ఈ మెయిల్స్‌పై మీ స‌మ‌యాన్ని మూడొంతులు ఆదా చేసే కొరియ‌ర్ యాప్‌

మీరెన్ని స్పామ్ ఫిల్ట‌ర్స్ పెట్టినా మీ ఈ మెయిల్‌కు రోజూ ప‌దుల సంఖ్య‌లో మెయిల్స్ వ‌స్తూనే ఉంటాయి. వాటిలో ఇంపార్టెంట్ ఏమిటో ఓపెన్ చేసి చూస్తేగానీ తెలియ‌దు. రోజుకు 40, 50 మెయిల్స్ వ‌స్తే వాటిని ఓపెన్ చేసి చూడాలంటే క‌నీసం గంటా, గంట‌న్న‌ర టైం  వృథానే. అందుకే ఈ టైమ్ వేస్టేజిని త‌గ్గించ‌డానికి కొరియ‌ర్ యాప్ వ‌చ్చింది.  దీంతో మీరు ఈ మెయిల్స్ చెక్ చేసుకోవ‌డానికి పెట్టే టైమ్ మూడొంతులు త‌గ్గించ‌వ‌చ్చు.

యాపిల్ ఫోన్ల‌కే మాత్ర‌మే
ప్ర‌స్తుతానికి కొరియర్ యాప్ యాపిల్ డివైస్‌ల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉంది. అంటే ఐ స్టోర్‌లో మాత్ర‌మే దొరుకుతుంది. ఆండ్రాయిడ్ ఫోన్ల‌కు ఇంకా రాలేదు. 
 

ఎలా ప‌నిచేస్తుంది? 
కొరియ‌ర్ యాప్‌ను యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని ఫోన్లో ఇన్ స్టాల్ చేసుకోండి. ఈ యాప్ ఆటోమేటిక్ స‌మ్మ‌రైజేష‌న్ టెక్నాల‌జీతో ప‌ని చేస్తుంది. ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ టెక్నాల‌జీల సాయంతో మీ మెయిల్ ఐడీకి వ‌చ్చే ఈ మెయిల్స్‌ను స్క్రూటినీ చేసి మీకు సింపుల్‌గా, ఎఫెక్టివ్‌గా అందిస్తుంది. కాబ‌ట్టి మీరే ప్ర‌తి మెయిల్ ఓపెన్ చేసి అందులో ఏముందో తెలుసుకుంటూ టైం వేస్ట్ చేసుకోన‌క్క‌ర్లేదు. 

ఇవీ ప్ర‌త్యేక‌త‌లు
* మీ ఈ మెయిల్స్ మొత్తాన్ని ప‌రిశీలించి స‌మ్మ‌రీ రూపంలో (సంక్షిప్తంగా) మీకు అందిస్తుంది.

* మీ ఈ మెయిల్స్‌ను సులువుగా సార్ట్ అవుట్ చేసుకోవ‌డానికి ఎమోజీలు కూడా ఏర్పాటు చేస్తుంది. 

* ఎవ‌రైనా మిమ్మ‌ల్ని ఫ‌లానాది చేయ‌మ‌ని అడిగిన మెయిల్స్ ఉంటే వాటిని ప్ర‌యార్టీ లిస్ట్‌లో పెడుతుంది. 

* ఫ్లైట్ టైమింగ్స్ లాంటివి, ఏదైనా కొన్న‌ప్పుడు, ఫైనాన్షియ‌ల్ ట్రాన్సాక్ష‌న్ల‌కు సంబంధించి వ‌చ్చే మెయిల్స్‌ను  హైలెట్ చేసి చూపిస్తుంది. 

Courier app Auto summerization  email task detection ఈమెయిల్స్‌పై స‌మ‌యం వృథాను త‌గ్గించే కొరియ‌ర్ యాప్‌ మెషీన్ లెర్నింగ్‌ ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌ ఆటో స‌మ్మ‌రైజేష‌న్ టెక్నాల‌జీ Â