మీ ఫోన్ నిరంత‌రం కంప్యూట‌ర్‌తో క‌నెక్ట్ చేసి ఉంచే యాప్‌

మీ కంప్యూట‌ర్ (PC)ను, మీ స్మార్ట్ ఫోన్‌తో నిరంత‌రం క‌నెక్ట్ చేసి ఉంచే విండోస్ 10 యాప్ ‘YOUR PHONE’ గురించి మీకు తెలుసా? మీ ఫోన్‌లోని ఫొటో గ్యాల‌రీ నుంచి ఫొటోల‌ను మీ కంప్యూట‌ర్‌లో చూసుకోవాల‌ని భావించి ఉంటారు? అందుకోసం మీ సొంత మెయిల్‌కు వాటిని ఎన్నిసార్లు పంపి ఉంటారు? అలాగే ఫోన్ మెసేజ్‌ల‌ను కంప్యూట‌ర్‌లో చూడాల‌ని కూడా చాలాసార్లు అనుకుని ఉంటారు క‌దూ! అదే స‌మ‌యంలో అలా చేయ‌డంలో ఇబ్బందులు ఎదురై చాలాసార్లు విసిగిపోయి ఉంటారు కూడా... అదే స‌మ‌యంలో ఇందుకో సుల‌భ‌మార్గం ఉంటే బాగుండున‌ని కూడా భావించి ఉంటారు. ఇదిగో... ఇప్పుడు అలాంటి యాప్ మీకు అందుబాటులోకి వ‌చ్చేసింది. ఇది మీ PCని ఫోన్‌తో నిరంత‌రం సంధానిస్తుంది. దాని పేరే ‘Your Phone’. దీన్ని PCలో ఇన్‌స్టాల్ చేసుకుంటే స‌రి... మీ ప‌ని సులువైపోతుంది.
మీరేం చేయాలంటే...
మైక్రోసాఫ్ట్ స్టోర్ లేదా న‌మ్మ‌క‌మైన సైట్ నుంచి ముందుగా YOUR PHONE యాప్‌ను మీ విండోస్ 10 కంప్యూట‌ర్‌లో ఇన్‌స్టాల్ చేసుకోండి. త‌ర్వాత దాన్ని లాంచ్ చేసి, ‘GET STARTED’ బ‌ట‌న్‌పై క్లిక్‌ చేయండి. వెంట‌నే మీకు క‌నిపించే స్క్రీన్‌లో మీ మైక్రోసాఫ్ట్ అకౌంట్‌లోకి సైన్-ఇన్ చేశాక  ‘LINK PHONE’ ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. దానిపై క్లిక్ చేయ‌గానే మీ ఫోన్ నంబ‌ర్ అడుగుతుంది. అక్క‌డ మీ ఫోన్ నంబ‌ర్‌ను నింపండి. అటుపైన యాప్‌ను పీసీతో క‌నెక్ట్ చేసేందుకు ఒక లింక్‌ను మెసేజ్‌ద్వారా మీ ఫోన్‌కు పంపుతుంది. ఆ లింక్‌పై క్లిక్ చేయ‌గానే ‘యువర్ ఫోన్ కంపానియ‌న్‌’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌డం కోసం అది మిమ్మ‌ల్ని గూగుల్ ప్లేస్టోర్‌కు తీసుకెళ్తుంది. దాన్ని ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్నాక ఓపెన్ చేయండి. ఆ త‌ర్వాత యాప్‌ను ఉప‌యోగించి మైక్రోసాఫ్ట్ అకౌంట్‌లోకి లాగిన్ కండి. అనంత‌రం ఈ యాప్ కొన్ని అద‌న‌పు ప‌ర్మిష‌న్లు కోరుతుంది. స్క్రీన్‌మీద క‌నిపించే ఆప్ష‌న్ల మేర‌కు మీరు ప‌ర్మిష‌న్ ఇవ్వ‌గానే మ‌న పీసీ, ఫోన్ల‌ను లింక్ చేసిన‌ట్లు స్క్రీన్‌లో చూపుతుంది. 
ఇప్పుడేం చేయాలి?
కంప్యూట‌ర్, ఫోన్ క‌నెక్ట్ అయిన త‌ర్వాత మీ పీసీలోకి వెళితే, మీ ఫోన్‌లోని ఫొటోల‌ను, మెసేజ్‌ల‌ను యాప్ ఇంట‌ర్‌ఫేస్‌లో చూసుకోవ‌చ్చు. ఇక ఆపైన మీకు కొత్త మెసేజ్ వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా మీరు ఫోన్‌లోకి తొంగిచూసే అవ‌స‌రం లేదు. వాటిని పీసీ మీద‌నే చూసుకోవ‌చ్చు... స‌మాధానం కూడా పంప‌వ‌చ్చు. అదేవిధంగా ఫోన్‌లోని ఫొటోల‌ను మీ మెయిల్‌కు పంపించుకునే బాధ త‌ప్పుతుంది. మీరు కేవ‌లం ఈ యాప్‌లోకి వెళ్లి ఫోన్‌లోని ఏ ఫొటోనైనా కంప్యూట‌ర్‌లో నిక్షేపంగా వాడుకోవ‌చ్చు. 
యువ‌ర్ ఫోన్ యాప్‌లో ఫీచ‌ర్లు ఇవే
•   మీ ఫోన్‌ను కంప్యూట‌ర్‌తో అత్యంత సుల‌భంగా లింక్ చేసుకోవ‌చ్చు.
•   ఫోన్‌లోని ఫొటో గ్యాల‌రీ, మెసేజెస్‌ను కంప్యూట‌ర్ మీద యాక్సెస్ చేయొచ్చు.
•   ఫోన్ నుంచి ఫొటోల‌ను డ్రాగ్ చేసి కంప్యూట‌ర్‌లో డ్రాప్ చేసుకోవ‌చ్చు.
•   ఫొటోల‌పై Right Clickతో వాటిని కాపీ లేదా షేర్ చేసుకోవ‌చ్చు.
•   కంప్యూట‌ర్‌లోని యాప్ స్క్రీన్ మీదినుంచే మెసేజ్‌లు చ‌దువుకోవ‌చ్చు... జ‌వాబు కూడా పంప‌వ‌చ్చు.
   ఇంకెందుకు ఆల‌స్యం వెంట‌నే YOUR PHONE యాప్‌ను కంప్యూట‌ర్‌లో ఇన్‌స్టాల్ చేసేయండి మ‌రి!

App  Your phone  Computer  Link