ఫ్రెష్‌గా రిలీజ్ అయిన స‌రికొత్త యాప్స్ మీకు తెలుసా

ప్ర‌తి రోజూ కొన్ని వంద‌ల‌ సంఖ్య‌లో యాప్స్ ప్లేస్టోర్‌లో వ‌చ్చి చేరుతుంటాయి. మొత్తం 33 లక్ష‌ల‌ యాప్స్‌లో ఏది మంచిదో గుర్తించ‌డం చాలా క్లిష్ట‌మైనది. వీటిలో ఉప‌యోగ‌క‌ర‌మైన‌వీ ఉంటాయి.. మ‌రికొన్ని స‌మాచారాన్ని మ‌న‌కు తెలియ‌కుండానే దోచేసేవీ ఉంటాయి. ఆగస్టులో విడుద‌లైన కొన్ని బెస్ట్ యాప్స్ మీకోసం! 

NOTES BY FIREFOX
వెబ్ బ్రౌజ‌ర్‌ మొజిల్లా రూపొందించిన యాప్ ఈ నోట్స్ బై ఫైర్‌ఫాక్స్‌! గూగుల్ కీప్ ఎలా ప‌నిచేస్తుందో ఇది కూడా అదే త‌ర‌హాలో ప‌నిచేస్తుంది. సులువుగా నోట్స్ త‌యారుచేసుకునేందుకు ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది. అంతేగాక మ‌న ఫోన్‌లో ఉన్న నోట్స్‌ని కూడా ఫైర్‌ఫాక్స్ బ్రౌజ‌ర్‌తో సింక్ర‌నైజ్ చేస్తుంది. యూజ‌ర్ నేమ్‌, పాస్‌వ‌ర్డ్ సాయంతో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇందులో క్రియేట్ చేసిన నోట్స్‌ను కంప్యూట‌ర్‌లో కూడా యాక్సెస్ చేసుకోవ‌చ్చు. 

KIWI BROWSER
యూసీ, క్రోమ్ బ్రౌజ‌ర్‌లను ఉప‌యోగించి బోరు కొట్టిందా?  కొత్త బ్రౌజ‌ర్ కోసం వెతుకుతున్నారా? అయితే ఈ కివీ బ్రౌజ‌ర్ ను ఒక్క‌సారి ట్రై చేయండి. గూగుల్ క్రోమ్‌ను పోలి ఇంట‌ర్‌ఫేస్‌ ఉంటుంది. ఇందులో యాడ్ బ్లాక‌ర్, నైట్ మోడ్‌, డౌన్‌లోడ్ ఫోల్డ‌ర్ వంటి ఫీచ‌ర్లు ఇందులో ఉంటాయి. త‌క్కువ సైజ్ క‌లిగి ఉండే ఈ యాప్‌లో.. యూ ట్యూబ్ వీడియోలను బ్యాగ్రౌండ్‌లో ప్లే చేసే ఆప్ష‌న్ ఉంటుంది. యూట్యూబ్ వీడియోల‌ను బ్యాగ్రౌండ్‌లో ప్లే చేసుకుంటూనే.. ఇత‌ర ప‌నులు కూడా చేసుకోవ‌చ్చు. ఇందులో అడ్ర‌స్ బార్‌.. బ్రౌజ‌ర్ అడుగున ఉంటుంది. 

CX FILE EXPLORER
ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న‌ ఫైల్ మేనేజ‌ర్ యాప్స్‌తో విసిగివేశారిపోతే.. ఈ Cx File Explorer యాప్‌ని ఉప‌యోగించండి. ఇందులో ప్ర‌ధానంగా మూడు భాగాలు ఉంటాయి. ఒక‌టి లోక‌ల్‌. ఇందులో యాప్ డౌన్‌లోడ్స్‌తో పాటు ఇత‌ర స్టోరేజ్ అంశాలు ఇందులో ఉంటాయి. రెండోది లైబ్రెరీ. ఫోన్‌లో ఉన్న ఫొటోలు, ఆడియో ఫైల్స్‌, డాక్యుమెంట్లు త‌దిత‌ర వివ‌రాల‌న్నీ చూపిస్తుంది. మూడోది నెట్‌వ‌ర్క్‌. మొబైల్‌లో ఉన్న డేటాని కంప్యూట‌ర్‌కి పంపించేందుకు అవ‌స‌ర‌మైన ఫీచ‌ర్లు ఇందులో ఉంటాయి. వీటితో పాటు అన‌లైజ్ ఆప్ష‌న్ మ‌రింత స‌మ‌ర్థంగా ప‌నిచేస్తుంది. మెమొరీలో ఎక్కువ స్పేస్‌ని ఆక్ర‌మించిన యాప్స్‌తో పాటు జంక్‌, ఇత‌ర ఫైల్స్‌ని తొల‌గించి ఎక్కువ స్పేస్ ఉండేలా చేస్తుంది.

AMOLED WALLPAPERS
AMOLED వాల్‌పేప‌ర్స్ అంటే ఇష్ట‌ప‌డని వారెవ‌రుంటారు. హెచ్‌డీతో పాటు 4కె రిజ‌ల్యూష‌న్ గ‌ల AMOLED వాల్‌పేప‌ర్స్ అందుబాటులో ఉంటాయి. అంతేగాక ఇవి బ్యాట‌రీని కూడా ఎక్కువ‌గా ఉప‌యోగించుకోవు. చాలా సింపుల్‌గా ఉంటూనే ఎంతో రిచ్ లుక్‌లో క‌నిపిస్తాయి. 

TYT PLUS
వీడియోలు, లైవ్ షోలు వంటివ‌న్నీ ఒకే చోట ల‌భించే యాప్ ఈ TYT Plus. రాజ‌కీయాలు, క్రీడ‌లు, పాప్ క‌ల్చ‌ర్ వంటి అంశాల‌న్నింటిపై ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ అవ్వాల‌నుకుంటే త‌ప్ప‌కుండా ఈ యాప్‌ను ఉప‌యోగించాల్సిందే! ప్లే స్టోర్‌లో ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. నెల‌కు రూ. 300 వ‌ర‌కూ పే చేసి ప్రీమియం ప్ల‌స్ స‌ర్వీసులు పొంద‌వ‌చ్చు. 

SIEMPO 
డిజిట‌ల్ అడిక్ష‌న్‌ను త‌గ్గించేందుకు ఉప‌యోగ‌ప‌డే యాప్ ఇది. ఇది ఆండ్రాయిడ్ హోమ్ స్క్రీన్ ను పూర్తిగా మార్చేస్తుంది. ప్ర‌స్తుతం ఉండే యాప్ ఐకాన్స్ క‌నిపించ‌కుండా సాధార‌ణ ఫోన్‌లా బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్‌తో కనిపిస్తుంది. ముందుగా ఈ యాప్‌ను ఇన్‌స్టార్ చేసుకునే స‌మ‌యంలో ఒక గోల్ మెసేజ్‌ని టైప్ చేయాల్సి ఉంటుంది. ఈ మెసేజ్ నిరంత‌రం మ‌న‌కు క‌నిపిస్తూ ఉంటుంది. ముందుగా మ‌న‌కు అత్యంత ఉప‌యోగ‌క‌ర‌మైన మెసేజ్, ఈ మెయిల్ వంటి యాప్స్.. లిస్టులో పై భాగంలో క‌నిపిస్తాయి. ఎక్కువ‌గా ఉప‌యోగించే యాప్స్ అన్నింటినీ ఫ్లాగ్ చేసుకోవాల్సి ఉంటుంది. 

NAVBAR WEATHER
వాతావ‌ర‌ణం ఎలా ఉండబోతోందనే విష‌యం ఫోన్‌లోని నేవిగేషన్ బార్ మీదే ఈ యాప్ ద్వారా తెలుసుకోవ‌చ్చు. గ్రాఫ్‌లు, చార్టుల రూపంలో ఫోన్ అడుగు భాగంలో ఇవి క‌నిపిస్తుంటాయి. వీటితో పాటు మ‌రెన్నో ఫీచ‌ర్లు ట్రాన్స్‌ప‌రెంట్ బ్యాగ్రౌండ్‌లో ఉంటాయి. వాతావ‌ర‌ణంలో తేమ శాతం ఎంత ఉంది, ఎంత వేగంతో గాలి వీస్తోంది.. వంటి ఆప్షన్లు ఉన్నాయి. అంతేగాక రానున్న మూడు లేదా ఐదు రోజుల్లో వాతావ‌ర‌ణంలో ఎలాంటి మార్పులు జ‌రుగుతాయో కూడా ముందే ఈ యాప్ ద్వారా తెలుసుకోవ‌చ్చు. 

MUSIC PLAYER & AUDIO PLAYER
ఆఫ్‌లైన్‌లో నిరంత‌రం పాట‌లు వినాల‌నుకునే వారి కోసం రూపొందించిన‌ది ఈ యాప్‌. ఇంట‌ర్నెట్ స్పీడ్‌, బ్యాండ్ విడ్త్‌, ఇత‌ర అంశాలేమీ ఆలోచించ‌కుండా సులువుగా పాట మీద క్లిక్ చేసి ప్లే బ‌ట‌న్ నొక్కితే చాలు ఆఫ్‌లైన్‌లో పాట‌లు వినొచ్చు. ఇందులో 15 ఈక్వ‌లైజ‌ర్ కంట్రోల‌ర్లు ఉంటాయి. వీటితో పాటు ఇత‌ర మ్యూజిక్ ప్లేయ‌ర్ల‌లో ఉండే ప్లేలిస్ట్‌, ఫేవ‌రేట్స్‌, బేస్ కంట్రోల్ ఆప్ష‌న్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

best android apps august NOTES BY FIREFOX KIWI BROWSER CX FILE EXPLORER AMOLED WALLPAPERS