మాయదారి కరోనా మనుషులను దూరం చేస్తోంది. ముఖానికి మాస్క్ వేసుకోవడం, చేతికి శానిటైజర్ పూసుకోవడమే కాదు. మనిషికీ మనిషికీ మధ్య భౌతిక దూరం (ఫిజికల్ డిస్టేన్స్) పాటించాలని ప్రభుత్వాలు పదే పదే చెబుతున్నాయి. దానికి తగ్గట్లే ఆఫీస్ వాహనాల్లో రెండు సీట్లకు ఒకరినే కూర్చోబెడుతున్నారు. ఆఫీస్ క్యాబిన్లలో, లాబీల్లో ఆఖరికి క్యాంటీన్లలోనూ ఈ దూరం పాటించడానికి ఏర్పాట్లు చేశారు. అయితే ఇంతా చేసినా మనం ఎడం పాటించకపోతే.. అందుకే ఐక్యరాజ్యసమితి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు భౌతిక దూరం పాటించడానికి వన్పాయింట్ ఫైవ్ (1point5) అనే యాప్ను డిజైన్ చేసింది.
యాప్ సెట్టింగ్ చేసుకోవడం ఎలాగంటే
గూగుల్ ప్లేస్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్లోకి వెళ్లి 1point5 యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
యాప్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయగానే గెట్ స్టార్టెడ్ అని చూపిస్తుంది.
దాన్ని క్లిక్ చేస్తే... మీ చుట్టుపక్కల ఎన్ని మీటర్ల దూరంలోకి ఇతరులు వస్తే హెచ్చరించాలనేది మీరే నిర్ణయించుకోవచ్చు. 1.5 మీటర్లా లేక 2 మీటర్లా అనేది మీరు డిఫాల్ట్గా పెట్టుకోవచ్చు.
ఈ సెలక్షన్ పూర్తయ్యాక బ్లూటూత్ ఎనేబుల్ చేయాలి. ఆ తర్వాత జీపీఎస్ లొకేషన్ యాక్సెస్కు అనుమతించాలి. ఈ రెండు పర్మిషన్లు ఇవ్వకపోతే ఈ యాప్ పని చేయదు. ఎందుకంటే ఇది లొకేషన్ బేస్డ్గా పని చేసే యాప్ కాబట్టి.
ఒప్పొ, వివో, షియోమి, రియల్మీ యూజర్లు ఫోన్ను ఆటో స్టార్ట్లో పెట్టుకోవాలి. ఇక ఎలా వాడాలంటే...
దూరం పాటించకపోతే మొబైల్ మోగుతుంది
అలారమ్ సౌండ్ ఆఫ్ చేయడం, వైబ్రేషన్ ఆన్/ఆఫ్ లాంటివి చేయడానికి దిగువన సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది. ఒకేసారి ఎంతమంది యూజర్లు మీకు దగ్గరకు వచ్చినా... వాళ్ల మొబైల్ మోడల్ పేరుతో మీకు ఎంతదూరంలో ఉన్నారనేది చూపిస్తుంది. దగ్గర్లో ఎవరూ లేకపోతే భౌతిక దూరం పాటిస్తున్నందుకు ధన్యవాదాలు అని మొబైల్ స్క్రీన్ మీద సందేశం కనిపిస్తుంది. ఇంట్లోనో, ఆఫీస్లోనో ఉన్నప్పుడుదగ్గరగా ఎవరైనా వస్తే అలారం మోగి డిస్ట్రబ్ చేయకుండా మీ కుటుంబసభ్యులు, కొలీగ్స్ నెంబర్లను మినహాయించుకునే ఆప్షన్ కూడా ఉంది.
ఇదీ ట్విస్ట్
ఈ యాప్కి ఉన్న అతిపెద్ద మైనస్ పాయింట్ ఏమిటంటే అవతలి వ్యక్తి కూడా ఈ యాప్ వాడాలట. అప్పుడే ఈ యాప్ పని చేస్తుందట. సో మనం డౌన్లోడ్ చేసుకుంటే చాలదు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే పక్కోళ్లతో కూడా ఈ యాప్ డౌన్లోడ్ చేయించాలన్నమాట. గొప్ప టాస్కే.
వ‌నà±â€Œà°ªà°¾à°¯à°¿à°‚టౠఫైవౠయాపà±â€Œ 1పాయింటౠ5యాపà±â€Œ ఫిజిక‌లౠడిసà±à°Ÿà±‡à°¨à±à°¸à±â€Œ à°à±Œà°¤à°¿à°•‌దూరం చూపించే యాపà±â€Œ 1point 5 1point 5 app Physical distance Â