ఎలాంటి బ్రాండ్ నేమ్ లేకుండా రిలీజయిన ఎసెన్షియల్ ఫోన్ అంచనాలు అందుకుందా? ఆండ్రాయిడ్ సృష్టికర్త తయారు చేసిన ఈ ఫోన్ మిగిలిన ఫ్లాగ్‌షిప్ ఫోన్లన్నింటినీ ఓవర్‌టేక్ చేస్తుందా? Essential PH-1 అని అఫీషియల్‌గా పేరు పెట్టిన ఎసెన్షియల్ ఫోన్‌లో ప్లస్‌లేంటి? మైనస్‌లేంటి చూడండి.
కెమెరా
13 మెగాపిక్సెల్ కెమెరాలున్నాయి. ఇందులో ఒకటి కలర్‌తోపాటు బ్లాక్ అండ్ వైట్‌లో కూడా ఫోటోస్ క్యాప్చర్ చేసుకునే క్యాపబులిటీతో వచ్చింది. రెండోది మోనోక్రోమ్‌లో ఇమేజెస్ కోసం. మోనోక్రోమ్ లెన్స్‌తో మంచి ఫొటోస్ వస్తున్నాయి. కాంట్రాస్ట్ కూడా బాగుంది. లో లైటింగ్‌లో కూడా క్వాలిటీ ఇమేజెస్ వస్తున్నాయి. అయితే కెమెరా మాడ్యూల్ సైజ్ తగ్గిస్తే బాగుంటుంది.
డిజైన్
5.7 ఇంచెస్ డిస్‌ప్లేతో స్క్రీన్ తీసుకొచ్చింది. అయినా ఫోన్ బాగా పెద్దగా అనిపిచండం లేదు. బీజిల్ రిడక్షన్ తో స్క్రీన్ మరింత పెద్దగా అనిపిస్తుంది. సెల్ఫీ కెమెరా, సెన్సర్ల కోసం పైన ఒక స్పిల్ ఓవర్‌లా ఇచ్చారు. టైటానియం ఫ్రేమ్‌తో ఇచ్చారు. అల్యూమినియం ఫ్రేమ్‌తో వచ్చే ఫోన్ల కంటే దీని డ్యూరబులిటీ బాగుంటుంది. అల్ట్రా గ్లాసీ సిరామిక్ ఎక్స్ టీరియర్‌తో ఫోన్ చూడడానికి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అయితే ఈజీగా మరకలు, గీతలు పడుతోంది. ఎడ్జెస్ గ్రిప్పీ మెటీరియల్‌తో ఉండడంతో ఫోన్ జారిపోకుండా ఉంటుంది.
పెర్‌ఫార్మెన్స్
పెర్‌ఫార్మెన్స్ విషయంలో సాలిడ్ అని చెప్పొచ్చు. Snapdragon 835 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్‌తో ఫాస్ట్ అండ్ పర్‌ఫెక్ట్‌గా పని చేస్తుంది. అయితే OLED స్క్రీన్ లేకపోవడంతో వీఆర్ లో చూసేటప్పడు అంత అనుభూతి చెందలేం. ఆండ్రాయిట్ నూగట్ ఓఎస్ తో వచ్చిన ఈ ఫోన్‌కు త్వరలోనే ఓరియో అప్డేట్ రాబోతోంది.
బ్యాటరీ
3,040 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఫుల్ ఛార్జింగ్ పెడితే ఎంత హెవీగా వాడినా ఒకరోజు అంతా పని చేస్తుంది. ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఈ సెగ్మెంట్‌లోని మిగతా ఫోన్లన్నింటి కంటే స్పీడ్‌గా ఛార్జ్ అవుతోంది.
ప్లస్‌పాయింట్స్
* స్ట్రైకింగ్ డిజైన్,
* ఆండ్రాయిడ్ యూజర్ల కోసం గ్రేట్ ఫీచర్స్
* లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఓఎస్
* కెమెరా పెర్‌ఫార్మెన్స్
* బ్యాటరీ లైఫ్, ఫాస్ట్ ఛార్జింగ్
మైనస్ పాయింట్స్
* యాక్సెసరీస్ అందుబాటులోకి రాలేదు. దీంతో యాక్సెసరీ పోర్ట్‌కు ఉపయోగం లేకుండా పోతోంది.
* మిగతా ఫ్లాగ్‌షిప్ ఫోన్లతో పోల్చితే కాస్ట్ ఎక్కువ.
* గ్లాసీ బాక్ సర్ఫేస్.. అప్పీల్‌ను తగ్గిస్తుంది.
మొత్తంగా చెప్పాలంటే 45 వేల రూపాయల ఖరీదు కాస్త ఎక్కువే అయినా మిగతా ఆండ్రాయిడ్ ఫోన్ల కంటే కాస్త డిఫరెంట్‌గా కనిపిస్తుంది. పెర్‌ఫార్మెన్స్,లుక్ పరంగా చూస్తే మంచి ఫోనే.
Essential PH-1 Essential Phone Review ఎసెనà±à°·à°¿à°¯â€Œà°²à±â€Œ ఆండà±à°°à°¾à°¯à°¿à°¡à± à°¸à±à°®à°¾à°°à±à°Ÿà±â€Œà°«à±‹à°¨à±â€Œ Â