పాస్‌పోర్ట్ సేవ యాప్ వ‌చ్చింది.. 15 న‌కిలీ యాప్స్ కూడా వ‌చ్చేశాయి జాగ్ర‌త్త‌

పాస్‌పోర్ట్‌కి అప్ల‌యి చేయ‌డం ఇక మ‌రింత సులువుగా మారింది. మీ ఫోన్‌లో నుంచే పాస్‌పోర్ట్‌కి అప్ల‌యి చేసుకునేలా ఎం పాస్‌పోర్ట్ సేవ (mPassportSeva) యాప్‌ను కాన్సుల‌ర్‌, పాస్‌పోర్ట్ అండ్ వీసా (సీపీవీ) డివిజ‌న్ తీసుకొచ్చింది. ఈ పాస్‌పోర్ట్  సేవా యాప్‌తో దేశంలో ఎక్కడి నుంచైనా పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఎలా అప్ల‌యి చేయాలి? 

1.ఆండ్రాయిడ్ లేదా ఐవోఎస్‌లో  mPassportSeva యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

2. యాప్‌ను ఓపెన్ చేసి New User Registrationను టాప్ చేయండి.

3. పాస్‌పోర్ట్ ఆఫీస్‌ను సెలెక్ట్ చేసుకోండి. ఆన్‌లైన్ యాప్ కాబ‌ట్టి ఎక్క‌డి నుంచైనా పాస్‌పోర్ట్‌కి అప్లయి చేసుకోవ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కు మీరు హైద‌రాబాద్ వాసి అయి ఉండి, చెన్నైలో జాబ్ చేస్తుంటే చెన్న‌యి పాస్‌పోర్ట్ ఆఫీస్‌నే సెలెక్ట్ చేసుకుని అప్ల‌యి చేయొచ్చు. 

4. పేరు, డేట్ ఆఫ్ బ‌ర్త్‌, ఈమెయిల్ ఐడీ లాంటి ప‌ర్స‌న‌ల్ డిటెయిల్స్‌ను ఫిల్ చేయండి

5. త‌ర్వాత యూనిక్ లాగిన్ ఐడీని ఎంట‌ర్ చేయండి. ఇది మీ ఈమెయిల్ ఐడీలాంటిదే. దీన్ని క్రియేట్ చేసి పాస్‌వ‌ర్డ్ సెట్ చేసుకోండి. కావాలంటే మీ ఈమెయిల్ ఐడీనే లాగిన్ ఐడీగా కూడా వాడుకోవ‌చ్చు. 

6. ఫ్యూచ‌ర్‌లో మీరు పాస్‌వ‌ర్డ్ మ‌ర్చిపోతే రిక‌వ‌రీ చేయ‌డానికి సెక్యూరిటీ క్వ‌శ్చ‌న్‌ను, ఆన్స‌ర్‌ను ఇవ్వండి.

7.కేప్చా ఎంట‌ర్ చేసి స‌బ్మిట్ చేయండి. 

8. ఇప్పుడు మీకు పాస్‌పోర్ట్ ఆఫీస్ నుంచి ఓ ఈమెయిల్ వ‌స్తుంది. దీనిలో ఉన్న వెరిఫికేష‌న్ లింక్‌ను క్లిక్ చేయండి.

9. మీరు వెరిఫికేష‌న్ లింక్ క్లిక్ చేయ‌గానే అది మిమ్మ‌ల్ని ఓ వెబ్‌పేజీకి డైరెక్ట్ చేస్తుంది. క‌న్ఫ‌ర్మేష‌న్ కోసం అక్క‌డ మీ లాంగిన్ ఐడీని ఎంటర్ చేయండి.

10. యాప్‌ను క్లోజ్ చేసి మ‌ళ్లీ ఓపెన్ చేయండి. Existing User Login ఆప్ష‌న్ క్లిక్ చేసి మీ ఐడీ, పాస్‌వ‌ర్డ్ ఎంట‌ర్ చేస్తే యాప్‌లోకి ఎంట‌ర‌వుతారు. అప్లయ్ ఫ‌ర్ న్యూ పాస్‌పోర్ట్ ఆప్ష‌న్ క్లిక్ చేసి పాస్‌పోర్ట్‌కు అప్ల‌యి చేసుకోండి. 

11. పేమెంట్ ఆప్ష‌న్స్‌లోకి వెళ్లి అప్లికేష‌న్ ఫీజు చెల్లించాలి. త‌ర్వాత పాస్‌పోర్ట్ సెంట‌ర్‌కు వెళ్లి డాక్యుమెంట్స్ వెరిఫై చేయించుకోవ‌డానికి మీరే ఓ టైమ్ శ్లాట్ బుక్ చేసుకోండి. 

న‌కిలీ యాప్స్‌తో జాగ్ర‌త్త‌
పాస్‌పోర్ట్ సేవ ఆన్‌లైన్‌లో అందిస్తామంటూ ప్లే స్టోర్‌లో బోల్డ‌న్ని న‌కిలీ యాప్స్ కూడా ఉన్నాయి. పొర‌పాటున కూడా వాటిని ట్రై చేయ‌కండి. అలాంటి న‌కిలీ పాస్‌పోర్ట్ సేవ యాప్స్ లిస్ట్ ఇదీ.. 
1)  Online passport Services and seva 
2) Aadhar Pan PNR Passport Seva 
3) Passport Seva Online 
4) Passport Services E - Seva 
5) Passport Status Check 
6) IN-Pass-port 
7) Government Digital Services 
8) Passport Seva 
9) Indian Passport Status New
10) Indian ID Proof
11) Passport Seva Quick
12) Passport Services All
13) Passport Online Services
14) Passport Service Online India
15) Status Enquiry India

పాస్‌పోర్ట్ సేవ యాప్‌ à°Žà°‚ పాస్‌పోర్ట్ సేవ‌ పాస్‌పోర్ట్ న‌కిలీ యాప్స్‌ mPassportSeva Fake passport apps Passport Seva app Â