ప్రీమియం మూవీస్ ని ఉచితంగా చూడడానికి బెస్ట్ యాప్స్ మీకోసం

ఇండియాలో టాప్ 3లో ఉన్న టెలికాం సర్వీసు ప్రొవైడర్లు రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్. ఈ మూడు టెలికం కంపెనీలు కూడా మార్కెట్లో గట్టి పోటీని ఎదుర్కొంటున్నాయి. లయన్స్ వాటా పొందడానికి ప్రయత్నిస్తున్నాయి. అన్ లిమిటెడ్ కాలింగ్, డేటా, ఎస్ఎంఎస్ వంటివి తక్కువ ధరల్లోనే అందిస్తూ యూజర్లను తమవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి. రిలయన్స్ జియో టీవీ, వొడాఫోన్ ప్లే, ఎయిర్ టెట్ టీవి వంటివి సొంత ఫ్లాట్ ఫాం ద్వారా ఫ్రీగా యూజర్లకు డిజిటల్ సేవలను అందిస్తున్నాయి. 

రిలయన్స్ జియో టీవీ....
రిలయన్స్ జియో తన సబ్ స్క్రైబర్లకు ఫ్రీ డిజిటల్ సబ్ స్క్రిప్షన్ తోపాటు ఫ్రీ రీఛార్జీని కూడా అందిస్తుంది. ఇందులో జియో యాప్ ను కలిగి ఉంటుంది. యూజర్లకు 15భాషల్లో 632 లైవ్ టీవీ ఛానెల్ల యాక్సెస్ ను అందిస్తుంది. ఏడు రోజులపాటు సర్వీసులను అందిస్తుంది. వారం రోజులపాటు ఉన్న ప్రొగ్రామ్స్ ను చూడటానికి యూజర్లను అనుమతిస్తుంది. 
కంపెనీ తన సబ్ స్క్రైబర్లందరికీ ఐపీఎల్ 2019 మ్యాచులను...స్మార్ట్ ఫోన్లలో ప్రత్యక్ష ప్రసారం చేయడానికి వీలు కల్పించింది. అయితే ఈ లైవ్ లో మ్యాచులను చూడాలంటే ఫోన్లో ముందుగానే హాట్ స్టార్ యాప్ ఇన్ స్టాల్ చేయాల్సి ఉంటుంది. జియో టీవీ యాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐఓఎస్, కైఓఎస్ లో అందుబాటులో ఉంది. 
వొడాఫోన్ ప్లే...
వొడాఫోన్ ప్లే అనేది లైవ్ టీవీతోపాటు ఫ్రీగా డిజిటల్ వీడియో కంటెంట్ను ఇష్టపడే సబ్ స్క్రైబర్లకోసం రూపొందించి యాప్ ఇది. ఈ యాప్ తో వొడాఫోన్ యూజర్లను జీసినిమా, టీవీ, 9xm, ఆజ్ తక్ వంటితోపాటు మరిన్ని లైవ్ టీవీ ఛానెల్స్ చూడొచ్చు. సోనీ లైవ్ పార్టనర్ కపిల్ శర్మ షో, ఇంగ్లీష్ వింగ్లీష్ వంటి కంటెంట్ ను యాడ్ చేస్తుంది. వొడాఫోన్ కూడా జీ5, ఆల్ట్ బాలాజీ, ఎరోస్ నౌ, హోయిచోయిలతో భాగస్వామ్యం కలిగి ఉంది. ఇది ఒరిజినల్ స్ట్రీమింగ్ మూవీలను ప్రసారం చేస్తుంది. పాషన్ పార్చాయి, లైఫ్ సాహీ హై, కరెన్జిత్ కౌర్, మెట్రో పార్క్ , మున్నా మైఖైల్ వంటి ప్రోగ్రామ్స్ ను అందిస్తుంది. 
వొడాఫోన్ రెడ్ పోస్ట్ పెయిడ్ యూజర్లు ఒక సంవత్సరం ఫ్రీ అమెజాన్ ఫ్రైమ్ మెంబర్ షిప్ పొందుతారు. ఇది వొడాఫోన్ ప్లే యాప్ నుంచి పొందవచ్చు. మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుంచి మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ స్మార్ట్ ఫోన్లలో వొడాఫోన్ ప్లే యాప్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 

ఎయిర్ టెల్ టీవీ....
వొడాఫోన్, రిలయన్స్ జియో వంటి ఇతర యూజర్లకు ఫ్రీ ప్రీమియం కంటెంట్ తో సహా ఫ్రీ యూజర్లకు టెలిఫోన్ సదుపాయం కల్పిస్తుంది ఎయిర్ టెల్. యూజర్లు జీ, ఏబిపీ న్యూస్ వంటి ఛానెళ్లతో సహా హాలీవుడ్, బాలీవుడ్ వంటి అనేక సినిమాలను అందిస్తుంది. రోబోట్, కహానీ 2, వీరే డి వెడ్డింగ్ వంటి ట్రేడింగ్ సినిమాలను ఉన్నాయి. ప్రీమియం అసలైన కంటెంట్ను ఫ్రీగా చూసేందుకు జీ5,HOQQఎరోస్ నౌ, ఆల్ట్ బాలీజీ తోపాటు హోయిచోయిలతో సహా ఇతర సర్వీసులతో పార్టనర్ షిప్ ఉంది. ఎయిర్ టెల్ యాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ఫ్లాట్ ఫాంలపై అందుబాటులో ఉంది. ఈ సర్వీసు యూజర్లు హాలో2, ది బిగ్ బ్యాంగ్ థియరీ, ఫ్లాష్, యారో, బట్టిగుల్ మీటర్ చాటూ వంటి సినిమాలను చూడవచ్చు. 

జియో వొడాఫోన్ ఎయిర్ టెల్ ప్రీమియం సినిమాలు Jio vodafone airtel premium movies