విండోస్‌లో మాయ‌మైన ఏడు ఫీచ‌ర్ల‌ను వాప‌స్ తెచ్చుకోండిలా..

విండోస్‌.. కంప్యూట‌ర్ వాడేవాళ్ల‌కు ప‌రిచ‌యం చేయక్క‌ర్లేదు. ప్ర‌పంచం వ్యాప్తంగా ఎక్కువ‌మంది వాడే ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్టు, కాలానికి అనుగుణంగామార్పులు చేర్పులకు గుర‌వుతూ వ‌చ్చింది. విండోస్ నుంచి మొద‌లు పెట్టి ఇప్పుడు విండోస్ 10 వ‌ర‌కు నిరంటాకంగా సాగుతోంది ఈ దిగ్గ‌జ సంస్థ ప్ర‌యాణం. అయితే విండోస్ ఓఎస్ మారుతున్న కొద్దీ  మ‌నం కొన్ని ఫీచ‌ర్ల‌ను కోల్పోవాల్సి వ‌స్తుంది. అయితే వాటిలో కొన్ని ఫీచ‌ర్లు మ‌న‌కు ఎంతో అవ‌స‌రం.. ఇష్టం కూడా. అలాంటి కీల‌క‌మైన ఫీచ‌ర్ల‌న వెనక్కి తీసుకు రావ‌డం ఎలా? మ‌ళ్లీ వాటిని ఉప‌యోగించ‌డం ఎలా?

విండోస్ మీడియా సెంట‌ర్‌
విండోస్ మీడియా ప్లేయ‌ర్‌.. మైక్రోసాఫ్ట్ బేసిక్ ఆడియో, వీడియో ప్లేయ‌ర్ అన్న విష‌యం అంద‌రికి తెలిసిందే. విండోస్ 10లోనూ ఈ ఫీచ‌ర్ కొన‌సాగింది. అయితే మీడియా సెంట‌ర్ మాత్రం మిస్ అయింది.  విండోస్ 8లో ఈ ఫీచ‌ర్ ఉన్నా.. 10 వెర్ష‌న్‌కు వ‌చ్చేస‌రికి ఈ ఫీచ‌ర్‌ను ప‌క్క‌న‌పెట్టేశారు. అయితే ఈ మీడియా సెంట‌ర్ విష‌యంలో ఆనందం క‌లిగించే వార్త ఏంటంటే.. అన్ అఫీషియల్ వెర్ష‌న్‌ను మ‌నం డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ఇలా డౌన్‌లోడ్ చేసుకున్న మీడియో సెంట‌ర్‌.. ఒరిజిన‌ల్‌లాగే ప‌ని చేస్తుంది. 

డెస్క్‌టాప్ గాడ్జెట్స్‌
మీరు డెస్క్‌టాప్ గాడ్జెట్స్ చాలా హెల్ప్ చేస్తాయి. అంటే కాలిక్యులేట‌ర్‌, వెద‌ర్ రిపోర్ట్ లాంటివి. మీకు ఇవి చాలా హాండిగా ఉంటాయి. అయితే విండోస్ 10లో మీకు ఇవేమి క‌నిపించ‌వు. ఒక‌ర‌కంగా నిరాశ క‌లిగించే విష‌య‌మిది. సెక్యూరిటీ రిజ‌న్స్ కార‌ణంగా విండోస్ ఈ గాడ్జెట్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేయ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించింది. అయితే వీటిని మీరు మ‌ళ్లీ డెస్క్‌టాప్ మీద‌కు తెచ్చ‌కోవ‌చ్చు కానీ కొంచెం రిస్క్‌. దీనికి రైన్‌మీట‌ర్ అనే టూల్ ఉప‌యోగ‌ప‌డుతుంది.  కాలిక్యులేట‌ర్‌తో పాటు లైవ్ వాల్‌పేప‌ర్లు ఇత‌ర గ్యాడ్జెట్లు కూడా మీరు  వెన‌క్కి తెచ్చుకోవ‌చ్చు. 

ఫైల్ ఎక్స్‌ప్లోర‌ర్ లైబ్ర‌రీస్‌
విండోస్ 7 ద్వారానే లైబ్ర‌రీస్ అనే ఫీచ‌ర్ వెలుగులోకి వ‌చ్చింది. మీ ఫైల్స్‌ను మేనేజ్ చేయ‌డానికి ఈ ఫీచ‌ర్ ఉప‌యోగ‌ప‌డేది. విండోస్ 8,10 వెర్ష‌న్ల‌లో ఈ ఫీచ‌ర్‌ను తీసేశారు.  తీసేసినా మీరు ఈ ఫీచ‌ర్ వాడుకోవ‌చ్చు. ఫైల్ ఎక్స్‌ప్లోర‌ర్ విండో ఓపెన్ చేసి.. లెఫ్ట్ షార్ట్ క‌ట్ పాన్ మీద ఎక్క‌డైనా రైట్ క్లిక్ చేయాలి. ఆ త‌ర్వాత షో లైబ్ర‌రీస్ అనే ఆప్ష‌న్ క్లిక్ చేస్తే.. లైబ్ర‌రీ హెడ‌ర్ క‌నిపిస్తుంది. దాని మీద డ‌బుల్ క్లిక్ చేస్తే.. మీ డిఫాల్ట్ డాక్యుమెంట్లు, పిక్చ‌ర్స్ క‌నిపిస్తాయి. 

క్లాసిక్ విండోస్ 95/98 థీమ్‌,స్టార్ట్ మెనూ
చాలామందికి పాత విండోస్‌ను వాడాల‌నే కోరిక ఉంటుంది. 95లో ఉండే విండోస్‌ను వాడినవాళ్లు ఇప్పుడు మ‌ళ్లీ వెన‌క్కి వెళ్ల‌లేరు. కానీ టెక్నాల‌జీకి సాధ్యం కానిది లేదు. క్లాసిక్ విండోస్ 95/98 థీమ్‌ల‌తో పాటు స్టార్ట్ మెనూల‌ను వాడుకునే అవ‌కాశం మీకుంది.  డైవియ‌న్ఆర్ట్‌పేజీలోకి వెళ్లి డౌన్‌లోడ్ లింక్‌ క్లిక్ చేయాలి.  ఆ త‌ర్వాత రైట్ సైడ్ క్లిక్ చేసి క్లాసిక్ థీమ్‌ను గ్రాబ్ చేయాలి. దీన్ని మీ కంప్యూట‌ర్లో ఎక్క‌డైనా సేవ్ చేసుకుంటే చాలు.  ఆ త‌ర్వాత సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఈజ్ ఆఫ్ యాక్సిస్‌, హై కాంట్రాస్ట్‌ను సెల‌క్ట్ చేసుకోవాలి. ఆ త‌ర్వాత అప్లే అంటే చాలు ఆనాటి రోజుల‌కు వెళ్లిపోతారు. 

యాడ్ ఫ్రీ గేమ్స్‌
విండోస్‌లో చాలా గేమ్‌లు ఆడేవాళ్లం ఒక‌ప్పుడు. కానీ ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింది దీనిలో గేమ్‌ల‌నేవీ క‌నిపించ‌డం లేదు. దీనికి కార‌ణం సెక్యూరిటీ రిజ‌న్స్. అయితే మ‌నం పాత గేమ్‌ల‌ను ఆడుకునే అవ‌కాశం ఇప్పుడు కూడా ఉంది.  అది కూడా యాడ్స్ లేకుండా! సోలిటైర్‌, మైన్స్‌వీప‌ర్ లాంటి గేమ్స్‌ను ఇప్పుడు కూడా వాడుకోవ‌చ్చు. గూగుల్ సెర్చ్ బాక్స్‌లో సొలిటైర్ అని టైప్ చేసి యాక్సిస్ ది గేమ్ ఆప్ష‌న్‌ను క్లిక్ చేయాలి. 

ఎయిరో గ్లాస్ థీమ్‌
విండోస్ 7లో మీకు ఎయిరో గ్లాస్ థీమ్ ఆకర్ష‌ణీయంగా ఉండేది. కానీ విండోస్ 10లో ఇది మిస్ అయింది. విండోస్ 8 నుంచే ఎయిరో ఆప్ష‌న్ క‌నిపించ‌డం లేదు. దీనికి బ‌దులు ప్ల‌యిన్ క‌ల‌ర్ బార్స్ మాత్ర‌మే అందుబాటులో ఉంటున్నాయి. అయితే సెట్టింగ్స్‌లో కొన్ని ఛేంజ‌స్ ద్వారా తిరిగి ఈ ఎయిరో గ్లాస్ థీమ్‌న తెచ్చుకోవ‌చ్చు. 

గ్రూప్ పాల‌సీ ఎడిట‌ర్‌
విండోస్ 7లో ఉంది.. విండోస్ 10లో లేనిది గ్రూప్ పాల‌సీ ఎడిట‌ర్‌. విండోస్ లాక్ డౌన్ చేయ‌డం, చైల్డ్ అకౌంట్ లాంటి యునిక్ ఫీచ‌ర్లు ఉన్నాయి.  అంతేకాదు అన్ని టిప్స్ షేర్ చేసుకునే అవ‌కాశం ఉండేది. కానీ విండోస్ 10లో ఈ అవ‌కాశం లేదు. అయితే విండోస్ 10లో  స్టార్ట్ మెనుకు వెళ్లి అబౌట్ యువ‌ర్ పీసీ క్లిక్ చేసి గ్రూప్ పాల‌సీ ఎడిట‌ర్‌ను తెచ్చుకోవ‌చ్చు. ఎంఎస్ పెయింట్‌ది కూడా ఇదే ప‌రిస్థితి.

Windows Features Bring Back Windows Media Center Desktop Gadgets File Explorer Libraries గ్రూప్ పాల‌సీ ఎడిట‌ర్‌ ఎయిరో గ్లాస్ థీమ్‌ సోలిటైర్‌ మైన్స్‌వీప‌ర్ Windows 7 Windows 10