ఈబుక్స్ కోసం సెర్చ్ ఇంజిన్లు ఉన్నాయి, మీకు తెలుసా?

ఈబుక్స్ కోసం ఎన్నో వెబ్ సైట్లు సెర్చ్ చేస్తుంటాం. మనకు కావాల్సిన పుస్తకాన్ని వెతుక్కోని చదువుతుంటాం. కానీ మనకు కావాల్సిన పుస్తకాలన్నీ ఒకే సైట్లో దొరకవు. వాటికి కోసం ఎన్నో సైట్లను ఓపెన్ చేస్తుంటాం. అయితే ఈ ఐదు సెర్చ్ ఇంజిన్ల సెర్చ్ చేసినట్లయితే మీకు కావాల్సిన ఈబుక్స్ అన్నీ దొరుకుతాయి. pdf, epub, ebooks, txtఫైల్ ద్వారా మీరు ఖచ్చితమైన రిజల్ట్స్ పొందుతారు. ఖచ్చితమైన పదబంధంతోపాటు రచయిత పేరులాంటికి ఈ బుక్స్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈబుక్స్ కోసం ఏయో సెర్చ్ ఇంజిన్లు ఉన్నాయో తెలుసుకుందాం. 

1. eBook-Engine...
ఈబుక్ ఇంజిన్...ఇదొక సెర్చ్ ఇంజిన్. ఈ ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ను ఉపయోగించి...మీరు సెలక్ట్ చేసుకున్న పుస్తకాలను డౌన్ లోడ్ చేసుకోని చదవుకోవచ్చు. 
మీరు వెబ్ సైట్ ను ఓపెన్ చేయగానే...ఒక సెర్చ్ ఇంజిన్ కనిపిస్తుంది. ఈ ఫ్రీ సెర్చ్ ఇంజిన్ మీకు పలు వర్గాలకు సంబంధించిన రిజల్ట్స్ అందిస్తుంది. epub,mobi, txt, pdfలాంటి క్యాటగిరిల్లో ఉంటాయి. అంతేకాదు పుస్తకం యొక్క టైటిల్ ను కూడా ఎంటర్ చేయవచ్చు. పుస్తకానికి సంబంధించిన అదనపు సమాచారం కూడా తెలుసుకోవచ్చు. ఉదాహరణకు మీకు బుక్ పేరును టైప్ చేస్తే...అదే పుస్తకానికి సంబంధించిన విభిన్న అంశాల ఫలితాలను చూపిస్తుంది. pdfద్వారా కంటెంట్ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 
2.Dlfeb.com... 
ఈబుక్స్ కోసం సెర్చ్ చేస్తున్నవారిని ఇది బెస్ట్ ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్. ఈ సెర్చ్ ద్వారా మీరు మీకు కావాల్సిన పుస్తకాలను సెర్చ్ చేయవచ్చు. కీవర్డ్స్ ఎంటర్ చేయడం ద్వారా పుస్తకాలను కనుగొనవచ్చు. ఎక్కువ సమాచారం కావాలంటే...రచయిత పేరు, పబ్లిషర్, వంటివి ఎంటర్ చేయడం ద్వారా ఖచ్చితమైన ఫలితాలను కనుగొనవచ్చు. మీకు కావాల్సిన పుస్తకాన్ని గుర్తించగానే...సెర్చ్ బటన్ పై క్లిక్ చేసి చూడవచ్చు. మీరు బుక్ లింక్ పై క్లిక్ చేసినట్లయితే...కవర్ పేజీతో పుస్తకం పేరును చూపిస్తుంది. epub,pdfలతో కంటెంట్ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
3.CseGoogle.Com...
ఈ వెబ్ సైట్ ఈబుక్స్ కోసం ఒక ఫ్రీ సెర్చ్ ఇంజిన్. ఈబుక్స్ కోసం సెర్చ్ చేస్తున్నవారు ఈజీగా పుస్తకాన్ని వెతుక్కొవచ్చు. మీరు లింక్ ను ఓపెన్ చేయగానే...ఒక చిన్న సెర్చ్ బార్ కనిపిస్తుంది. పుస్తకానికి సంబంధించిన అన్ని పదాలు టైప్ చేయవచ్చు. మీకు కావాల్సిన పదాలను ఎంటర్ చేసిన సెర్చ్ బటన్ను నొక్కాలి. ఇందులో మల్టిపుల్ సోర్సెస్ ఉంటాయి. Ebook300.com, ebookee.orgలాంటివి ఉన్నాయి. పుస్తకాన్ని చూడాలనుకుంటే...వెబ్ సైట్ లింక్ లలో ఏదైనా విజిట్ చేయవచ్చు. 
4.IT eBooks ...
ఈబుక్స్ ను కనుగొనేందుకు మరొక బెస్ట్ ఆప్షన్ ఇది. ఈ వెబ్ సైటు ప్రత్యేకంగా ఐటీ కోసం రూపొందించింది. సెర్చ్ బాక్సులో మీరు కొన్ని కీలకమైన పదాలను ఎంటర్ చేయాలి. అప్పుడు అన్ని వెబ్ సైట్ల నుంచి రిజల్ట్స్ చూపిస్తుంది. ఈ పద్దతి ఈ బుక్స్ ను సెర్చ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మీరు చదివేందుకు కంటెంట్ను కూడా కనుగొనవచ్చు. గ్రే హాట్ సి వంటి పుస్తకాలు, కుక్ బుక్, యుఎక్స్ స్ట్రాటజీ వంటి పుస్తుకాలను ఈ సెర్చ్ ఇంజిన్ను ఉపయోగించి ఈజీగా కనుగొనవచ్చు. 
5.Google Books...
గూగుల్ బుక్స్ ఇతర సెర్చ్ ఇంజిన్ పేరు గూగుల్ ఈబుక్స్. ఇది గూగుల్ సెర్చ్ ఇంజిన్ లాగా పనిచేస్తుంది. మీరు ఈబుక్ కోసం సెర్చ్ చేయవచ్చు. ఈబుక్స్ కోసం చాలా కలెక్షన్స్ ఉంటాయి. పుస్తకం పేరు లేదా ఇతర అనుకూల పదాలను ఎంటర్ చేసినట్లయితే...పూర్తిడి డిటేయిల్స్ చూపిస్తుంది. ఈ గూగుల్ బుక్స్ సెర్చ్ ఇంజిన్ ఉపయోగించి మీరు సిఫార్స్ ఫలితాలను కూడా పొందవచ్చు. సెర్చ్ పట్టీలో ఒక పదాన్ని టైప్ చేస్తే...కింద కొన్ని సూచనలను చూపిస్తుంది. ఇది ఈబుక్స్ ను కనుగొనేందుకు అత్యంత సులభమైన మార్గం. ఇందులో ఇమేజ్ లు, షాపింగ్ వీడియోలు న్యూస్ కూడా ఉంటాయి. 
 

ఈబుక్స్ సెర్చ్ ఇంజిన్లు ebooks search engines