మనం ఏదైనా యాప్‌లు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మనల్ని పర్మిషన్లు అడుగడం కామన్ విషయం. మనం అన్ని యాప్‌లకు పర్మిషన్లు ఇచ్చేస్తుంటాం. దీని వలన మనకు తెలియకుండానే మనం ఇబ్బందుల్లో పడతాం. ఇలా పర్మిషన్లు ఇవ్వడం వల్ల మన ఫోన్, ఇన్ఫర్మేషన్ను మూడో వ్యక్తి చేతిలో పెట్టడమే అవుతుంది. ఇటీవల వచ్చిన ఫ్లాష్ లైట్ యాప్‌లు ఏకంగా 77 పర్మిషన్లు అడగడం ఆందోళన కలిగించే అంశం. మరి ఇలాంటి యాప్‌లు మనకు అవసరమా!
టార్చ్ కోసం
సాధారణంగా మన ఫోన్‌తో పాటే టార్చ్‌లైట్ వచ్చేస్తుంది. ఫోన్లో ఇది చాలా కీలకమైన టూల్. అయితే టార్చ్ లైట్ ఆప్షన్ ప్రత్యేకంగా ఇవ్వని వాళ్లు కొన్ని యాప్‌ల మీద ఆధారపడుతున్నారు. ఇందుకోసం ప్లే స్టోర్‌లో ఫ్లాష్ లైట్ అనే యాప్ ఒకటి ఉంది. ఇది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఏకంగా 25 పర్మిషన్లు అడుగుతుండడం గమనార్హం. ఇదొక్కటే కాదు ఇలాంటి చాలా ఫ్లాష్ లైట్ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ ఇలాగే లెక్కకు మించి పర్మిషన్లు అడుగుతుంటాయి. వీటిలో 408 యాప్‌లు 10 కంటే తక్కువ పర్మిషన్లు అడుగుతుంటే. 262 యాప్‌లు ఏకంగా 50 పైన పర్మిషన్లు కావాలంటున్నాయి.
పర్మిషన్లు తప్పనిసరా!
ఇటీవల అవాస్ట్ సెక్యూరిటీ సంస్థ జరిపిన ఒక పరిశోధనలో ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. నిజానికి ఒక టార్చ్‌లైట్ యాప్ కోసం ఇన్ని పర్మిషన్లు ఇవ్వాల్సిన అవసరం ఉందా అనే దానిపై కూడా పరిశోధించారు. అయితే ఇలా పర్మిషన్లు అడుగుతున్న 208 యాప్‌లలో దాదాపు ఒకే యాప్‌కు సంబంధించిన వెర్షన్లే ఉండడం అనుమానాలకు తావిస్తోంది.. ఫోన్లను హ్యాక్ చేయడానికి విలువైన సమాచారాన్ని గ్రహించడం కోసం ఇలా ఒకే యాప్‌ను డిఫరెంట్ వెర్షన్స్‌తో క్రియేట్ చేస్తున్నారని పరిశోధకులు భావిస్తున్నారు. అందుకే యాప్‌లకు ఇన్ని పర్మిషన్లు ఇచ్చే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని.. అత్యవసరం అయితేనే ఇలాంటి యాప్‌లను ఇన్స్టాల్ చేయాలని చెబుతున్నారు.
Flashlight apps on Android ask for up to 77 permissions and it is alarming: Here’s why