ఆండ్రాయిడ్‌లో ఫాస్టెస్ట్ ఫోన్లేవి?

స్మార్ట్‌ ఫోన్ వేగ‌వంత‌మైన ప‌నితీరుకు అందులోని కెమెరా లేదా డిస్‌ప్లే లేదా మ‌రొక‌టో కొల‌బద్ద కాదు. మ‌న అనుభ‌వంలో అదెంత చురుగ్గా ప‌నిచేస్తుంద‌న్న అంశమే దాని సామ‌ర్థ్యాన్ని, వేగాన్ని నిర్ణ‌యిస్తుంది. త‌ద‌నుగుణంగా ఈ ఏడాది సెప్టెంబ‌రుకుగాను అత్యుత్త‌మ ప‌నితీరు క‌న‌బ‌ర‌చిన స్మార్ట్‌ ఫోన్ల జాబితాను సాఫ్ట్‌వేర్ నాణ్య‌త ప్ర‌మాణాలను అధ్య‌య‌నం చేసే చైనీస్ సంస్థ‌  ‘అంతూతూ’ (AnTuTu) ఇటీవ‌ల విడుద‌ల చేసింది. ఓ మంచి చిప్‌సెట్‌, అది అందుకునే వేగం, కీల‌క విధులు, GPU, ప్రాసెసింగ్ శ‌క్తి ఇవ‌న్నీ క‌లిస్తేనే మ‌న‌కు స్మార్ట్‌ఫోన్‌ సామ‌ర్థ్యం నిరంత‌ర అనుభ‌వంగా మారుతుంద‌న్న మాట‌! ఈ నేప‌థ్యంలో ఎక్కువ సంఖ్య‌లో కీల‌క విధుల నిర్వ‌హ‌ణ‌, ఉన్న‌త‌స్థాయి వేగం విషయంలో Snapdragon 845 చిప్‌సెట్ అగ్ర‌స్థానంలో ఉంది. ఆ మేర‌కు ‘అంతూతూ’ ప్ర‌క‌టించిన‌ ఆండ్రాయిడ్‌తో న‌డిచే అత్యుత్త‌మ‌మైన స్మార్ట్ ఫోన్ల జాబితాను మీరే చూడండి:-
ASUS ROG
ఆసుస్ నుంచి వ‌చ్చిన గేమింగ్ దిగ్గ‌జం ROG Phone ఈ జాబితాలో అగ్ర‌స్థానంలో ఉంది. ఈ ఫోన్‌లోని Qualcomm Snapdragon 845 ఆధారిత సీపీయూ Clock speedsలో 2.96 GHzదాకా అత్యున్న‌త స్థాయికి చేరుకుంది. త‌ద్వారా ప్ర‌పంచంలోని ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల‌లో అత్యంత వేగ‌వంత‌మైన‌దిగా నిలిచింది.
XIAOMI BLACK SHARK
అత్యాధునిక Snapdragon 845, ప్ర‌త్యేక కూలింగ్ టెక్నాల‌జీతో వ‌చ్చిన Xiaomi Black Shark రెండో స్థానం పొందింది. మెమొరీకి సంబంధించి ఎంత భారీ టాస్క్ అప్ప‌గించినా లేదా స్మార్ట్ ఫోన్‌పై ఎంత‌టి హై-ఎండ్ గేమ్‌ ఆడే ఎలాంటి నేప‌థ్యంలోనైనా ఇది అత్యంత ప‌దునుగా ప‌నిచేసింది.
ONEPLUS 6
నేడు మార్కెట్‌లోని స్మార్ట్‌ ఫోన్లతో పోలిస్తే అత్యుత్త‌మ‌మైన‌దిగా OnePlus సంస్థ‌ ప్ర‌తిష్ఠాత్మ‌క ఉత్ప‌త్తి ONEPLUS 6ను ప‌రిగ‌ణించ‌వ‌చ్చు. త్వ‌ర‌లోనే  OnePlus 6T రాబోతున్న‌ప్ప‌టికీ అంత‌ర్జాతీయ స్థాయిలో OnePlus 6 స్థానానికి ఎలాంటి ఢోకా ఉండ‌దు. ఇందులోని సాఫ్ట్‌వేర్ గ‌రిష్ఠ స్థాయిలో ప‌నిచేయ‌గ‌లిగేలా హార్డ్‌వేర్‌ను Oxygen OS వేగంగా న‌డిపిస్తుంది.
VIVO NEX S
స్మార్ట్‌ ఫోన్ల వేగం, వినియోగ‌దారుల అనుభ‌వానికి సంబంధించి ఈ బెజెల్‌-లెస్ Vivo NEX S ఎన‌లేని సంతృప్తినివ్వ‌గ‌ల‌దు. ఈ కేట‌గిరీలో తొట్ట‌తొలి ఫోన్ ఇదే... డిస్‌ప్లే నాచ్ లేదా ఎలాంటి అద‌న‌పు iteration ఉండ‌వు. ఇత‌ర ప్ర‌తిష్ఠాత్మ‌క ఫోన్‌్తో పోలిస్తే ఇందులోని Snapdragon 845, ఇత‌ర సాఫ్ట్‌వేర్ గ‌రిష్ఠ వినియోగ సామ‌ర్థ్యం వినియోగదారుల‌కు మెరుగైన అనుభ‌వాన్నిస్తాయి.
XIAOMI MI 8
సంస్థ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా ఇటీవ‌లే ఆవిష్కృత‌మైన ప్ర‌తిష్ఠాత్మ‌క Xiaomi Mi 8 ఆ స‌మ‌యంలో చాలా సంచ‌ల‌నం సృష్టించింది. దీంతో కేవ‌లం 18 రోజుల్లోనే 10 ల‌క్ష‌ల స్మార్ట్‌ ఫోన్లు అమ్ముడ‌య్యాయి. కెమెరా నుంచి డిస్‌ప్లే, ప్రాసెస‌ర్‌దాకా Mi 8 అద్భుతంగా ప‌నిచేస్తుంది. ఇందులోని MIUI 10 తోడ్పాటువ‌ల్ల కీల‌క విధుల్లో వినియోగ‌దారుల‌కు మంచి అనుభ‌వాన్ని ఇవ్వ‌గ‌లిగింది.
OPPO FIND X
బెజెల్-లెస్ దిగ్గ‌జాల్లో Oppo Find X కూడా ఒక‌టిగా వార్త‌ల్లోకెక్కింది. స్క్రీన్‌, బాడీ నిష్ప‌త్తి అత్య‌ధికంగా 93.8 శాతం కావ‌డం అత్యంత ప్ర‌త్యేకం. ఎంతో అందంగా ఉండ‌టం, మంచి కెమెరాలతో రావ‌డ‌మేగాక వేగంగా ప‌నిచేసే SD 845 కూడా ఈ స్మార్ట్‌ ఫోన్‌కు గేమింగ్‌, మ‌ల్టీ టాస్కింగ్ సామ‌ర్థ్యాన్నిచ్చాయి.
SAMSUNG GALAXY NOTE 9
పలుచ‌ని రూపం, చ‌క్క‌ని ఫీచ‌ర్ల‌తో ఇటీవ‌లే విడుద‌లైంది Galaxy Note 9. ఇందులోని భారీ విధి నిర్వ‌హ‌ణ సామ‌ర్థ్యం, సాఫ్ట్‌వేర్ క‌ల‌గ‌ల‌సి వినియోగ‌దారుల‌కు అద్భుత‌మైన అనుభ‌వాన్నిస్తున్నాయి. అందుకే గ‌రిష్ఠ‌ స్థాయిని అందుకోగ‌ల ప్ర‌పంచంలోని స్మార్ట్‌ఫోన్ల‌లో Note 9 ఒక‌టిగా నిలిచింది.
ASUS ZENPHONE 5Z
ఆసుస్ ప్ర‌తిష్ఠాత్మ‌క ఎంట్రీ లెవ‌ల్ స్మార్ట్ ఫోన్ల‌లో రూ.30వేల లోపు ధ‌ర‌కు ల‌భించే అద్భుత‌మైన ఫోన్ Asus Zenfone 5Z. సంప్ర‌దాయ‌క ఆండ్రాయిడ్, హార్డ్‌ వేర్‌ అత్య‌ద్భుత వేగం అందుకోగ‌లిగేలా ప‌నిచేయ‌డం ఇందులోని ప్ర‌త్యేక‌త‌.
MI MIX 2S
అత్యుత్త‌మ Snapdragon 845తోపాటు ఇందులోని సాఫ్ట్‌వేర్ కూడా ఈ బెజెల్‌-లెస్‌ Mi MIX 2S స్మార్ట్‌ ఫోన్‌ను అగ్ర‌స్థానంలో నిల‌బెట్టాయి. ఇది Mi MIX 2కు అప్‌గ్రేడ్‌గా వ‌చ్చినా వినియోగ‌దారుల‌కు ఉల్లాస‌క‌ర అనుభ‌వాన్నిస్తోంది. ఆ మేర‌కు Mi MIX 2S గేమింగ్‌, మ‌ల్టీ టాస్కింగ్‌లో అల‌వోక‌గా విధులు నిర్వ‌ర్తిస్తుంది.
XIAOMI POCO F1
ఈ జాబితాలోని స్మార్ట్‌ఫోన్ల‌లో అత్యంత చ‌వ‌కైన ఫోన్ Xiaomi Poco F1. గేమింగ్‌, మ‌ల్టీ టాస్కింగ్‌కు సంబంధించి ఇది అనుప‌మాన అనుభవాన్నిస్తుంది. ఎంత సంక్లిష్ట వినియోగ ప‌రిస్థితిలోనైనా ప్ర‌త్యేక లిక్విడ్ కూలింగ్ టెక్నాల‌జీ సాయంతో ఇది మ‌రింత మెరుగ్గా, వేగంగా ప‌నిచేయ‌గ‌లుగుతుంది.

Smartphone Android Fastest Top ten