యూజర్లు తాము చేయాల్సిన పనుల లిస్ట్ తయారుచేసుకోవడానికి, జీమెయిల్‌తో దాన్ని ఇంటిగ్రేట్ చేసుకోవడానికి, మిగతా గూగుల్ యాప్స్‌తో లింకప్ చేసుకోవడానికి వీలుగా గూగుల్ టాస్క్స్ అనే కొత్త యాప్‌ను గూగుల్ లాంచ్‌చేసింది. షెడ్యూలింగ్ యాప్స్‌లో ఉన్న ఇబ్బందులన్నీ ఈ కొత్త యాప్ తీరుస్తుందని గూగుల్ చెబుతోంది. గూగుల్ చెబుతున్నట్లు ఇదంతా నిజమేనా? హైపా? షెడ్యూలింగ్‌లో పాత సమస్యలు అలాగే ఉన్నాయా? తెలుసుకోండి.
నిజంగా చెప్పాలంటే జీమెయిల్‌లో ఇన్‌బిల్ట్ ఫీచర్‌గా ఎప్పటి నుంచో ఉన్న టాస్క్స్ ఫీచర్‌ను కొత్త లుక్‌తో తీసుకొచ్చిందే ఈ టాస్క్స్ యాప్. అయితే ఇందులో ఇంటర్ ఫేస్ క్లీన్‌గా ఉంటుంది. క్రిస్ప్‌గా పనిచేస్తుంది అని గూగుల్ చెబుతోంది. అంతేకాదు మీ షెడ్యూలింగ్స్ అన్నింటికీ ఈ యాప్ సెంట్రల్ హబ్‌గా ఉంటుందంటోంది.
ప్లస్‌పాయింట్స్
* డిజైన్ బాగుంది. స్లైడింగ్ మెనూస్ పెంచారు.
* జీమెయిల్‌తో ఇంటిగ్రేషన్ దీనిలో చాలా పెద్ద ప్లస్‌పాయింట్. మీ మెయిల్‌కు వచ్చిన మెయిల్స్‌లో చేయాల్సిన పనులేమన్నా ఉంటే ఆ మెయిల్‌ను యాప్‌లోకి డ్రాగ్ చేసి దాన్ని టూ డూ లిస్ట్‌గా మార్చుకోవచ్చు. అప్‌డేటెడ్ జీమెయిల్ వెబ్‌వెర్షన్‌లో టాస్క్స్‌ను స్లైడ్‌బార్‌గా పెట్టారు. దీన్ని ఎప్పుడైనా వాడుకోవచ్చు. మీ మెయిల్స్‌ను అందులోకి లాక్కుని టూ డూ లిస్ట్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు.
* టూ డూ లిస్ట్‌లో ఉన్న బేసిక్ ఫీచర్లన్నీ టాస్క్స్ యాప్‌లో ఉన్నాయి. మల్టిపుల్ లిస్ట్‌లు క్రియేట్ చేసుకోవచ్చు. మీరు చేయాల్సిన పనికి డేట్స్‌ను పెట్టుకోవచ్చు. టాస్క్స్‌కు కావాలంటే అదనంగా నోట్స్ యాడ్ చేసుకోవచ్చు.
* ఒక పేరెంట్ టాస్క్ కింద దానికి రిలేటెడ్‌గా ఉంటే సబ్ టాస్క్‌లను కూడా రాసుకోవచ్చు.
* ఈ టాస్క్స్ యాప్ చాలా స్పీడ్‌గా పని చేస్తుంది. నావిగేషన్‌లో కానీ,మెనూస్, అకౌంట్స్‌ను డెస్క్‌టాప్ సైట్ నుంచి మొబైల్ యాప్స్‌కు సింక్ చేసుకోవడంలోగానీ సూపర్ ఫాస్ట్‌గా పనిచేస్తుంది.
మైనస్‌లేంటి?
అయితే ఇవన్నీ బేసిక్ ఫీచర్లే. మైనస్ పాయింట్స్ కూడా చాలా ఉన్నాయి.
* టాస్క్‌లకు డేట్ పెట్టుకోవచ్చు. కానీ ఒక స్పెసిఫిక్ టైమ్ పెట్టుకోలేం. కాబట్టి పక్కాగా ఆ టైమ్‌కే రిమైండ్ చేసే అవకాశం ఈ యాప్లో లేదు.
* మనం చేయాల్సిన పనిని టూ డూ లిస్ట్‌లో పెట్టుకోవచ్చు. కానీ దాని ప్రయారిటీని డిసైడ్ చేయలేం. అంటే అర్జంట్, ఇంపార్టెంట్ ఇలాంటి లేబుల్స్ టాస్క్‌లకు పెట్టుకునే అవకాశం లేదు.
* అంతేకాదు కేటగిరీలవారీగా ఫిల్టర్ చేసుకోవడానికి వీలుపడదు.
* గూగుల్ క్యాలెండర్, గూగుల్ కీప్‌లో ఉన్న రిమైండర్స్ ఈ యాప్‌లో కూడా కనిపిస్తాయి. అయితే మీరు వీటినీ టాస్క్స్‌ను, వీటిని ఒకేసారి వాడుకోలేరు. ఏది కావాలంటే దాన్ని మార్చి వాడుకోవాలి.
ఇవన్నీ క్లియర్ చేయాలి
పైన చెప్పిన సమస్యలన్నీ క్లియర్‌చేస్తే గూగుల్ టాస్క్స్ యూజర్లకు నిజంగా మంచి షెడ్యూలింగ్ యాప్‌గా నిలబడుతుంది. లేకపోతే కొత్త సీసాలో పాత సారా పోసినట్లే అంటున్నారు నిపుణులు. జీమెయిల్‌తో ఇంటిగ్రేట్ చేసినట్లే క్యాలెండర్, రిమైండర్స్, కీప్‌ను దీనికి ఇంటిగ్రేట్ చేసుకునే ఫెసిలిటీ ఉంటే బాగుంటుది. స్పెసిఫిక్ టైం పెట్టుకోవడం, ప్రయారిటీ లెవెల్స్ అత్యవసరం.
Google’s Tasks గూగà±à°²à± టాసà±à°•à±à°¸à±