దేశంలో ఏటా సుమారు 44 వేల మంది చిన్నారులు తప్పిపోతున్నారు. పిల్లల్ని ఎత్తుకుపోయి అమ్మేసుకునే ముఠాలూ ఉన్నాయి. అయితే వీరిలో కేవలం 11వేల మందిని మాత్రమే కాపాడగలుగుతున్నారు. మిగిలిన వారిని గుర్తించడం పోలీసులకు సవాలుగా మారుతోంది. ఈ సమస్యకు టెక్నాలజీ సాయంతో చెక్ చెప్పాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తప్పిపోయిన, అక్రమ రవాణాకు గురవుతున్న చిన్నారులను సులువుగా కనుగొనేందుకు రీ యునైట్ అనే యాప్ను విడుదల చేసింది.
రీయునైట్ యాప్ని ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ కేప్జెమినీ రూపొందించింది. బాలల హక్కుల కోసం పోరాడుతున్న నోబెల్ అవార్డు గ్రహీత కైలాశ్ సత్యార్థి యాప్ తయారుచేయడంలో కీలక పాత్ర పోషించారు. దీనిని కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు, కైలాశ్ సత్యార్థి శనివారం ప్రారంభించారు. ఈ రీయునైట్ యాప్ అమెజాన్ వెబ్ సర్వీసు ఆధారంగా పనిచేస్తుంది.
ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీతో..
రీ యునైట్ యాప్లో ఫేస్ రికగ్నైజేషన్ సాంకేతికత పొందుపరిచారు. చిన్నారుల తల్లిదండ్రులు ఈ యాప్లో తమ పిల్లల వివరాలతో పాటు ఫొటోను అప్లోడ్ చేయాలి. ఈ వివరాలన్నీ ఢిల్లీలోని పోలీస్ విభాగంలోని తప్పిపోయిన, మిస్సింగ్ అయిన చిన్నారులకు చెందిన డేటా బేస్లో స్టోర్ అవుతాయి. చిన్నారుల ఫొటోతో అందులోని వివరాలు మ్యాచ్ అయితే వెంటనే తల్లిదండ్రులకు వివరాలు తెలియజేసేలా యాప్ను రూపొందించారు.
Mobile app to track missing children Reunite app  త‌పà±à°ªà°¿à°ªà±‹à°¯à°¿à°¨ పిలà±à°²â€Œà°²à±à°¨à°¿ ప‌టà±à°Ÿà±à°•à±à°¨à±‡ యాపà±â€Œ రీయà±à°¨à±ˆà°Ÿà± యాపà±â€Œ