సామాజిక మాధ్యమాలలో జిఫ్ కల్చర్ పెరిగిపోయింది. ప్రతిరోజూ మనం చూసే పోస్టింగులలో దాదాపుగా జిఫ్ లు ఉంటున్నాయి. కొన్ని సెకన్ల నిడివితో ఉండే జిఫ్ ఇమేజ్ లు చాలా వరకు ఫన్నిగా ఉంటాయి. మీకు జిఫ్ లంటే ఇష్టమా? అయితే ఈ ఉచిత జిఫ్ సెర్చ్ ఇంజిన్స్ లిస్టు ద్వారా జిఫ్ లను క్రియేట్ చేయండి. జిఫ్ సెర్చ్ ఇంజిన్ల ద్వారా మీరు క్రియేట్ చేసిన జిఫ్ లను కంప్యూటర్ లోకి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. లేదా ఇతరులతో URLతో షేర్ చేసుకోవచ్చు. అంతేకాదు జిఫ్ ను వీడియోగా డౌన్ లోడ్ చేసుకోవడానికి ఈ జిఫ్ సెర్చ్ ఇంజిన్లు కొన్ని అందుబాటులో ఉన్నాయి.
1.TENOR....
జిఫ్ లను క్రియేట్ చేయడానికి బెస్ట్ సెర్చ్ ఇంజిన్లలో టెనర్ ఒకటి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు క్రియేట్ చేసిన జిఫ్ కు వాటర్ మార్క్ ఉండదు. ఏవైనా జిఫ్ ఉపయోగించడానికి యూజర్లకు ఫీచర్ అవసరం లేదు. SD క్వాలిటీ, HDక్వాలిటీ లేదా MP4 వీడియోలో జిఫ్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అంతేకాదు వీడియో కాన్వర్షన్ కూడా అందుబాటులో ఉంది.
* ఫ్రీ అకౌంట్ ను క్రియేట్ చేసుకుని...మీరు స్వంతగా తయారు చేసుకున్న జిఫ్ లను అప్ లోడ్ చేయండి
* ఒకేసారి పది జిఫ్ లను అప్ లోడ్ చేయవచ్చు. జిఫ్ కోసం మల్టిపుల్ ట్యాగ్స్ ను యాడ్ చేసుకోవచ్చు.
* ఒకసారి అప్రూవ్ అయ్యాక మీ జిఫ్ లను ఇతరులకు యాక్సస్ చేసుకోవచ్చు. డౌన్ లోడ్ కూడా చేయవచ్చు.
* మీకు నచ్చిన జిఫ్ లను కూడా తయారు చేసుకోవచ్చు.
* జిఫ్ లను డౌన్ లోడ్ చేసే ముందు, మీరు జిఫ్ కి హోంపేజీని యాడ్ చేసే ఆప్షన్‌ను కలిగి ఉంటారు.
* ట్రేడింగ్ టెనర్ సెర్చ్ లు, ట్రెండింగ్ జిఫ్ లు దాని హోంపేజీలో కనిపిస్తాయి. కాబట్టి మీరు ఇతరులు సెర్చ్ చేస్తున్న దాన్ని ఉపయోగించి....జిఫ్ లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
2.GIPHY....
యానిమేటెడ్ జిఫ్ లను గుర్తించి..వాడుకోవడంలో అతిపెద్ద ఫ్లాట్ ఫాంలలో జిఫి ఒకటి. మీరు జిఫ్ లను కేటగిరిలు, స్పోర్ట్స్, ఎంటర్ టైన్ మెంట్, రియాక్షన్స్ వంటివి ఈ జిఫ్ సెర్చ్ ఇంటిన్లో ఒక సెర్చ్ ను ప్రారంభించడం ద్వారా సెర్చ్ చేయవచ్చు. జిఫ్ ను సేవ్ చేయడానికి...మీరు రైట్ సైడ్ క్లిక్ మెనుని ఉపయోగించాలి. ఈ జిఫ్ సెర్చ్ ఇంజిన్ ద్వారా మీరు వీడియో URLను పొందవచ్చు. జిఫ్ ను MP4వీడియోగా సేవ్ చేయవచ్చు. వీడియోపై వాటర్ మార్క్ ఉంటుంది. కాబట్టి నాన్ కమర్షియల్ ఉపయోగం కోసం జిఫ్ లు, వీడియోలను ఉపయోగించవచ్చు. డౌన్ లోడ్ చేసిన జిఫ్ లపై వాటర్ మార్క్ ఉండదు.
టెనర్ వలే ఇది కూడా కొన్ని మంచి ఫీచర్లను కలిగి ఉంది.
* మీరు జిఫ్ లను అప్ లోడ్ చేయడానికి ఒక అకౌంట్ ను క్రియేట్ చేసుకోవాలి. మల్టిపుల్ జిఫ్ లను అప్ లోడ్ చేసుకోవచ్చు. జిఫ్ ను అప్ లోడ్ చేసేటప్పుడు మల్టిపుల్ ట్యాగ్స్, సోర్స్ యాడ్ చేయబడుతాయి.
* జిఫ్ లను పబ్లిక్ గా కానీ, ప్రైవేట్ గా కానీ వాడుకోవచ్చు. ఈ ప్రైవసీ ఫీచర్ టెనార్ లో ఉండదు.
*ఏవైనా మీకు నచ్చిన జిఫ్ లను గుర్తించి తర్వాత వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు. ట్విట్టర్, ఇన్ స్టాగ్రాం, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా నెట్ వర్క్స్ లో షేర్ చేసుకోవచ్చు.
*అంతేకాదు వీడియోను జిఫ్ గా కూడా మార్చుకోవచ్చు. ఇతర జిఫ్ సెర్చ్ ఇంజిన్లు వలే అందుబాటులో లేకపోవడం బెస్ట్ ఫీచర్.
* పీసీ నుంచి ఫోటోలను, జిఫ్ లను యాడ్ చేయడం ద్వారా జిఫ్ స్లైడ్‌ను క్రియేట్ చేయవచ్చు.
3.GFYCAT....
మీరు జిఫ్ లను గుర్తించి, డౌన్ లోడ్ చేసేందుక మరొక మంచి ఫ్లాట్ ఫాం జిఫిక్యాట్. ఇది పర్సనల్ గా ఉపయోగించుకోవడానికి అందుబాటులో ఉంటుంది. మీరు SD, HD క్వాలిటీలో జిఫ్ ను ప్లే చేయడానికి...చిన్న, పెద్ద సైజుల్లో కూడా డౌన్ లోడ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తుంది.
జిఫ్ ల కోసం సెర్చ్ చేయవచ్చు. లేదా గేమింగ్, సెలబ్రిటీలు, రియాక్షన్స్ తోపాటు ఇతర క్యాటగిరిలను కూడా బ్రౌజ్ చేయవచ్చు.
ఇక ఇతర ఫీచర్ల విషయానికొస్తే...టెనర్, జిఫిని పోలీ ఉంటాయి. జిఫ్ లను అప్ లోడ్ చేయడానికి, షేర్ చేయడానికి మీరు ఫ్రీ అకౌంట్ ను క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ట్రయల్ జిఫ్ ట్యాగ్స్ ను వీక్షించడానికి జిఫ్ ల నుంచి వీడియోను క్రియేట్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
4.IMGUR...
ఇది చాలా ప్రజాదరణ పొందింది. జిఫ్ లను టన్నుల కొద్ది గుర్తించడానికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇమేజ్ లను స్టోర్ చేయడానికి, జిఫ్ లను డౌన్ లోడ్ చేయడానికి పర్సనల్ గా ఉపయోగించుకోవచ్చు. జిఫ్ ను వీడియో ఫైల్ గా లేదా డైరెక్ట్ గా యానిమేటెడ్ జిఫ్ గా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇది జిఫ్ లేదా వీడియోను ప్లే చేయడానికి బిల్ట్ ఇన్ ప్లేయర్ ను అందిస్తుంది. డౌన్ లోడ్ చేయబడిన జిఫ్ కు ఎలాంటి వాటర్ మార్క్ ఉండదు. దీనిని నాన్ కమర్షియల్ కోసం ఉపయోగించుకోవచ్చు.
ఇందులో రెండు ఆప్షన్లు ఉంటాయి. అప్ వోట్, డౌన్ వోట్, వీటి ద్వారా కామెంట్స్ యాడ్ చేయవచ్చు. రీపోస్టు జిఫ్ కూడా అందుబాటులో ఉంది. అయితే దాని కోసం మీరు అకౌంట్ ను క్రియేట్ చేసుకోవల్సి ఉంటుంది. అకౌంట్ క్రియేట్ చేసుకుంటే చాలా ప్రయోజనాలు ఉంటాయి. మీ స్వంత ఇమేజ్ లు, జిఫ్ లను అప్ లోడ్ చేసి...వాటిని ప్రైవేట్ గా పబ్లిష్ చేసుకోవచ్చు.
ఇక meme చేయడానికి, జిఫ్ వీడియో మార్చడానికి చాలా ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
జిఫౠసెరà±à°šà± ఇంజనà±à°²à± టెనరౠజిఫి gif search engines tener giphy imgur