ప‌బ్‌జీ బ్యాన్ అయింది.. ప్ర‌త్యామ్నాయాలు ఇవిగో

దేశ సార్వ‌భౌమాధికారానికి, వ్య‌క్తుల డేటాకు  భంగం క‌లుగుతుందంటూ కేంద్ర ప్ర‌భుత్వం బుధ‌వారం ప‌బ్‌జీ స‌హా 118 యాప్స్‌ను నిషేధించింది. ప‌బ్‌జీకి దేశంలో యూత్ బాగా అట్రాక్ట్ అయ్యారు. దాన్ని బ్యాన్ చేయ‌డంతో ఇప్పుడు ఇత‌ర యాప్స్ వైపు చూస్తున్నారు. ప‌బ్‌జీకి ప్ర‌త్యామ్నాయంగా ఉన్న 5 యాప్స్ గురించి ఓ లుక్కేయండి.

 

కాల్ ఆఫ్ డ్యూటీ (Call of Duty)
ఎఫ్‌సీఎస్ గేమ్స్‌లో బాగా పాత‌ది కాల్ ఆఫ్ డ్యూటీ. 90ల్లో యూత్‌ను బాగా ఆక‌ట్టుకుంది. దీని మొబైల్ వెర్ష‌న్ ప‌బ్‌జీ లాగానే ఉంటుంది. ఒకేసారి 100 మంది ఆడుకోవ‌చ్చు. బాటిల్ ఫీల్డ్‌, ప్ర‌త్యేక‌మైన ఆయుధాలు దీనిలో ఆక‌ర్ష‌ణ‌‌.  గ్రాఫిక్స్ కూడా బాగుంటాయి. ఐ స్టోర్‌లో దీనికి 4.8 రేటింగ్  ఉంది. ఐ ఫోన్‌లో డౌన్లోడ్ చేసుకుంటే 1.9 జీబీ స్పేస్ తీసుకుంటుంది. ఆండ్రాయిడ్‌లో 4.5 రేటింగ్ ఉంది. ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో 1.5 జీబీ స్పేస్ అవ‌స‌రం.  

 

గ‌రేనా ఫ్రీ ఫైర్  (Garena Free fire)
గ‌రేనా ఫ్రీ ఫైర్ 2017లో రిలీజ్ అయింది. బాటిల్ రాయ‌ల్ గేమ్స్‌లో దీనికో ప్ర‌త్యేక స్థానం ఉంది. ఇప్ప‌టికి 50 కోట్ల డౌన్‌లోడ్స్ అయ్యాయి. 49 మంది ఇత‌ర ప్లేయ‌ర్ల‌తో దీన్ని ఆడుకోవ‌చ్చు. ప‌బ్‌బీజ లాగే పారాచ్యూట్‌, డ్రైవ్ వెహిక‌ల్స్ ఉంటాయి. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త అప్‌డేట్స్‌తో కొత్త కొత్త ఆయుధాల‌ను అందిస్తోంది.  ప్లే స్టోర్‌లో దీనికి 4.1 రేటింగ్ ఉంది.  ఆండ్రాయిడ్ ఫోన్‌లో 580 ఎంబీ స్పేస్ తీసుకుంటుంది. ఐ స్టోర్‌లో 4 రేటింగ్ ఉంది. ఐఫోన్‌లో అయితే 1.4 జీబీ స్పేస్ కావాలి.

 

ఆర్క్‌.. స‌ర్వైవ‌ల్ ఇవాల్వ్‌డ్ (Ark: Survival Evolved)
బ్యాటిల్ రాయ‌ల్ గేమ్స్‌లో ఇదో ప్ర‌త్యేక‌మైన గేమ్‌. డైనోసార్ ట్విస్ట్‌తో ఆక‌ట్టుకుంటుంది. 80 డైనోసార్లు ఉంటాయి. వాటిని మీరు ట్రైన్ చేసి యుద్ధంలోకి పంపొచ్చు. సోలోగా లేదా గ్రూప్‌గా కూడా ఆడుకోవ‌చ్చు.  ప్లే స్టోర్‌లో దీనికి 4 రేటింగ్ ఉంది.  ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఏకంగా 2.4 జీబీ స్పేస్ తీసుకుంటుంది. ఐ స్టోర్‌లో 4.5  రేటింగ్ ఉంది. ఐఫోన్‌లో అయితే 2 జీబీ స్పేస్ కావాలి.

 

బ్యాటిల్ రాయ‌ల్ 3డీ- వారియ‌ర్ 63 (Battle Royale 3d – Warrior63)
ఇది కూడా ఆక‌ట్టుకునే ఆటే. 4x4 కి.మీ. మ్యాప్ ఉంటుంది. భూమి, స‌ముద్రం, ప‌ర్వ‌తాలు ఇలా అన్నింటినీ దాటుకుని వెళుతూ ఆడుకోవ‌చ్చు.    ప్లే స్టోర్‌లో దీనికి 3.9 రేటింగ్ ఉంది.  ఆండ్రాయిడ్ ఫోన్‌లో 99 ఎంబీ స్పేస్ తీసుకుంటుంది. ఐ స్టోర్‌లోనూ 3.9  రేటింగ్ ఉంది. ఐఫోన్‌లో అయితే 381 ఎంబీ స్పేస్ కావాలి.


హోప్‌లెస్ ల్యాండ్‌:  ఫైట్ ఫ‌ర్ స‌ర్వైవ‌ల్ (Hopeless Land: Fight for Survival)
బ్యాటిల్ రాయ‌ల్‌ఫీల్డ్ గేమ్స్‌లో సులువైన గేమ్ ఇది. ఒకేసారి 121 మందితో దీన్ని ఆడుకోవ‌చ్చు. ఇందులో మీరు హెలికాఫ్ట‌ర్ కూడా న‌డ‌పొచ్చు.  ఇప్ప‌టికి 5 కోట్ల డౌన్‌లోడ్స్ అయ్యాయి.    ప్లే స్టోర్‌లో దీనికి  3.9 రేటింగ్ ఉంది.  ఆండ్రాయిడ్ ఫోన్‌లో 346 ఎంబీ స్పేస్ తీసుకుంటుంది. ఐ స్టోర్‌లోనూ 3.9 రేటింగే  ఉంది. ఐఫోన్‌లో అయితే 487 ఎంబీ స్పేస్ కావాలి. 

ప‌బ్‌జీ బ్యాన్‌ ప‌బ్‌జీ ఆల్ట‌ర్నేట్ గేమ్స్‌ పబ్‌జీకి ప్ర‌త్యామ్నాయాలు కాల్ ఆఫ్ డ్యూటీ గ‌రేనా ఫ్రీ ఫైర్ ఆర్క్‌.. స‌ర్వైవ‌ల్ ఇవాల్వ్‌డ్  బ్యాటిల్ రాయ‌ల్ 3డీ- వారియ‌ర్ 63 హోప్‌లెస్ ల్యాండ్‌:  ఫైట్ ఫ‌ర్ స‌ర్వైవ‌ల్ PUBG Ban PUBG alternative games Call of Duty Garena Free fire Ark: Survival Evolved Battle Royale 3d – Warrior63 Hopeless Land: Fight for Survival