కరోనా వైరస్ రోగిని ట్రాక్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఆరోగ్యసేతు యాప్ ఇప్పుడు పెద్ద హాట్‌టాపిక్‌గా మారింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో ఉద్యోగులందరూ ఈ యాప్ తప్పనిసరిగా ఇన్‌స్టాల్ చేసుకుని ఉపయోగించాల్సిందేనంటూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. కంపెనీలు, లేదా కార్యాయాల్లో తమ ఉద్యోగులందరూ ఆరోగ్యసేతు యాప్ డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగించేలా చూడాల్సిన బాధ్యత ఆయా యాజమాన్యాలు, అధికారులదేనని కూడా స్పష్టం చేసింది.
9 కోట్లు దాటిన డౌన్లోడ్స్
ఆరోగ్యసేతు యాప్ మీద సెంట్రల్ గవర్నమెంట్ గట్టి ఫోకస్ పెట్టింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని ప్రమోట్ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా కేసులపై రిలీజ్ చేసే డైలీ బులెటిన్లో ఆరోగ్యసేతు యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సందేశం ఇస్తోంది. మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆరోగ్యసేతు యాప్‌ను బాగా ప్రమోట్ చేస్తున్నాయి. దీంతో ఆరోగ్యసేతు యాప్ రికార్డులన్నీ తిరగరాసేస్తోంది. పబ్‌జీ లాంటి ఇంటర్నేషనల్ గేమ్స్ కంటే ఎక్కువ డౌన్లోడ్స్‌తో దూసుకెళుతోంది. ఇప్పటికే 9 కోట్ల మందికిపైగా ఈయాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు.
ఫీచర్ ఫోన్లలో లేదే
ఇండియాలో స్మార్ట్‌ఫోన్ల వినియోగం ఎంత పెరిగినా ఇప్పటికీ ఇంకా 40 కోట్ల మంది ఫీచర్ ఫోన్లే వాడుతున్నారు. వీటిలోనూ ఆరోగ్యసేతు యాప్ తీసుకురావాలని కేంద్రం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా దాదాపు 10 కోట్ల సంఖ్యలో ఉన్న జియో ఫీచర్ ఫోన్ల మీద కన్నేసింది. త్వరలోనే జియో ఫోన్ మోడళ్లకూ ఆరోగ్యసేతు యాప్ అందుబాటులోకి రానుందని సెంట్రల్ గవర్నమెంట్‌లోని ఓ కీలక అధికారి చెప్పారు.
వారం రోజుల్లోనే
10 కోట్ల మంది జియో ఫోన్ యూజర్లకు మరో వారంలోపే ఆరోగ్యసేతు యాప్ అందుబాటులోకి రాబోతోంది. కై ఓఎస్‌తో పనిచేసే జియో ఫోన్ల కోసం ఆరోగ్యసేతు యాప్ సిద్ధమవుతోందని ఆ సీనియర్ అధికారి చెప్పారు. అయితే జియో మాత్రం ఈ యాప్ టెస్టింగ్ స్టేజ్‌లోనే ఉందని చెబుతున్నారు.
ఆరోగà±à°¯â€Œà°¸à±‡à°¤à± యాపà±â€Œ జియో ఫోనà±â€Œà°²à±‹ ఆరోగà±à°¯â€Œà°¸à±‡à°¤à± యాపà±â€Œ Arogya setu app Arogya setu app in Jio phones