కొత్త ఏడాదిలో ఫ్రీ రీఛార్జ్ అందించే ఆండ్రాయిడ్ యాప్స్ ఇవే

ఈరోజుల్లో ఆండ్రాయిడ్ యాప్స్ ద్వారా రీఛార్జ్ ఉచితంగా పొందండం చాలా సాధార‌ణ విష‌యం. ఇలా ఉచితంగా రీఛార్జ్ అందించే యాప్స్ చాలానే అందుబాటులో ఉన్నాయి. రిఫ‌ర్ చేయ‌డం ద్వారా ఈ రీఛార్జ్‌ల‌ను మ‌నం పొందే అవ‌కాశం ఉంటుంది. మీరు ఏ సిమ్ ఉప‌యోగిస్తున్నారు.. లేదా ఏ ఆప‌రేట‌ర్‌తో ఉన్నార‌న్న‌ది స‌మ‌స్యే కాదు జ‌స్ట్ రిఫ‌ర్ చేయ‌డం ద్వారా ఏ ఆప‌రేట‌ర్‌కు అయినా మీరు ఉచితంగా రీఛార్జ్ పొందే అవ‌కాశాలు చాలా ఉన్నాయి. మ‌రి ఆ ఆప్ష‌న్లు ఏమిటో తెలుసా!

సూప‌ర్ యాప్‌
ఈ యాప్‌లో ప్ర‌త్యేక‌త ఏమంటంటే వాట్స‌ప్ స్టేట‌స్‌లు పొందొచ్చు. వీడియోలు డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. మీ సొంత వీడియోలు అప్‌లోడ్ చేయ‌డం ద్వారా డ‌బ్బులు కూడా సంపాదించొచ్చు. అంతేకాదు స్నేహితుల‌ను రిఫ‌ర్ చేసి అన్‌లిమిటెడ్ రీఛార్జ్ కూప్ల‌ను కూడా పొందే సువ‌ర్ణావ‌కాశం ఉంది.

న్యూస్‌డాగ్‌
కొత్త ఏడాదిలో ఎక్కువ‌మందికి చేరువు అవుతున్న యాప్ ఇది. ఫ్రీ రీఛార్జ్ ఇస్తున్న యాప్స్‌లో ఇది ముందంజ‌లో ఉంటుంది. ఎక్కువ రివార్డుల‌ను ఇవ్వడం ఈ యాప్ ప్ర‌త్యేక‌త‌. పేటీఎం క్యాష్ ఇవ్వ‌డం దీనిలో మ‌రో స్పెష‌ల్‌. ఈ క్యాష్‌ను మీరు నేరుగా ఉప‌యోగించుకోవ‌చ్చు. అందుకే ఈ యాప్‌ను మీ జాబితాలో మొద‌ట యాడ్ చేసుకోండి\

ఫ్రీఛార్జ్‌
చాలారోజుల నుంచి ఫ్రీఛార్జ్ యాప్ అందుబాటులో ఉంది. అయితే ఎక్కువ‌మందికి దీని గురించి తెలియ‌దు. దీనిలో మంచి ఆఫ‌ర్లు ఉన్నాయి. స్నేహితుల‌కు రిఫ‌ర్ చేస్తే రూ.30 క్యాష్ పొందొచ్చు. కొత్త యూజ‌ర్‌కు రూ.30 బ‌హుమ‌తిగా ల‌భిస్తుంది. ఇదే కాక ఎన్నో మ‌రెన్నో యాప్‌లు దీనిలో మీకు ల‌భిస్తాయి.

ఎంసెంట్‌
ఉచితంగా మీకు రీఛార్జ్ కూప‌న్లు ఇస్తున్న యాప్‌ల‌లో ఎం సెంట్ కూడా ఉంది. మీ బిల్స్ పే చేయ‌డం ద్వారా మీకు ఈ యాప్ కొన్ని రీఛార్జ్ కూప‌న్లు ఇస్తుంది వీటిని గ‌డువులోపు వాడుకునే అవ‌కాశం ఉంది. టాక్‌టైమ్‌ను సంపాదించుకోవ‌డానికి కూడా ఎంసెంట్‌లో మీకు అవ‌కాశాలు ఉన్నాయి. అంటే స‌ర్వేలు పూర్తి చేయ‌డం ద్వారా మీరు ఈ అవ‌కాశాన్ని పొందొచ్చు.

డాన్ యాప్‌
రోజు వారీ ఆఫ‌ర్లు ఏమున్నాయో మీకు వివ‌రాలు అందిస్తుంది ఈ యాప్‌. కాంటెస్టులు పెట్ట‌డం ద్వారా మీరు ఈ యాప్ ద్వారా బ‌హుమ‌తులు సంపాదించుకునే అవ‌కాశం ఉంది. ఇన్‌స్టాల్ చేసుకోకుండానే రిఫ‌ర్ చేయ‌డం ద్వారా  డ‌బ్బులు సంపాదించుకునే అవ‌కాశం దీనిలో ఉంది. దీనిలో పాటు స్లైడ్ యాప్ కూడా దాదాపు ఇదేలా ప‌ని చేస్తుంది. రిఫ‌ర్ చేయ‌డం ద్వారా ఉచితంగా రీఛార్జ్ కూప‌న్లు అందించ‌డం లేదా క్యాష్ ఇవ్వ‌డం దీనిలో ప్ర‌త్యేక‌త‌లు.

Free Recharge Android Apps newsdog freecharge