పేరెంట్స్‌, టీచ‌ర్ మ‌ధ్య క‌మ్యూనికేష‌న్‌లో విధ్వంస‌క ఆవిష్క‌ర‌ణ ఈ 3 యాప్స్‌

పిల్ల‌ల చ‌దువులో త‌ల్లిదండ్రుల‌తో పాటు ఉపాధ్యాయుల‌దీ అత్యంత కీల‌క‌పాత్ర‌! పేరేంట్స్‌-టీచ‌ర్స్ మ‌ధ్య స‌మ‌న్వ‌యం ఉంటే విద్యార్థి చ‌దువు.. మెరుగైన రీతిలో ఉంటుంది. ప్రస్తుతం పాఠ‌శాల యాజ‌మాన్యాలు నిర్వ‌హించే పేరెంట్స్ మీటింగ్‌కు త‌ల్లిదండ్రులు హాజ‌ర‌వ్వ‌లేని ప‌రిస్థితి. దీంతో వీరి మ‌ధ్య కొంత గ్యాప్ ఏర్ప‌డుతోంది. కొన్ని ఆండ్రాయిడ్ యాప్స్‌.. దీనిని ఫిల్ చేసేస్తున్నాయి. టీచ‌ర్ల‌తో త‌ల్లిదండ్రులు నిత్యం క‌మ్యూనికేట్ అవుతూ.. పిల్ల‌ల చ‌దువుల‌పై నిరంత‌రం స‌మీక్షించేందుకు దోహ‌ద‌ప‌డుతున్నాయి. త‌ల్లిదండ్రులు-ఉపాధ్యాయుల మ‌ధ్య క‌మ్యూనికేష‌న్‌ను పెంచుతున్న‌ మూడు అద్భుత‌మైన యాప్స్ గురించి తెలుసుకుందాం!

Bloomz
ఉపాధ్యాయులు-త‌ల్లిదండ్రుల మ‌ధ్య కమ్యూనికేష‌న్ కోసం అందుబాటులో ఉన్న యాప్స్‌లో అత్యుత్త‌మ‌మైన‌ది ఇది. దీని ద్వారా త‌ర‌గ‌తి గ‌దిలో జ‌రిగే విష‌యాలు, ఫొటోలను ఎప్ప‌టిక‌ప్పుడు విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌తో సందేశాల రూపంలో పంచుకోవ‌చ్చు. భ‌విష్య‌త్‌లో పాఠ‌శాల‌లో చేప‌ట్ట‌బోయే కార్య‌క్ర‌మాలు, ప‌రీక్ష‌లు, ఇత‌ర స‌మాచారాన్ని కూడా ఎప్పటిక‌ప్పుడు షేర్ చేయ‌వ‌చ్చు. త‌మ వ్య‌క్తిగ‌త వివ‌రాలు(ఫోన్ నంబ‌రు, ఈమెయిల్ అడ్ర‌స్‌) తెలియ‌జేయ‌కుండానే.. విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌కు ఉపాధ్యాయులు స‌మాచారాన్ని అందించే వెసులుబాటు ఉంది. పిల్ల‌ల త‌ల్లిదండ్రులు ఉచితంగా ఇందులో అకౌంట్ క్రియేట్ చేసుకుంటే ఎస్ఎంఎస్ ద్వారా వివ‌రాలు తెలుసుకోవ‌చ్చు. అంతేగాక ఇతర విద్యార్థుల త‌ల్లిదండ్రులతోనూ క‌మ్యూనికేట్ అవ్వొచ్చు. 

Classting
ఇది ఫ్రీ ఆండ్రాయిడ్ యాప్‌. ఇందులో ఉపాధ్యాయులు ఒక క్లాస్‌రూమ్ క‌మ్యూనిటీని క్రియేట్ చేయాలి. త‌ర్వాత ఇన్విటేష‌న్ కోడ్‌ను విద్యార్థులతో పాటు వారి త‌ల్లిదండ్రుల‌కు పంపుతారు. దీంతో అంతా ఒక క‌మ్యూనిటీలో చేర‌తారు. త‌ర్వాత‌.. క్లాస్‌రూమ్ విష‌యాల‌తో పాటు, ముఖ్య‌మైన ప్ర‌క‌ట‌న‌లు, కార్య‌క్ర‌మాల‌కు సంబంధించిన స‌మాచార‌మంతా.. యాప్‌లో పోస్ట్ చేస్తారు. ఇందులో విద్యార్థి త‌ల్లిదండ్రుల‌తో ఉపాధ్యాయులు నేరుగా మాట్లాడ‌వ‌చ్చు.  క్లాస్ రూమ్ ఫొటోలు, ఇత‌ర విష‌యాల వీడియోలు, ఫొటోల‌ను క్రియేట్ చేసి పంపించ‌వ‌చ్చు. వీటిపై పేరెంట్స్ త‌మ అభిప్రాయాలు కూడా తెలిపే స‌దుపాయం ఉంది. విద్యార్థులు యాప్‌లోనే చ‌ర్చ‌ల్లో పాల్గొన‌వ‌చ్చు. 

Remind
క్లాస్ రూమ్ యాక్టివిటీ రిమైండ‌ర్‌తో పాటు స్టూడెంట్స్ క‌మ్యూనికేష‌న్ యాప్ ఇది. దీని ద్వారా టీచ‌ర్లు క్లాస్‌రూమ్‌ను క్రియేట్ చేయాల్సి ఉంటుంది. త‌ర్వాత విద్యార్థులు ఇందులో చేరేలా ఇన్విటేష‌న్ లింక్ పంపాలి. క్లాస్ రూమ్ యాక్టివిటీస్‌తో పాటు, డాక్యుమెంట్లు, ఫొటోల‌ను షేర్ చేయ‌వ‌చ్చు. ఇందులో ఒక్కో విద్యార్థి త‌ల్లిదండ్రుల‌కు గానీ, గ్రూపులోనైనా వీటిని పంపించే వెసులుబాటు ఉంది. ఈ యాప్‌లో లాంగ్వేజ్‌ ట్రాన్స్‌లేట‌ర్ ఉంటుంది. ఇది సుమారు 85 భాష‌ల‌ను ట్రాన్స్‌లేట్‌ చేస్తుంది.

students parents communication query parents meeting studies Bloomz Classting