బై నౌ.. పే లేట‌ర్ ఇప్పుడు ఎవ‌రెవ‌రో ఆఫ‌ర్ చేస్తున్నారో తెలుసా? 

 బై నౌ.. పే లేట‌ర్ (Buy now, pay later). ఆన్‌లైన్ బిజినెస్‌లో ఇది ఇప్పుడు  కొత్త  ట్రెండ్‌. ప్రొడ‌క్ట్ కొనుక్కోవ‌డం.. డబ్బులు త‌ర్వాత చెల్లించ‌డం అనే ఈ కాన్సెప్ట్ రోజురోజుకూ పెరుగుతోంది. బ‌స్‌, రైల్‌, సినిమా టికెట్ల ద‌గ్గ‌ర మొద‌లైన ఈ ట్రెండ్ ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ వంటి ఈ- కామ‌ర్స్ సైట్ల‌లో వ‌స్తువుల కొనుగోలు వ‌ర‌కు పాకింది. బై నౌ.. పే లేట‌ర్ స‌ర్వీసులు ఆఫ‌ర్ చేస్తున్న సంస్థ‌ల గురించి తెలుసుకోవాలంటే ఇది చ‌దవండి  

ఏంటీ కాన్సెప్ట్ 
ఏదైనా ప్రొడ‌క్ట్ కొనాల‌న్నా లేదా స‌ర్వీస్  వాడుకోవాల‌న్నా ఇప్పుడు తీసుకుని త‌ర్వాత పే చేయ‌డం అనేది ఇందులో కాన్సెప్ట్‌.  దీనివ‌ల్ల డ‌బ్బులు లేవ‌ని ప్రొడ‌క్ట్ కొన‌డం లేదా స‌ర్వీస్ తీసుకోవ‌డం ఆపేయ‌క్క‌ర్లేదు. సాధారణంగా బిల్ పే చేయ‌డానికి 15 రోజుల టైం ఉంటుంది.  కాబట్టి ముఖ్యంగా శాల‌రీడ్ పీపుల్ దీన్ని బాగా వాడే అవ‌కాశం ఉంది.  క్రెడిట్ కార్డులు చేసేది కూడా ఇదే. కానీ ఇందులో లోన్ ఇచ్చే అమౌంట్ 
త‌క్కువ‌గా (బాగా అంటే వేల రూపాయ‌ల్లోపే ) ఉంటుంది. 

పెద్ద కంపెనీలూ కాంపిటీష‌న్‌లోకి..
ఇప్పుడు ఇండియాలో పెద్ద క‌న్స్యూమ‌ర్ బ్రాండ్స్ కూడా పే లేట‌ర్ బిజినెస్‌లోకి వ‌చ్చేశాయి. 
Flipkart Pay Later:  ఈ- కామ‌ర్స్ జెయింట్ ఫ్లిప్ కార్ట్ కూడా రెండు నెల‌ల క్రితం Flipkart Pay Later పేరుతో ఈ ఫెసిలిటీని తీసుకొచ్చింది. ఐట‌మ్ కొని మ‌నీ పే చేయ‌డానికి  చెక్ అవుట్  చేసే ద‌గ్గ‌ర పే లేట‌ర్ ఆప్ష‌న్‌ను సెలెక్ట్ చేయాలి. మీరు ప్రొడ‌క్ట్ రిసీవ్ చేసుకున్నాక  పే లేట‌ర్ ఇచ్చిన డేట్ లోగా బిల్లు చెల్లిస్తే చాలు. 
Ola Credit: క‌్యాబ్ స‌ర్వీసులు అందించే ఓలా కూడా పే లేట‌ర్ సిస్టం తీసుకొచ్చింది. దీని పేరు  Ola Credit. ఓలా లాయ‌ల్ క‌స్ట‌మ‌ర్ల‌కే ఈ ఫీచ‌ర్‌ను ప్ర‌స్తుతం ఆఫ‌ర్ చేస్తోంది. దీనిలో వారంలోగా బిల్ చెల్లించాలి.  క్రెడిట్ లిమిట్ యూజ‌ర్ యూసేజ్‌, రీపేమెంట్ హిస్ట‌రీని బ‌ట్టి పెంచుతారు. 
 BookMyShow :  సినిమా టికెట్స్ బుకింగ్ కోసం బుక్ మై షో కూడా  Simplతో క‌లిసి పే లేట‌ర్ సౌక‌ర్యాన్ని తీసుకొచ్చింది.  ఫుడ్ డెలివ‌రీ యాప్  Faasosలో కూడా Simplతో పే లేట‌ర్ ఆప్ష‌న్ వినియోగించుకోవ‌చ్చు. మ‌రో ఫుడ్ డెలివ‌రీ యాప్ Zomato కూడా LazyPay  ద్వారా  ఈఫెసిలిటీని తీసుకొచ్చింది. 
ఉప‌యోగాలేంటి?
* స‌మయానికి చేతిలో డబ్బులేకున్నా ప్రొడ‌క్ట్ కొనుక్కోవ‌చ్చు. 
* మ‌న ద‌గ్గ‌రున్న మ‌నీ ఉన్నా 10 నుంచి 15 రోజుల పాటు వాటిని వేరే అవ‌స‌రాల‌కు వాడుకోవ‌డానికి ప‌నికొస్తుంది. 
* క్రెడిట్ కార్డ్‌తో కూడా కొనుక్కునే సౌక‌ర్యం ఉన్నా  బిల్ డేట్‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్న‌ప్పుడు ఈ ఆప్ష‌న్ వాడుకుంటే 15 రోజుల త‌ర్వాత బిల్ కట్టొచ్చు కాబ‌ట్టి అంత అమౌంట్‌కు వ‌చ్చే బిల్ సైకిల్ వ‌ర‌కు మ‌నకు టైం దొరుకుతుంది. 
* ఆన్‌లైన్లో ఏదైనా వ‌స్తువు కొని న‌చ్చ‌క రిట‌ర్న్ చేస్తే ఆ అమౌంట్ తిరిగి రావ‌డానికి వారం 10 రోజులు ప‌డుతుంది. పే లేట‌ర్‌తో అయితే వ‌ద్ద‌ని రిట‌ర్న్ చేస్తే బిల్ కట్టే టైమ్‌కు ఆ అమౌంట్ తిరిగొస్తుంది కాబ‌ట్టి బిల్ క‌ట్టాల్సిన ప‌ని లేదనే అనాలిసిస్ కూడా ఉంది. 

బై నౌ పే లేట‌ర్‌ ఆన్‌లైన్ ప‌ర్చేజ్‌  ఫ్లిప్‌కార్ట్ పే లేట‌ర్‌ సింప‌ల్‌ లేజీ పే పే లేట‌ర్‌ Buy now pay later Flipkart Pay Later Ola Credit Simpl LazyPayÂ