కరోనా వైరస్.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న పేరు. చైనాలోని వుహాన్ నగరంలో డిసెంబర్ 31న బయటపడిన ఈ శ్వాసకోశ వ్యాధి వందలకొద్దీ ప్రాణాలను బలితీసుకుంటుంది. ఒక్క వుహాన్ నగరంలో చైనా కేవలం 10 రోజుల్లో వెయ్యి బెడ్స్ హాస్పిటల్ను దీనికోసం ప్రత్యేకంగా నిర్మించిందంటే కరోనా తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. చైనా, హాంకాంగ్ సహా 28 దేశాల్లో కరోనా మహమ్మారి ప్రజలను కంటిమీద కునుకు వేయనివ్వడం లేదు. మరోవైపు ఈ పేరుతో పుకార్లూ షికార్లు చేస్తున్నాయి. వేలాది మంది చనిపోయారంటూ కొంతమంది పనిగట్టుకుని ప్రచారం చేస్తూ ప్రజలను మరింత భయపెడుతున్నారు.
కచ్చితమైన లెక్క కోసం టూల్
ఈ పరిస్థితుల్లో కరోనా వైరస్ ఏ దేశంలో ఎలా వ్యాపిస్తోంది. ఎంతమందికి వ్యాధి సోకింది? ఎంత మంది చనిపోయారనేది ఎప్పటికప్పుడు కచ్చితంగా అంచనా వేయడానికి ఒక టూల్ డెవలప్ చేశారు. సెంటర్ ఫర్ సిస్టమ్స్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ సంస్థ ఈ టూల్ను తయారు చేసింది. దీనిలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య ఏ దేశంలో ఎలా ఉంది? ఎక్కడెక్కడ ఎంతమంది చనిపోయారనేది ఈజీగా గుర్తించవచ్చు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యుహెచ్వో) దీనికి సమాచారం అందిస్తుంది. చైనా, అమెరికా, యూరప్ దేశాల్లోని తమ సెంటర్ల నుంచి సమాచారాన్ని తీసుకుని ఇస్తుంది.
ఒక్క లింక్లో సమస్త సమాచారం
https://gisanddata.maps.arcgis.com/apps/opsdashboard/index.html#/bda7594740fd40299423467b48e9ecf6 ఈ లింక్ను క్లిక్ చేస్తే ఒక వెబ్పేజీ ఓపెన్ అవుతుంది.
* ప్రపంచపటంలో కరోనా వ్యాప్తిని రెడ్ డాట్స్తో చూపిస్తుంది. ఆ డాట్ మీద క్లిక్ చేస్తే అక్కడ ఎంతమందికి కరోనా వైరస్ సోకింది? అందులో ఎంతమంది చనిపోయారు? ఎంతమంది వ్యాధి నుంచి రికవర్ అయ్యారో అనే వివరాలను చూపిస్తుంది. ఉదాహరణకు ఇండియా మీద ఒక రెడ్ డాట్ ఉంది. దాన్ని క్లిక్ చేస్తే మొత్తం ముగ్గురికి వ్యాధి నిర్ధారణ అయిందని, మృతులు, రికవరీలు లేరని చూపించింది.
* కరోనా వైరస్ బారిన ఎంతమంది పడ్డారో మొత్తం నెంబర్ను ఈ టూల్ చూపిస్తుంది.
* ఏ దేశంలో ఎంతమందికి కరోనా వైరస్ సోకిందో కూడా సంఖ్యలు ఉంటాయి
* మొత్తం ఎంతమంది చనిపోయారు? వారిలో ఏ దేశం వారు ఎంత మంది అనే వివరాలు సమగ్రంగా ఉంటాయి.
* అలాగే రికవరీ ఎంతమంది అయ్యారు? దేశాలవారీగా లెక్కలుంటాయి.
565 మంది మృతి
ఈ టూల్లో ఉన్న వివరాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 28,344 మందికి కరోనా వైరస్ సోకింది. ఇందులో 565 మంది చనిపోయారు. వీరిలో 563 మంది చైనా వాళ్లే. హాంకాంగ్లో ఒకరు, ఫిలిప్పీన్స్లో ఒకరు చనిపోయారు. 1,299 మంది వ్యాధి సోకినా మళ్లీ రికవర్ అవగలిగారు.
క‌రోనా వైర‌సà±â€Œ క‌రోనా వైర‌సౠటà±à°°à°¾à°•ింగౠటూలà±â€Œ Corona Virus Corona virus tracking tool