దేశీయ టెలికాం రంగాన్ని ఓ ఊపు ఊపిన రిలయన్స్ జియో ఇప్పుడు సరికొత్త రంగంలోకి ఎంట్రీ ఇస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ఈ కామర్స్ ఫ్లాట్ ఫాం మీద ఆఫ్ లైన్, ఆన్ లైన్ స్టోర్లలో సరికొత్త ప్రయోగానికి తెరలేపనున్నారు అమెజాన్, వాల్ మార్ట్ ఫ్లిప్ కార్ట్ లకు ధీటుగా సరికొత్త ఫ్లాట్ ఫాంను సిద్ధం చేయబోతున్నారు. ఇందులో భాగంగా వాటికి పోటీగా సూపర్ యాప్ పేరుతో జియో 100 సర్వీసులను ఒకే చోటుకు తీసుకురానుంది. దీని ద్వారా ఈ కామర్స్ మార్కెట్లో గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది. అతి త్వరలోనే ఇది లైవులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.
300 మిల్లియన్ సబ్ స్క్రైబర్లు
జియో ఇప్పుడు 300 మిల్లియన్ సబ్ స్క్రైబర్లలను కలిగి ఉంది. ఉచిత డేటాతో పాటు వాయిస్ ఆఫర్స్ తో మార్కెట్లో సునామిలా దూసుకుపోతోంది. దీని దెబ్బకు ఇతర టెల్కోలు కిందా మీదా పడుతున్నాయి. జియోకి ధీటుగా ఆఫర్లను ప్రకటించేందుకు నానా తంటాలు పడుతున్నాయి. కస్టమర్లు చేజారిపోకుండా కాపాడుకునేందుకు తీవ్రంగానే కసరత్తు చేస్తున్నాయి.
ఇండస్ట్రీ ఎక్స్ ఫర్టుల ప్రకారం జియో త్వరలో సూపర్ యాప్ తో మార్కెట్లోకి దూసుకురానుందని చెబుతున్నారు.Snapdeal, Paytm, Freecharge, Flipkart మాదిరిగానే ఇండియా మార్కెట్లో వుయ్ ఛాట్ పోల్ పొజిషన్ తో సత్తా చాటనుందని తెలుస్తోంది.జియో సిమ్ వాడుతున్న ప్రతి ఒక్కరూ ఈ యాప్ ని వాడుకోవచ్చు. దీని ద్వారా ఈ కామర్స్ ఫ్లాట్ ఫాం మీద online bookings and paymentsలాంటివి ఒకే చోట చేయవచ్చు. ఇది యూకో సిస్టంతో కనెక్ట్ కానుంది.
ఇదిలా ఉంటే డేటా, వాయిస్ కాలింగ్ సేవలను అతి చవకగా భారతీయ వినియోగదారులకు విరివిగా అందుబాటులోకి తీసుకొచ్చిన జియో త్వరలోనే ధరలను భారీగా పెంచనుందని తెలుస్తోంది. ఈ మేరకు ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు విశ్లేషిస్తున్నాయి. త్వరలోనే జియో ధరలు పెంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జేపీ మోర్గాన్ తన తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ చెల్లింపులకు గానూ జియో వేలకోట్ల రూపాయల అవసరం ఉంది. దీంతో జియో తన టారిఫ్‌లను పెంచే యోచనలో ఉందని అంచనా వేసింది.
à°¨à±à°¯à±‚సౠటెకà±à°¨à°¾à°²à°œà±€ రిలయనà±à°¸à± జియో జియో సూపరౠయాపౠఈ కామరà±à°¸à± అమెజానౠఫà±à°²à°¿à°ªà±â€Œà°•ారà±à°Ÿà± రిలయనà±à°¸à±