మ‌న చుట్టూ ఉన్న ఎయిర్ పొల్యూష‌న్ చెక్ చేయ‌డానికి క‌రెక్ట్ యాప్స్‌

ఇప్పుడు ఎక్క‌డ చూసినా వినిపిస్తున్న మాట గాలి కాలుష్యం. ఇటీవ‌ల భార‌త్‌, బంగ్లాదే్శ్ తొలి టీ20 సంద‌ర్భంగా ఈ మాట ఇంకా గ‌ట్టిగా వినిపించింది. దీనికి కార‌ణంగా విప‌రీతంగా గాలి కాలుష్య కార‌కాలు ఉన్న దిల్లీ న‌గరంలో ఈ మ్య‌చ్ జ‌ర‌గ‌డం. ఇక్క‌డ కొన్ని ఏరియాల్లో గాలి పీలిస్తే రోజంతా సిగిరెట్లు కాల్చిన ఫ‌లితం వ‌స్తుంద‌ట‌. కేవ‌లం దిల్లీ మాత్ర‌మే కాదు ముంబ‌యి, హైద‌రాబాద్ లాంటి మ‌హా న‌గ‌రాల్లోనూ కాలుష్యం పెద్ద స‌మ‌స్య‌గా ఉంది. మ‌రి మ‌న చుట్టూ ఉన్న కాలుష్యాన్ని క‌నిపెట్ట‌డం ఎలా... త‌గిన జాగ్ర‌త్తలు తీసుకోవ‌డం ఎలా? ..ఇందుకు కూడా కొన్ని యాప్స్ ఉన్నాయి.. అవేంటో తెలుసా?

స‌ఫార్ ఎయిర్‌
గాలిలో కాలుష్యం తెలుసుకోవ‌డం కోసం ఎయిర్ కంట్రోల్ అండ్ వెద‌ర్ ఫోర్ కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (స‌ఫార్‌) యాప్ ద్వారా ఎస్టిమేట్ చేయచ్చు. ఈ యాప్‌ని ఎర్త్ అండ్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ డెవ‌ల‌ప్ చేసింది.  భార‌త్‌లోని మెట్రో న‌గ‌రాల్లోని ఎయిర్ క్వాలిటీ ఫోర్ కాస్టింగ్ అంచ‌నా వేయ‌డానికి క‌నిపెట్టిన తొలి యాప్ ఇదే. ఇది ఇంగ్లిష్‌తో పాటు హిందీ, మ‌రాఠీ, గుజ‌రాతి భాష‌ల్లో ల‌భ్యం అవుతుంది. ప్లే స్టోర్‌లో ఉచితంగా దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

ఎయిర్ విజువ‌ల్ 
రియ‌ల్ టైమ్‌లో ఎయిర్ పొల్యుష‌న్‌ను ఎస్టిమేట్ చేయ‌డానికి ఎయిర్ విజువ‌ల్ యాప్ యూజ్ అవుతుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా 80 దేశాల్లోని 10 వేల న‌గ‌రాల్లో ఎయిర్ పొల్యుష‌న్ ప‌రిస్థితిని అంచ‌నా వేయ‌డానికి.. ఎలా కాలుష్యం నుంచి ర‌క్షించుకోవాలో తెల‌ప‌డానికి ఎయిర్ విజువ‌ల్ ప‌నికొస్తుంది. 

ఎయిర్ క్వాలిటీ
ఎయిర్ రిపోర్ట్ ఎప్ప‌టిక‌ప్పుడు తెలియ‌జేయ‌డానికి ఎయిర్ క్వాలిటీ యాప్ యూజ్ అవుతుంది. మీ ఏరియాలో పొల్యుష‌న్ లెవ‌ల్స్ తెలుసుకోవ‌డానికి ఇదో బెస్ట్ యాప్‌. గ్లోబ‌ల్ పొల్యుష‌న్ ట్రెండ్స్‌ని కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకోవ‌చ్చు. ఇది  24 గంట‌ల వ్య‌వ‌ధిలో గంట గంట‌ల‌కు పొల్యుష‌న్ ఎలా మారుతుందో మీకు తెలియ‌జేస్తుంది. మీరు ఏ టైమ్‌లో యాక్టివిటీ చేసుకోవాలో ఇది స‌జిష‌న్స్ ఇస్తుంది. 

స‌మీర్‌
స‌మీర్ అంటే సంస్కృతంలో గాలి అని అర్ధం. సెంట్ర‌ల్ పొల్యుష‌న్ కంట్రోల్ బోర్డు (సీపీసీబీ) ఈ స‌మీర్ యాప్‌ను రూపొందించింది. ఎయిర్ పొల్యుష‌న్‌ని మానిట‌ర్ చేయ‌డం కోసం ఈ యాప్ సాయం చేస్తుంది. ఎయిర్ క్వాలిటీ గురించి ప్ర‌తి గంట‌కు అప్‌డేట్స్ ఇస్తుంది.  మీ ఏరియాలో పొల్యుష‌న్ ఎక్కువ అయితే సీపీసీబీకి కంప్లైంట్ కూడా ఇవ్వొచ్చు. 

Delhi air pollution Top apps check air quality city