ఇండియా అంతా లాక్డౌన్. అత్యవసర వస్తువులమ్మే దుకాణాలకు మాత్రం వెసులుబాటు. అందులో మందుల షాపులూ ఉన్నాయి. అయితే అన్ని షాపుల్లోనూ అన్ని రకాల మందులు దొరకడం కష్టంగా మారుతోంది. లాక్డౌన్తో మందుల పరిశ్రమల్లో అనుకున్నంత ప్రొడక్షన్ లేకపోవడం, ప్యాకింగ్, ట్రాన్స్పోర్టేషన్కు మ్యాన్పవర్ లేకపోవడంతో మెడిసిన్స్ తక్కువగా దొరుకుతున్నాయి. ఏదైనా ఒక మెడిసిన్ కావాలంటే రెండు, మూడు షాపులు తిరగాల్సి వస్తోంది. పైగా వెళ్లినచోటల్లా బోల్డంత లైన్. ఇంతసేపు లైన్లో నుంచున్నా చివరికి ఆ మెడిసిన్ దొరుకుతుందో లేదో అన్న టెన్షన్. వీటికి పరిష్కారమే ఫార్మసీ యాప్స్.
ఆన్లైన్ ఆర్డర్.. ఇంటికే మెడిసిన్
ఈ యాప్స్ ద్వారా మీరు కావాల్సిన మెడిసిన్స్ ఆన్లైన్లో ఆర్డరిస్తే ఇంటికే వచ్చేస్తాయి. కాకపోతే ఇదివరకు ఒక రోజులో వచ్చేసేవి. ఇప్పుడు లాక్డౌన్ పరిస్థితుల్లో రెండు, మూడు రోజులు పడుతుంది. కాస్త ఎర్లీగా ఆర్డర్ చేస్తే టైమ్కు మెడిసిన్స్ పొందవచ్చు. వాస్తవానికి ఈ యాప్స్ అన్నీ అగ్రిగేటర్లే. అంటే వాళ్ల దగ్గర రిజిస్టర్ చేసుకున్న మెడికల్ షాప్స్లో నుంచి మనకు అవసరమైన మెడిసిన్ను తీసుకుని మనకు పంపిస్తాయి. మనకు అందుబాటులో ఉన్న ఫార్మసీ యాప్స్లో బెస్ట్ 5 యాప్స్ ఇవే
1ఎంజీ
ఆన్లైన్ ఫార్మసీ యాప్స్లో నెంబర్ వన్ అని చెప్పుకోదగ్గ యాప్ 1 ఎంజీ (1mg). దీనిలో అల్లోపతి (ఇంగ్లీష్) మెడిసిన్స్తోపాటు హోమియోపతి, ఆయుర్వే మందులు కూడా దొరుకుతాయి. ఇండియాలోని 1200 పట్టణాలు, నగరాలకు ఈ యాప్ డెలివరీ చేస్తుంది. 20 శాతం వరకు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. డాక్టర్ ప్రిస్కిప్షన్ యాడ్ చేస్తే నేరుగా దాన్ని స్కాన్ చేసి మొత్తం మందులు పంపిస్తుంది. లేదంటే మీకు కావాల్సిన మందు తెప్పించుకోవచ్చు. మనం వెతుకుతున్న మెడిసిన్ లేకపోతే దానికి
ఆల్టర్నేటివ్గా ఉన్న మందులు ఏమిటో కూడా చూపిస్తుంది. వీటిలో డయాగ్నస్టిక్ టెస్ట్లు, డాక్టర్ అపాయింట్మెంట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు.
మెడ్లైఫ్
ఆన్లైన్ ఫార్మసీ యాప్స్లో చెప్పుకోదగ్గ మరో యాప్ మెడ్లైఫ్ (Medlife). దీనిలోనూ అన్ని రకాల మందులు దొరుకుతాయి. ఇండియాలోని 2500 పట్టణాలు, 25 వేల పిన్కోడ్లు ఈ యాప్ మెడిసిన్స్ డెలివరీ చేస్తుంది. దీనిలో డిస్కౌంట్ కూడా పొందవచ్చు. డాక్టర్ ప్రిస్కిప్షన్ యాడ్ చేస్తే నేరుగా దాన్ని స్కాన్ చేసి మొత్తం మందులు పంపిస్తుంది. లేదంటే మీకు కావాల్సిన మందు తెప్పించుకోవచ్చు. వీటిలో డయాగ్నస్టిక్ టెస్ట్లు, డాక్టర్ అపాయింట్మెంట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు.
నెట్మెడ్స్
నెట్మెడ్స్ (Netmeds) కూడా బాగా పేరున్న యాప్. అన్ని రకాల మెడిసిన్స్ సప్లై చేస్తుంది. దీంతోపాటు డయాగ్నస్టిక్ పరీక్షలు, డాక్టర్ కన్సల్టేషన్స్ కూడా బుక్ చేసుకునే సదుపాయం ఉంది.
ఫార్మ్ ఈజీ
మరో హై రేటింగ్ ఉన్న ఫార్మసీ యాప్ ఫార్మ్ ఈజీ (PharmEasy). కొన్ని ఎంపిక చేసిన నగరాల్లోనే 24 నుంచి 48 గంటల్లోనే డెలివరీ ఇస్తుంది. లక్ష రకాల మందులు దీనిలో అందుబాటులో ఉన్నాయి. 22వేల పిన్ కోడ్స్ ఉన్న ప్రాంతాలకు మెడిసిన్స్ అందించగలదు. డయాగ్నస్టిక్ పరీక్షలు కూడా బుక్ చేసుకోవచ్చు.
సస్తా సుందర్ (SastaSundar)
మందులతోపాటు వెల్నెస్ ప్రొడక్ట్లు కూడా అందించగలిగే యాప్ సస్తా సుందర్ (SastaSundar). 15% వరకు డిస్కౌంట్ కూడా ఇస్తుంది. దీనిలో కూడా డాక్టర్ అపాయింట్మెంట్స్, డయాగ్నస్టిక్ టెస్ట్లకు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు.
online medicines online medicines apps Pharma apps 1mg  Medlife  Netmeds  PharmEasy SastaSundar ఆనà±â€Œà°²à±ˆà°¨à± మెడిసినౠయాపà±à°¸à±â€Œ ఫారà±à°®â€Œà°¸à±€ యాపà±à°¸à±â€Œ 1ఎంజీ మెడà±â€Œà°²à±ˆà°«à±  నెటà±â€Œà°®à±†à°¡à±à°¸à± ఫారà±à°®à±à°ˆà°œà±€ స‌సà±à°¤à°¾ à°¸à±à°‚ద‌రౠÂ