ఎన్ని గంట‌లు వినియోగించారు అనే విష‌యాన్నిటైం గ్రాఫ్‌తో స‌హా చూపిస్తుంది. 

చివ‌ర‌గా:

డేవైజ్ యాప్ నిజంగా ఓ నైస్ యాప్. దీనిద్వారా మ‌న‌కు చిరాకు క‌లిగించే నోటిఫికేష‌న్ల నుంచి దూరంగా ఉండ‌డమే కాకుండా మ‌న నోటిఫికేష్ల‌ను షెడ్యూల్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అన‌వ‌స‌రం అనుకున్న వాటిని నిలుపుద‌ల చేసుకునే సౌక‌ర్యం కూడా ఉంటుంది.  సో.. ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగ‌దారుల‌కు ఈ యాప్ అత్యుత్త‌మ‌మైంద‌ని చెప్ప‌డంలో సందేహం లేదు.

notifications yaap