శాఖాహారుల‌ను పొర‌పాటుగా కూడా మాంసాహార‌ బారిన ప‌డ‌కుండా చేసే యాప్స్‌

ప్ర‌స్తుతం ల‌భ్య‌మ‌య్యే అన్ని ఆహార ప‌దార్థాల్లోనూ ర‌సాయ‌న మూల‌కాలు (కెమిక‌ల్ కాంపొనెంట్స్) ఉంటాయి. ఇవి దేని నుంచి త‌యారుచేశారనే విష‌యం చాలా మందికి తెలియ‌దు. ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌య‌మేంటంటే.. చాలా వ‌ర‌కూ ప‌దార్థాలు జంతువుల శ‌రీర భాగాల నుంచి, కీట‌కాలు, ఇత‌ర జీవుల నుంచి త‌యార‌వుతాయి. వీటికి ప్యాకెట్ల‌పై  భిన్న మైన కోడ్ ఇస్తుంటారు. మ‌రి శాఖాహారులు ఈ ప‌దార్థాలను గుర్తంచ‌డం ఎలా? అంటే ఇలా అంటున్నాయి యాప్స్‌! మీకు ఆ ప‌దార్థం కోడ్ తెలియ‌క‌పోయినా ఫ‌ర్వాలేదు. సింపుల్‌గా ఐట‌మ్ పేరును బ‌ట్టి అది శాఖాహార‌మా కాదా అని తెలుసుకోవ‌చ్చు. బార్‌కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు..అందులో ఏ ఏ ప‌దార్థాలు క‌లిశాయో చెప్పేస్తాయి. ఈ యాప్స్‌తో శాఖాహారుల‌కు మ‌రింత‌గా ఉప‌యోగ‌ప‌డ తాయ‌న‌డంలో సందేహం లేదు. మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం.. వెంట‌నే ఆ యాప్స్ ఏంటో తెలుసుకుందాం! 

Veganeamos
ఆహార ప‌దార్థం శాఖాహారమా కాదా అని తెలుసుకునేందుకు ఉప‌యోగ‌ప‌డే సింపుల్ ఆండ్రాయిడ్ యాప్ ఇది! దీనిని ఇన్‌స్టాల్ చేసుకుని.. ఓపెన్ చేస్తే నాలుగు ర‌కాల ఆప్ష‌న్స్ అందుబాటులో ఉంటాయి. బార్ కోడ్, సెర్చ్ వంటి ఆప్ష‌న్లు ఉంటాయి. బార్ కోడ్ స్కాన్ చేయ‌గానే.. వెంట‌నే డేటాబేస్‌లో ఆ ప‌దార్థానికి సంబంధించిన స‌మాచారాన్ని సేక‌రిస్తుంది. స్క్రీన్‌పై వివ‌రాలు చూపించ‌డంతో పాటు.. అది శాఖాహార‌మా లేక మాంసాహార‌మా అనే ఫ‌లితం కూడా చూపిస్తుంది. ఇందులోనూ ఐట‌మ్ పేరును బ‌ట్టి కూడా సెర్చ్ చేసే ఆప్ష‌న్ ఉంటుంది. 

Vegan Or Not?
ఈ యాప్‌ని ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకుని రిజిస్ట‌ర్ అవ్వాలి. త‌ర్వాత‌ లాగిన్ అవ్వాలి. ఇందులో మొద‌టి పేజీలో ఆహార ప‌దార్థం పేరు గానీ, దినుసుల పేరు గానీ టైప్ చేస్తే.. దాని గురించి స‌మాచారాన్ని డేటాబేస్‌లో వెతుకుతుంది. ఆ ప‌దం క‌నుక డేటాబేస్‌లో ల‌భిస్తే.. దానికి సంబంధించిన వివ‌రాలు వ‌స్తాయి. దాని మూలాల‌తో పాటు చూపుతుంది. పేజీ కింది భాగంలో ఇది పూర్తి శాఖాహారమా లేదా మాంసాహార‌మా అని స్క్రీన్‌పై చూపిస్తుంది. ఇది ప‌నిచేయాలంటే ఇంట‌ర్నెట్ క‌నెక్ష‌న్ త‌ప్ప‌నిస‌రి. 

Vegan Additives
ఈ యాప్‌లో కోడ్ నేమ్స్‌తో చాలా ఎడిటివ్ ప‌దాలు ఉంటాయి. ఈ ప‌దం ఎలా ఏర్ప‌డింది?  అందులో ఏదైనా జంతు సంబంధ ప‌దార్థాలు ఉంటే వాటిని కూడా చూపిస్తుంది.. ఇందులో మూడు ర‌కాల కేట‌గిరీలు ఉంటాయి. పూర్తి శాఖాహార‌మైతే.. అవి ఆకుప‌చ్చ రంగులోనూ,  మాంసాహార ప‌దార్థాలు ఎరుపు రంగులోనూ, అయితే అది పూర్తి శాఖాహార‌మా కాదా అనేది ఇంకా నిర్ధార‌ణ కాక‌పోతే ప‌సుపు రంగులో చూపెడుతుంది. ఏదైనా మూల‌కం పేరు గానీ, కోడ్‌ను గానీ, ఆ ప‌దాన్ని గానీ టైప్ చేస్తే.. క్ష‌ణాల్లోనే ఫ‌లితం వ‌స్తుంది.


 

non vegetarian vegetarian food chemicals bar code ingredients