స్పామ్ కాల్స్ నుంచి మొబైల్‌ను రక్షించుకునేందుకు రకరకాల యాప్స్ ఉపయోగిస్తూ ఉంటాం. గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే ఈ కాల్స్ చాలా చిరాకు తెప్పిస్తూ ఉంటాయి. ఎన్ని యాప్స్ వినియోగిస్తున్నా.. ఈ కాల్స్‌ని అడ్డుకోవడం కష్టమే! అలాగే వచ్చిన ప్రతి స్పామ్ కాల్‌ని బ్లాక్ చేయడం కూడా సాధ్యం కాని పని! ఈ నేపథ్యంలో స్పామ్ కాల్స్ నుంచి మనల్ని రక్షించేందుకు ఫోన్ యాప్‌ను గూగుల్ మరింత శక్తిమంతంగా రూపొందించింది. caller ID and spam protection ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీనివల్ల స్పామ్ కాల్ అనేదే ఫోన్ దరిచేరదని గూగుల్ స్పష్టంచేస్తోంది. స్పామ్ నంబర్లను గుర్తించి.. సాధారణ కాల్స్ నుంచి వేరుచేసి కాల్ హిస్టరీలో చూపిస్తుందని తెలిపింది.
ఎలా పనిచేస్తుందంటే..
అన్ని ఫోన్స్‌లోనూ డిఫాల్ట్‌గా కాలర్ ఐడీ, స్పామ్ ప్రొటక్షన్ డిజేబుల్ అయి ఉంటాయి. కానీ యూజర్లు ఆఫ్ డిజేబుల్ చేసుకోవాలి. దీనిని ఎనేబుల్ చేసుకునేందుకు.. Phone appని ఓపెన్ చేయాలి. ఇందులో కుడి వైపు ఉన్న మూడు చుక్కలపై ట్యాప్ చేయాలి. ఇందులో Settings > Caller ID & spam > On ఎంచుకోవాలి. ఇక నుంచి స్పామ్ నంబర్లను ఇది సులభంగా గుర్తిస్తుంది. వాటి నుంచి వచ్చే నోటిఫికేషన్లను అడ్డుకుంటుంది. ఒకవేళ ఆ నంబర్ల నుంచి కాల్స్ వస్తే ముందుగా హెచ్చరిస్తుంది. మార్ష్‌మాల్లో 6.0, అంతకంటే ఎక్కువ వెర్షన్ ఓఎస్‌లలోనే ఈ ఆప్షన్ పనిచేస్తుంది. ఈ caller ID and spam protection ఉపయోగించాలంటే.. ముందుగా గూగుల్‌కి మన కాల్స్‌కి సంబంధించిన సమాచారం యాక్సెస్ చేసేందుకు అనుమతి ఇవ్వాలి. స్పామ్ కాల్స్ రింగ్ అవ్వకుండా అడ్డుకునేందుకు కూడా కొత్త ఆప్షన్ ప్రవేశపెట్టింది. అదే Filter suspected spam calls. దీనిని ఎనేబుల్ చేసుకుంటే.. ఇక నుంచి మిస్స్‌డ్ కాల్స్ గానీ వాయిస్ మెయిల్స్ నోటిఫికేషన్స్ రావు. కానీ కాల్ హిస్టరీలో మాత్రం వీటిని చెక్ చేసుకునే అవకాశం ఉంది. వీటిని యూజర్లు స్పామ్ కాల్స్‌గా మార్క్ చేసుకోవచ్చు. దీని కోసం ఫోన్ యాప్ ఓపెన్ చేసి, రీసెంట్స్ ఆప్షన్‌లోకి వెళ్లి.. పక్కనే ఉన్న స్పామ్, బ్లాక్ ఆప్షన్లలో ఒకటి ఎంచుకుంటే సరిపోతుంది.
గూగà±à°²à± ఫోనౠయాపౠసà±à°ªà°¾à°‚ కాలà±à°¸à± à°ªà±à°°à±Šà°Ÿà±†à°•à±à°·à°¨à± spam calls google phone app feature