గూగుల్ ఎర్త్ ఇంజిన్ తో భూమి గత 35 సంవత్సరాలలో ఎలా మారిందో చూడండి

గత 35ఏండ్ల క్రితం భూమి ఎలా ఉంది. ఇప్పుడెలా మారింది. తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ ఆర్టికల్ ఫాల్ అవ్వండి. 

మీరు డెస్క్ టాప్ లో గూగుల్ ఎర్త్ ప్రోని ఉపయోగిస్తున్నట్లయితే...మీకు భూమి యొక్క హిస్టరికల్ ఇమేజ్ లను అందిస్తుంది. వాటిని గమనిస్తే అర్థమవుతుంది. 35ఏండ్ల క్రితం భూమి ఎలా ఉండేది అని. గూగుల్ ఎర్త్ ఇంజిన్ అనేది ఉపగ్రహ ఛాయాచిత్రం, జియోస్పటియల్ డేటాసెట్లు, మల్టీ పెటాబైట్ కేటలాగ్నుతో ఉన్న మల్టిపుల్ డివైసు. భూమి యొక్క ఉపరితలంపై మార్పులను గమనించడానికి సైటింస్టులు, డెవలపర్లు, పరిశోధకులు ఉపయోగించే గ్రహాల స్థాయి విశ్లేషన సామార్థ్యాలను అందిస్తుంది. గూగుల్ ఎర్త్ ఇంజిన్ గత 35ఏండ్లలో ఎలా మార్పు చెందిందో చూడటానికి టైంల్యాప్స్ వ్యూవర్ ను అనుమతిస్తుంది. దీంతో మీరు భూమి ఎలా మారిందో చూడవచ్చు. 

35ఏండ్లలో భూమి ఎలా మారిందో చూడటానికి ...మీరు ఏ ప్రదేశాన్ని చూడాలనుకుంటున్నారో సెలక్ట్ చేసుకోండి. వీక్షకుడు బుష్ ఫైర్లను, తీరప్రాంత విస్తరణలు, హిమానీనదాల తిరోగమనాలు, నిర్మాణాలు, అటవీ నిర్మూలన, ఎండిపోయిన సముద్రాలు, ఇలాంటి వాటన్నింటిని చూడవచ్చు.  వీటిలో ఏదైనా సెలక్ట్ చేసుకోని...కాలక్రమేణా జరిగిన మార్పులను గమనించవచ్చు. మీరు ఎంచుకున్న లొకేషన్ను జూమ్ చేసినట్లయితే...క్లియర్ గా కనిపిస్తుంది. 1984నుంచి 2018వరకు టైంమ్లాప్ ను ప్లే చేస్తుంది. ఇంకా ఎక్కువ సమాచారం కోసం ఏ సమయంలోనైనా సరే టైమ్లాప్లను పాజ్ చేయవచ్చు. అంతేకాదు ప్లే బ్యాక్ కూడా చాలా స్పీడ్ గా మార్చవచ్చు. ఏడాదిపొడవుగా ఉన్న చిత్రాలను చూసేందుకు మ్యానువల్ గా సెలక్ట్ చేసుకోవచ్చు. 

గూగుల్ ఎర్త్ ఇంజిన్ భూమి google earth engine earth