ఫుడ్ కోసం కూడా సెర్చ్ ఇంజన్లు ఉన్నాయి, మీకు తెలుసా?

మీరు భోజన ప్రియులా?...ప్రతిరోజూ ఏదోకటి కొత్తగా వండుకోవాలనుకుంటున్నారా? ఎలాంటి వంటకాలు చేసుకోవాలో తెలియక తికమక పడుతున్నారా? అయితే ఈ ఆర్టికల్ మీకోసమే. కొత్త కొత్త వంటకాలను నేర్చుకునేందుకు కొన్ని వెబ్ సైట్లు ఉన్నాయి. ఈ సెర్చ్ ఇంజిన్ల ద్వారా మీకు కావాల్సిన వంటకాలను సెర్చ్ చేయవచ్చు. ప్రపంచంలో ఉన్న వంటకాలన్ని మీ ముందు ఉంటాయి. మీ ఆప్షన్ ప్రకారం వంటకాలను బ్రౌజ్ చేయవచ్చు. ఈ సెర్చ్ ఇంజిన్లు ఫుడ్ కే అంకింతం. అత్యంత ప్రజాదారణ పొందిన ఫుడ్ సెర్చ్ ఇంజిన్ల వివరాలు మీకోసం అందిస్తున్నాం. మీరూ ట్రై చేయండి. 

1.cookthing...
ఈ సెర్చ్ ఇంజిన్ ప్రత్యేకంగా ఆహారం కోసమే క్రియేట్ అయ్యింది. మీరు ఈ వెబ్ సైట్ ను ఓపెన్ చేసినప్పుడు  పైన ఉన్న ఇంటర్ స్పేస్ లో స్రీన్ షాట్ కూడా చూస్తారు. ఎలా వండాలి అనే సెర్చ్ బాక్స్ ఉంటుంది. సెర్చ్ బాక్స్ లో మీకు కావాల్సిన వంటకం పేరును ఎంటర్ చేయండి. కుక్ బటన్ పై క్లిక్ చేయండి. అంతేకాదు మీకు రెసిపిలో ఏయే పదార్థాలను చేర్చాలో తెలిపే లిస్టు కూడా ఉంటుంది. 
వెబ్ లో అన్ని రిజల్ట్స్ ఉంటాయి. మీకు  కావాల్సిన వంటకాన్ని సెలక్ట్ చేసుకోవచ్చు.  కొత్తగా ప్రయత్నించే రెసిపి పేరుపై క్లిక్ చేయండి. ఈ రెసిపి ఏ వెబ్ సైట్లో ఉందో...అది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీకు చేయాల్సిన రెసిపిని చూడవచ్చు. 
మీరు హోం పేజీలో సెర్చ్ బాక్స్ లో ...ఏదైనా డిష్ పేరును ఎంటర్ చేసినట్లయితే...ఆ స్పెషల్ వంటాకన్ని ఎలా తయారు చేయాలనేది పూర్తిగా ఉంటుంది. ఇక ఈ సెర్చ్ ఇంజిన్ పేజీ కుడివైపున...మీరు టూల్స్ ఆప్షన్ను చూడవచ్చు. ఈ టూల్స్ ఆప్షన్లో మీకు కావాల్సిన వంటకాల డేటాబేస్, ఎలా వండాలి,  రోజువారి రెసిపి, బెస్ట్ వంటకాలు వంటివి ఉంటాయి. వంటకాల గురించి సెర్చ్ చేయాలంటే ఇది బెస్ట్ వెబ్ సైట్ అని చెప్పవచ్చు. 
2.supercook...
సూపర్ కుక్...ఇది మరొక బెస్ట్ సెర్చ్ ఇంజిన్. ఈ వెబ్ సైట్ హోం పేజీలో మీకొక పేజీ కనిపిస్తుంది. ఈ పేజీలో మీరు కేటగిరిలుగా విభజించి ఉంటాయి. రెసిపి కోసం మీరు సెర్చ్ చేస్తున్నట్లయితే...ఎడమవైపు బాక్స్ నుంచి కావాల్సిన పదార్థాలను సెలక్ట్ చేసుకోవచ్చు. లేదా మీరు సెర్చ్ చేస్తున్న రెసిపి పేరును కూడా ఎంటర్ చేయవచ్చు. 
లేదంటే మీరు సెలక్షన్ ప్రొసెస్ ద్వారా వెళ్లాలనుకుంటే...టాబ్లో మీకు కావాల్సిన ఇంగ్రిడియన్స్ పేరును టైప్ చేయవచ్చు. ఇప్పుడు వచ్చిన లిస్టు నుంచి మీకు కావాల్సిన పదార్థాలను సెలక్ట్ చేసుకోవచ్చు. ఒకటి లేదా రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలను సెలక్ట్ చేసుకున్న వెంటనే...కుడి వైపున ఉన్న స్క్రీన్ పై మార్పులు కనిపిస్తాయి. మీరు సెలక్ట్ చేసుకున్న పదార్థాల ఆధారంగా వంటకాలను చూపిస్తుంది. 
3.Rock your meal...
మీకు కావాల్సిన ఫుడ్ సెలక్ట్ చేసుకోవాలంటే బెస్ట్ సెర్చ్ ఇంజిన్ రాక్ యువర్ మీల్. ఈ సెర్చ్ ఇంజిన్ ప్రధానంగా వీడియోలతో వంటకాలను చూపిస్తుంది. ఈ సెర్చ్ ఇంజిన్ ఓపెన్ చేయగానే ఒక పేజీని చూస్తారు. సెర్చ్ ఇంజిన్ స్క్రీన్ మధ్యలో ఒక సెర్చ్ బాక్స్ కనిపిస్తుంది. ఈ సెర్చ్ బాక్స్ లో మీకు కావాల్సిన రెసిపి పేరును ఎంటర్ చేయండి. ఇప్పుడు మీకు కావాల్సిన జాబితాను చూపిస్తుంది. 
అంతేకాదు మీ పేరుతో కూడా వంటకాలను సెర్చ్ చేయవచ్చు. మీరు ఎంటర్ చేసిన డిష్ పేరుతో వీడియో వంటకాలను చూపిస్తుంది. అంతేకాదు ఈ సెర్చ్ ఇంజిన్లో కొత్త కొత్త వంటకాలను క్రియేట్ చేయడానికి ఆప్షన్ ఉంది. 
4.RecipeBridge...
రెసిపిబ్రిడ్ట్ ఫుడ్ కోసం ఒక బెస్ట్ సెర్చ్ ఇంజిన్. సెర్చ్ ఇంజిన్ పేజిలో మీరు ల్యాండ్ చేసేటప్పుడు...హోంపేజీ మధ్యలో ఒక సెర్చ్ బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ లో మీకు కావాల్సిన డిష్ పేరు లేదా పదార్ధాలను పేరును టైప్ చేయవచ్చు. ఈ హోం పేజిలో పాపులర్ రెసిపి కేటగిరిలు, ఫేమస్ సెర్చ్ లు, టాప్ రెసిపి సెర్చ్ , టాప్ రెసిపి పబ్లిషర్ వంటి కేటగిరిలు ఉన్నాయి. 
ఈ పేజీలో మీకు కావాల్సిన రెసిపి గురించి పూర్తిగా వివరించి ఉంటుంది. అంతేకాదు సూచనలు కూడా ఉంటాయి. 
5. Ohlardy.com
ఫుడ్ కోసం వెతికేవారికి ఈ వెబ్ సైట్ బెస్ట్ సెర్చ్ ఇంజిన్ అని చెప్పవచ్చు. ఈ వెబ్ సైట్ పేజీలో మొత్తం రెసిపిల గురించి ఉంటుంది. సెర్చ్ బాక్స్ లో మీరు ఏ డిష్ పేరు లేదా పదార్ధాల పేరును ఎంటర్ చేసి...సెర్చ్ బటన్ను నొక్కాలి. ఇప్పుడు మీకు కావాల్సిన ఫలితాలు వస్తాయి. 
సెర్చ్ బాక్స్ లో కొన్ని లింకులు కూడా ఉంటాయి. ఈ లింకుల్లో సలాడ్ వంటకాల గురించి ఉంటుంది. మీకు నచ్చిన లింక్ పై క్లిక్ చేస్తే...రెసిపి పేజీకి తీసుకెళ్తుంది. 
6.Yummly...
ఫుడ్ కోసం సెర్చ్ చేసేవారికి ఇది బెస్ట్ వెబ్ సైట్. మీ సెర్చ్ ఫలితాల్లో ఆకట్టుకునే ఇమేజ్ లతో వంటకాలను చూడవచ్చు. ఈ సెర్చ్ ఇంజిన్ ఇంటర్ స్పేస్ చాలా ఆకట్టుకునేలా ఉంటుంది. అంతేకాదు కొన్ని ఫేమస్ వంటకాలు కూడా హోం పేజీలో ఉంటాయి. మీరు ఈ వెబ్ సైట్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నట్లయితే...మీకు నచ్చిన వంటకాలు అకౌంట్ వస్తుంటాయి. 
మీరు చూడాలనుకున్న సెర్చ్ రిజల్ట్స్ ఒక టైల్ ఫార్మాట్లో ఉంటాయి. ప్రతి రెసిపి ఇమేజ్, రెసిపి టైటిల్ లేదా పేరు కూడా ఉంటుంది. అంతేకాదు వంటకాలు రేటింగ్స్ కూడా ఉంటాయి. మీకు కావాల్సిన వంటకాన్ని సెలక్ట్ చేసుకుని బ్రౌజ్ చేయవచ్చు. 
 

వంటకాలు సెర్చ్ ఇంజిన్లు Food search engines