ప్రైవసీ.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మందిని కలవరపెడుతున్న అంశమిదే. టెక్నాలజీ మన జీవితంలోకి విపరీతంగా చొచ్చుకుని వచ్చేశాక ప్రైవసీ అనేమాటకు అర్థం లేకుండా పోతుంది. సరదాగా స్మార్ట్ఫోన్లో డౌన్లోడ్ చేసే ఓ గేమ్, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ కోసం వాడుకునే ఒక యాప్, ఆఖరికి మన క్యాలెండర్ యాప్ కూడా మన వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించే ప్రమాదముంది. ఇలాంటి పరిస్థితుల్లో స్మార్ట్ఫోన్ యూజర్లు తమ ప్రైవసీని కాపాడుకోవడానికి పనికొచ్చే యాప్స్ వివరాలు మీకోసం..
డక్డక్గో (DuckDuckGo)
సాధారణంగా మనం మొబైల్ ఫోన్లో గూగుల్ క్రోమ్, ఫైర్ఫ్యాక్స్ లేదా ఫోన్లో ఇన్బిల్ట్గా వచ్చిన డిఫాల్ట్ బ్రౌజర్ను వాడుతుంటాం. వీటిలో మీ డేటా సెక్యూర్డ్గా ఉంటుందని నమ్మకం లేదు. అందుకే వాటి ప్లేస్లో డక్డక్గో (DuckDuckGo). ఈ బ్రౌజర్ తన సొంత సెర్చ్ ఇంజిన్ మీద పనిచేస్తుంది. కుకీస్ను ట్రాక్ చేయదు. మీ సెర్చ్ హిస్టరీని స్టోర్ చేయదు. ఐపీ అడ్రస్లు ఎవరూ ట్రాక్ చేయకుండా హైడ్ చేస్తుంది కూడా. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది మీ పర్సనల్ డేటాను ఎట్టి పరిస్థితుల్లోనూ సేకరించదు కాబట్టి డకడక్గో బ్రౌజర్ను బేఫికర్గా వాడుకోవచ్చు.
టెలిగ్రామ్ (Telegram)
వాట్సాప్ లేని స్మార్ట్ఫోన్ ఈరోజు ఎక్కడా కనపడదేమో. కానీ ఆ వాట్సాప్, ఫేస్బుక్ మెసెంజర్, వైబర్ లాంటివి కూడా మీ సెక్యూరిటీకి ఇబ్బంది కలిగించేవే. అందుకే వాట్సాప్ తీసేసి దాని ప్లేస్లో టెలిగ్రామ్ (Telegram) యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇది మూడు రకాలుగా మీ డేటాను ఎన్క్రిప్ట్ చేస్తుంది కాబట్టి మీ డేటా మరింత సేఫ్. అంతేకాదు ఒకవేళ మీ డేటా లీకయినా దాన్ని ఎవరూ చదవలేరు. టెలిగ్రామ్ ఇండియన్ మేడ్ యాప్. 10 కోట్ల మంది యూజర్లున్న ఈ యాప్ వాట్సాప్ కంటే ఫాస్ట్గా పని చేస్తుంది. అంతేకాదు వాట్సాప్లో మాదిరిగా దీనిలో ఇంత సైజ్ ఫైలే సెండ్ చేయాలన్న లిమిట్ లేదు. .
ఎనీ సాఫ్ట్ కీబోర్డ్ (AnySoftKeyboard)
మీరు గుర్తించారో లేదో గానీ మీ ఫోన్ కీబోర్డ్ కూడా మీరు ఏం టైప్ చేస్తున్నారో ట్రాక్ చేసే ప్రమాదముంది. ఎందుకంటే మీరు కీబోర్డ్ యాప్ డౌన్లోడ్ చేసేటప్పుడే అది వైఫై, డేటా పర్మిషన్స్ అడుగుతుంది. అంటే మనం నెట్ బ్యాంకింగ్ వంటి వాటిలో టైప్ చేసే యూజర్ ఐడీ, పాస్ వర్డ్ కూడా ట్రాక్ చేయొచ్చు. అందుకే మీ ఫోన్ లో డిఫాల్ట్గా ఉన్న కీబోర్డ్ మొదలు ఎనీ సాఫ్ట్ కీబోర్డు వాడుకోండి. ఇది ఎలాంటి ఇంటర్నెట్ కనెక్షన్ అడగదు. స్వైప్ టైపింగ్, ప్రెడిక్టివ్ టెక్స్ట్, లాంగ్వేజ్ ఆప్షన్, థీమ్స్ అన్నీ మామూలు కీబోర్డులాగానే ఉంటాయి. సెక్యూరిటీపరంగానూ సేఫ్.
ఓఐ ఫైల్ మేనేజర్ (OI File Manager)
డేటా ఆర్గనైజ్ చేసుకోవడానికి ఫోన్లలో వాడే ఫైల్ మేనేజర్ల ద్వారా కూడా మీ డేటా లీకయ్యే ప్రమాదముంది. ఎందుకంటే ఇవన్నీ ఇంటర్నెట్ పర్మిషన్ తీసుకుంటాయి. అందుకే మీ రెగ్యులర్ ఫైల్ మేనేజర్కు బదులుగా ఓఐ ఫైల్ మేనేజర్ (OI File Manager) వాడండి. ఇది ఎలాంటి ఇంటర్నెట్ పర్మిషన్స్ అడగదు. దీనిలో ఎలాంటి యాడ్స్ కూడా ఉండవు. మీ రెగ్యులర్ ఫైల్ మేనేజర్ చేసే పనులన్నీ ఎలాంటి డేటా బయటకి పొక్కకుండా పని చేస్తుంది.
సింపుల్ క్యాలెండర్ (Simple Calendar)
క్యాలెండర్ యాప్లో మీరు మీ అపాయింట్మెంట్స్, మీటింగ్స్ రిమైండర్స్ సెట్ చేసుకుంటే ఫోన్కి ఉన్న ఆన్లైన్ కనెక్షన్ ద్వారా అవి లీకయ్యే ప్రమాదముంది. అందుకే దీని ప్లేస్లో సింపుల్ క్యాలెండర్ వాడండి. ఇది మీ డేటాను భద్రంగా ఉంచుతుంది.
పీడోమీటర్ (Pedometer), వెదర్ (Weather)
ఫిట్నెస్ యాప్స్ కూడా డేటా పర్మిషన్ అడుగుతాయి. కాబట్టి వాటితో కూడా డేంజరే. అందుకే వాటిని తీసేసి పీడోమీటర్ యాప్ వాడుకోండి. వాతావరణ పరిస్థితులు చెప్పే వెదర్ యాప్స్ కూడా డేటా లీక్ చేస్తున్నాయి. అందుకే వాటి ప్లేస్లో వెదర్ యాప్ను డౌన్లోడ్ చేయండి.
డేటా à°â€Œà°¦à±à°°à°‚à°—à°¾ ఉంచే యాపà±à°¸à±â€Œ డ‌కà±â€Œà°¡â€Œà°•à±â€Œà°—ో టెలిగà±à°°à°¾à°®à± ఎనీ సాఫà±à°Ÿà± కీబోరà±à°¡à± ఓఠఫైలౠమేనేజ‌రౠData secure apps DuckDuckGo OI File Manager AnySoftKeyboard Telegram సింపà±à°²à± à°•à±à°¯à°¾à°²à±†à°‚డ‌రà±â€Œ Simple Calendar Â