ట్రూకాలర్ వాయిస్ కాలింగ్ ఫీచర్, ఇకపై అందరికీ ఉచితం 

Truecaller వాడే ఆండ్రాయిడ్ యూజర్లకు కంపెనీ శుభవార్తను చెప్పింది. యూజర్ల కోసం వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ (VoIP) ఫీచర్ ను ట్రూకాలర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ను ఆండ్రాయిడ్ యూజర్లు ఉచితంగా పొందవచ్చు. ఇటీవల ఈ కాలింగ్ ఫీచర్ ను ట్రూకాలర్ ప్రీమియం సబ్ స్క్రైబర్ల కోసం కంపెనీ టెస్టింగ్ చేసింది. ఇకపై ఈ ఫీచర్ కు ట్రూకాలర్ ప్రీమియం లేదా ప్రీమియం గోల్డ్ సబ్ స్క్ర్పిప్షన్ అవసరం లేదు. మొబైల్ డేటా లేదా Wi-Fi నెట్ వర్క్ ద్వారా ఈ ఫీచర్ యాక్సస్ చేసుకోవచ్చు.

ట్రూకాలర్ వాయిస్ కాలింగ్ ఫీచర్ ‘Truecaller Voice’ పేరుతో యాప్ లో యాడ్ అయింది. ఈ బటన్ ద్వారా Truecaller యూజర్లు తమ ఫోన్ కాంటాక్ట్స్ లోని ఫోన్ నెంబర్లకు Mobile Data ద్వారా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. లేదా వై-ఫై డేటా ద్వారా కూడా వాయిస్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. ట్రూకాలర్ VoIP కాలింగ్ ఫీచర్ ను దశలవారీగా ప్రవేశపెడుతోంది. త్వరలో ఆండ్రాయిడ్ ప్లాట్ ఫాంపై అన్ని ట్రూకాలర్ యాప్ యూజర్ల అందరికి వాయిస్ కాలింగ్ ఫీచర్ అందుబాటులోకి రానుంది.

హై క్వాలిటీ (HD), లో క్వాలిటీ, లో లాటెన్సీ తో కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఇక VoIP కాల్స్ చేయాలంటే.. మొబైల్ డేటా, వై-ఫై నెట్ వర్క్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పటికే ట్రూకాలర్ యాప్ వాడుతున్న యూజర్ల ఫోన్లలో ట్రూకాలర్ వాయిస్ Shortcut యాడ్ అయింది. కాల్ లాగ్స్, SMS ఇన్ బాక్స్, కాంటాక్ట్ ప్రొఫైల్, కాల్ స్ర్కీన్ వంటి ఇన్ యాప్ లొకేషన్లలో షార్ట్ కట్ కనిపిస్తుంది.

ట్రూకాలర్ యాప్ వాడే ఆండ్రాయిడ్ ఎకోసిస్టమ్ మొబైల్ యూజర్ల మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. వచ్చే కొన్ని వారాల్లో iOS యూజర్లకు కూడా ఈ VoIP కాలింగ్ ఫీచర్ అందుబాటులోకి రానుంది. జూన్ 1, 2019న ట్రూకాలర్ వాయిస్ ఫీచర్ ను కంపెనీ రివీల్ చేసిన సంగతి తెలిసిందే. 

న్యూస్ టెక్నాలజీ ట్రూకాలర్ వాయిస్ ఫీచర్ ట్రూకాలర్ కాల్స్ ట్రూకాలర్ వాయిస్ ఓవర్