ఆధార్.. భారత్‌లో ప్రతి ఒక్కరికి ఎంతో అవసరమైన డాక్యుమెంట్. ఇది కేవలం గుర్తింపు కోసం మాత్రమే కాదు మనకు సంబంధించిన చాలా పథకాల్లో ప్రామాణికంగా ఉపయోగపడుతుంది. మరి ఇంత ప్రాధాన్యం ఉన్న కార్డు కాబట్టే కేంద్ర ప్రభుత్వం ఆధార్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఎం ఆధార్ యాప్ వచ్చింది. మరి ఈ యాప్ ప్రత్యేకత ఏంటి?.. దీనిలో ఉన్న ఫీచర్లు ఏమిటో చూద్దామా..
కొత్త వెర్షన్
యునిక్ ఐడింటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఇటీవలే కొత్త వెర్షన్‌ను లాంఛ్ చేసింది. దాని పేరే ఎంఆధార్. ఇదో కొత్త యాప్. ఆండ్రాయిడ్, ఐవోఎస్ వెర్షన్లలో ఇది ఉపయోగపడుతుంది. ఇంతకుముందు వెర్షన్లు డిలీట్ చేసి కొత్త వెర్షన్‌ను అప్‌డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ యూజర్లను కోరుతోంది. ఎం ఆధార్‌లో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, అడ్రెస్, ఫొటోగ్రాఫ్ ఉంటాయి దీని వ్లల ఆధార్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ఫోన్‌లోనే ఎంఆధార్ యూజ్ చేసుకోవచ్చు.
ఎలా సెట్ చేసుకోవాలి?
ముందుగా మీ స్మార్ట్‌ఫోన్లో ఎం ఆధార్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఆ యాప్‌లోకి లాగిన్ అయి మీ మొబైల్ నంబర్ వెరిఫై చేసుకోవాలి. ఆ తర్వాత మీ ఆధార్ కార్డుని రిజిస్టర్ చేసుకుని వెరిఫై చేసుకోవాలి. ఇందుకోసం ఈ యాప్ టాప్‌లో ఉండే రిజిస్టర్ యువర్ ఆధార్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. మీ ఆధార్ కార్డుని ఓటీపీ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా మీ స్మార్ట్‌ఫోన్లో వ్యాలీడ్ కాపీ ఆఫ్ ఆధార్ అందుబాటులో ఉంటుంది. దీన్ని మీరు ఎక్కడైనా చూపించుకోవచ్చు.
MAadhaar app launched top features privacy documents