మిమ్మల్ని ఆరోగ్యంగా తీర్చిదిద్దే బెస్ట్ యోగా యాప్స్ ఇవే 

యోగాని రోజువారీ జీవితంలో భాగంగా చేసుకుంటే చాలా సంతోషంగా గడిపేయవచ్చు. ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. యోగాచేయాలంటే కచ్చితంగా క్లాసులకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉంటూనే యోగాచేయొచ్చు. ఇందుకోసం ఆన్‌లైన్‌లో కొన్ని యాప్స్ సిద్ధంగా ఉన్నాయి.అవేంటో చూద్దాం

The Breathing App
శ్వాసకు సంబధించిన పూర్తి సమాచారం ఈ యాప్ లో లభిస్తుంది. యోగా చేసే ముందు శ్వాస తీసుకుని, వదలడం ఎలా, శ్వాస ఎంతసేపు తీసుకోవాలి అనే వివరాలు ఉంటాయి. 

yoga go app 
ఈ యాప్‌లో ఫిట్‌నెస్‌తో పాటు అధిక బరువు నియంత్రించుకోవడానికి నియమాలు కూడా ఉంటాయి. ఏడు నిమిషాల నుంచి మొదలై 30 నిమిషాల వరకు యోగా చేసేలా ఉంటుంది.ఐదు నిమిషాల్లోనే చేసే యోగాసనాల గురించి ఈ యాప్ పూర్తిసమాచారం ఇస్తుంది. 

Pocket Yoga : 
యోగాసనాలు వేయడంలో ఈ యాప్ ఎన్నో సూచనలు ఇస్తుంది. ఇందులో వివిధ రకాల భంగిమలు ఉంటాయి. వాటిని ఎలా వేయాలో ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. 

yoga wave app :
ఈ యాప్ అప్పుడే యోగా నేర్చుకునేవారినుంచి నిష్ణాతులైనవారివరకూ అందరికీ చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులోని నియమాలుపాటిస్తే శరీరం చక్కగా, ఆరోగ్యంగా మారుతుంది. 

Simple Habit
ఈ యాప్ మెడిటేషన్‌కి సంబంధించిన అన్ని విషయాలను వివరిస్తుంది. స్ట్రెస్, ఏకాగ్రతను పెంచి నిద్రలేమి సమస్యను దూరం చేస్తుందని చెప్పొచ్చు.

యోగా యాప్స్ న్యూస్ బెస్ట్ యోగా యాప్స్ యోగా ఉపయోగాలు యోగా ఎలా వేయాలి యోగాలో రకాలు