ఇంటర్నెట్ అంటేనే ఒక అద్భుత ప్రపంచం. దీనిలో మనకు కావాల్సినవి ఉంటాయి.. అవసరం లేనివి కూడ ఉంటాయి. అయితే మనకు కావాల్సిన వాటిని ఎంచుకుని అవసమైన వాటిని వదిలి పెట్టడమే తెలివిగలవాళ్లు చేసే పని. ఇంటర్నెట్‌ను సరిగా యూజ్ చేసుకుంటే మనం ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. వీటిలో ఆన్‌లైన్ కోర్సులు చాలా ముఖ్యమైనవి. బయట నేర్చుకోవాలంటే వేలకు వేలు పోయాల్సి వచ్చే కోర్సులు కూడా మనం ఆన్‌లైన్‌లో ఉచితంగా నేర్చుకోవచ్చు. మరి అలాంటి కోర్సులేవున్నాయో చూద్దామా..
కోర్స్ రూట్
ఆన్‌లైన్‌లో కోర్సులు నేర్చుకోవడానికి బెస్ట్ సైట్లలో ఇదొకటి. ఉచితంగా లభించే ఈ సైట్‌లో మనకు నచ్చిన ఎన్నో రకాలసై
సైట్లు అందుబాటులో ఉంటాయి. దీనిలో 80000 వరకు కోర్సులు ఉన్నాయంటేనే ఇదెంత విస్తృతంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ సైట్ ద్వారా సైన్స్ అండ్ ఇంజనీరింగ్, సోషల్ సైన్సెస్, బిజినెస్, ప్రొగ్రామింగ్, డేటా సైన్స్, లాంగ్వేజ్, కంప్యూటర్ సైన్స్, ఆర్ట్ అండ్ డిజైన్ లాంటి కోర్సులు దీనిలో ఉన్నాయి. దీనిలో ఫిల్టర్ ఆప్షన్ కూడా ఉంది. దీనికి రేటింగ్స్ కూడా ఉంటాయి.. దాన్ని బట్టి మీరు కోర్సును ఎంచుకోవచ్చు.
క్లాస్ సెంట్రల్
ఆన్‌లైన్‌లో ఉచితంగా కోర్సులు నేర్చుకోవడానికి మరో బెస్ట్ ఆప్షన్ క్లాస్ సెంట్రల్. క్రాస్ రూట్ మాదిరిగానే ఇది కూడా ఎన్నో విలువైన కోర్సులను ఉచితంగా అందిస్తోంది. ఈ యాప్‌ను ఓపెన్ చేసి అందులో సెర్చ్ బాక్స్‌లోకి వెళ్లి మీకు అవసరమైన సబ్జెక్ట్‌లను బ్రౌజ్ చేసకోవచ్చు. మ్యాథ్స్, సైన్స్, సోషల్ సైన్సెస్, ఎడ్యుకేషన్ టీచింగ్, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, పర్సనల్ డెవెలప్‌మెంట్, ఇంజనీరింగ్, ప్రొగ్రామింగ్ లాంటి కోర్సులు ఇందులో ఉన్నాయి
ఓఈ కన్సర్టియమ్
ఓఈ కన్సర్టియమ్ అంటే ఓపెన్ ఎడ్యుకేషన్ కన్సర్టియమ్ అని అర్ధం. ఓపెన్ ఎడ్యుకేషన్‌కి ఇదో గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌లా ఉంది. ఇది ఓపెన్ కోర్సులను మాత్రమే ఆఫర్ చేస్తుంది. ఇదో నాన్ ప్రొఫిట్ ప్రొగ్రామ్. ఇందలో ఉండే క్యాట్‌లాగ్ ద్వారా మీకు నచ్చిన కోర్సులను వెతుక్కునే అవకాశం ఉంది. ఇందులో ఉండే లింక్స్ ద్వారా ఆయా కోర్సులకు సంబంధించిన మెటీరియల్‌ను పొందొచ్చు.
FREE SEARCH ENGINES ONLINE COURSES Course central