ఆండ్రాయిడ్ కేసినో యాప్స్ మ‌న‌ల్ని ఎటు తీసుకెళ్తున్నాయ్‌?

మీరు స‌ర‌దాకొద్దీ మీ స్మార్ట్ ఫోన్ లేదా టాబ్లెట్‌లో ఆండ్రాయిడ్ కేసినో యాప్‌ను డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేసుకున్నారంటే ఇక అలాంటి వంద‌ల‌కొద్దీ యాప్‌లు మేమూ ఉన్నామంటూ వెంటబడటం మొద‌లెడతాయి. ఇప్పుడు చాలామంది త‌మ కంప్యూట‌ర్లు, ల్యాప్‌టాప్‌లద్వారా ఆన్‌లైన్ కేసినో సైట్ల‌లో గేమ్స్ ఆడ‌టంక‌న్నా వివిధ కార‌ణాల‌వ‌ల్ల ఆండ్రాయిడ్ డివైజెస్‌లో ఆడ‌టానికే ఇష్ట‌ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఆండ్రాయిడ్ కేసినో యాప్స్‌తో అనుసంధానంతోపాటు ప్ర‌త్య‌క్షంగా డ‌బ్బు ప‌ణంగా పెట్టి గేమ్స్ ఆడే లైసెన్స్‌గ‌ల‌ GamblingApps.com సైట్‌ కూడా ఉంది. మొత్తంమీద ఆండ్రాయిడ్ డివైజెస్‌లో కేసినో గేమ్స్ ఆడ‌టంపై మ‌క్కువ‌కు ఏకైక కార‌ణం... స‌ద‌రు గేమ్స్ నిర్వ‌హించేది ఎక్క‌డైనా వాటిలో ప్రత్యక్షంగా పాలుపంచుకోగ‌ల వీలుండ‌ట‌మే! అంటే... కారు, రైలు లేదా బ‌స్సుల‌లో సుదీర్ఘ ప్ర‌యాణ స‌మ‌యంలో ఎలాంటి కేసినో గేమ్స్‌తోనైనా కాల‌క్షేపం చేయొచ్చు. లేదంటే ఎక్క‌డైనా ఎయిర్‌పోర్టులో ఏదైనా కార‌ణంవ‌ల్ల ఎక్కువ‌సేపు ఆగాల్సి వ‌చ్చిన‌పుడు కూడా ఈ అవ‌కాశం ఉంది. అయితే, ఇంట్లో ఉండి కూడా ఆండ్రాయిడ్ డివైజెస్‌లో కేసినో గేమ్స్ ఆడ‌టానికి కొంద‌రు మొగ్గుచూపుతున్నారు. ఏదో ఒక గ‌దిలో ఉంచిన కంప్యూట‌ర్ ముందు కూర్చుని లేదా ల్యాప్‌టాప్‌ను మోకాళ్ల‌మీద బ్యాలెన్స్ చేసుకుంటూ ఆడ‌టంతో పోలిస్తే మొబైల్ యాప్ ద్వారా ఎక్క‌డ కూర్చుంటే అక్క‌డ ఆడుకోగలిగే సౌక‌ర్యం కూడా ఇందుకు దోహ‌ద‌ప‌డుతోంది. 
లైవ్‌, సాఫ్ట్‌వేర్ చోదిత మొబైల్ కేసినో గేమ్స్‌
ఆండ్రాయిడ్ డివైజ్‌ల‌లోనూ కంప్యూట‌ర్ గ్రాఫిక్స్‌తో జ‌న‌రేట్ కాగ‌ల గేమ్స్ ఆడుకునే అవ‌కాశం ఇప్పుడుంది. అయితే, నేడు ఓ కొత్త‌త‌రం లైవ్ కేసినో గేమ్స్ కూడా ఆట‌గాళ్ల‌కు అందుబాటులో ఉన్నాయి. సాధార‌ణంగా కేసినోల‌కు వెళ్లి ఆడుకోగ‌ల కార్డ్ అండ్ టేబుల్ గేమ్స్ కూడా ఆండ్రాయిడ్ డివైజెస్‌లో ఆడుకునే వెసులుబాటు ఉంది. ఎలాగంటే స‌ద‌రు కేసినోలో సాగుతున్న జూద వినోదాన్ని ఆండ్రాయిడ్ డివైజెస్‌లో ఇంట‌ర్నెట్‌ద్వారా ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌డంవ‌ల్ల ఆట‌గాళ్లు అక్క‌డి ప్ర‌తి క‌ద‌లిక‌నూ చూడ‌గ‌లుగుతారు. త‌ద్వారా అందులో తాము కూడా పాల్గొన‌గ‌ల అవ‌కాశం వారికి ఉంటుంది. ఆ మేర‌కు అక్క‌డి గేమ్ టేబుల్‌పై త‌మ డ‌బ్బును కూడా ఆన్‌లైన్‌ద్వారా కొన్ని నియంత్ర‌కాల సాయంతో పణంగా పెట్టొచ్చ‌న్న మాట‌! త‌ద‌నుగుణంగా వారు త‌మ స్టేక్‌ను అక్క‌డ క‌నిపించే చిప్‌విలువ‌తో క్లిక్ చేసి పందెం కాయ‌వ‌చ్చు. అయితే, మీరు ఆన్‌లైన్‌లో రౌలెట్‌, బ‌ఖ్రా, బ్లాక్‌జాక్ వంటి కేసినో పోక‌ర్ కార్డ్ గేమ్స్ ఆడేట్ల‌యితే త‌ప్పులు చేయ‌కుండా జాగ్ర‌త్త వహించాలి సుమా!
ఉదార బోన‌స్‌లు, ఫోన్‌ద్వారా చెల్లింపు ఆప్ష‌న్లు
ఆండ్రాయిడ్ డివైజెస్‌పై నిజ‌మైన సొమ్ము ప‌ణంగా పెట్టి కేసినో గేమ్స్ ఆడ‌టం ప్రారంభించేందుకు ఆర్థికంగా చాలా ప్రోత్సాహ‌కాలు కూడా ఉన్నాయి. ఏదైనా మొబైల్ కేసినో సైట్ లేదా మొబైల్ కేసినో యాప్స్‌లో మీరు రిజిస్ట‌ర్ అయ్యేట్ల‌యితే మీకు ‘‘వెల్‌క‌మ్ బోన‌స్‌’’ ఆఫ‌ర్ స్వాగ‌తం ప‌లుకుతుంది. అలాగే కొత్త క‌స్ట‌మ‌ర్లు గెలుచుకునేదానిపై ‘‘నో డిపాజిట్ బోనస్‌, ఫ్రీస్లాట్ స్పిన్ వంటివాటితోపాటు డిపాజిట్ మ్యాచ్ బోన‌స్‌’’ను కూడా మొబైల్ కేసినో ఆప‌రేటర్ల‌లో అధిక‌శాతం ఇస్తుంటారు. ఇలాంటి ప్రోత్సాహ‌క ఆఫ‌ర్ల‌లో ఏది ఉత్త‌మమో తేల్చుకోలేక పోతున్నారా? ఏదేమైనా అటువంటి బోన‌స్‌లు పొందాలంటే మీ క‌ష్టార్జితంలో కొంత జూదంలో ఒడ్డాల్సిందే. మీ డిపాజిట్ మొత్తంలో క‌నీసం 100 శాతం విలువ సైన్-అప్, వెల్‌క‌మ్ డిపాజిట్ మ్యాచ్‌ బోన‌స్‌గా అందించే ఆండ్రాయిడ్ కేసినో త‌గిలిన‌ట్ల‌యితే, అందులో న‌గదు-చెల్లింపుపై ఆంక్ష‌లు లేనిప‌క్షంలో అటువంటి బోన‌స్‌ను కోరే స‌మ‌యంలో మీరు అత్య‌ధిక క్రీడా విలువ‌ను లాక్ చేసిన‌ట్లవుతుంది. ఆన్‌లైన్ కేసినో సైట్‌క‌న్నా ఆండ్రాయిడ్ డివైజ్ సంధాన కేసినోలో ఆడితే మీకు త‌ర‌చూ అద‌న‌పు డిపాజిట్ ఆప్ష‌న్ అందుబాటులో ఉంటుంది. అది కూడా ఫోన్ డిపాజిట్ ఆప్ష‌న్‌ద్వారా చెల్లించే సౌక‌ర్యంతో ల‌భిస్తుంది. అటువంటి చెల్లింపు ప‌ద్ధ‌తిని మీరు వినియోగించుకునే ప‌క్షంలో మీ డిపాజిట్ల‌ను మీరు త‌దుప‌రి ఫోన్ బిల్లుకు యాడ్ చేసుకోవ‌చ్చు.
వ్య‌స‌నంగా... ఆండ్రాయిడ్ మొబైల్ వినియోగం
ఏ ప్ర‌దేశంలో ఉన్నామ‌న్న‌దానితో నిమిత్తం లేకుండా ఫోన్ చేత‌ప‌ట్టుకుని త‌మ లోకంలో మునిగిపోయేవారు కొందరు మీకు సదా క‌నిపిస్తూనే ఉంటారు. ఇలా మొబైల్ ఒక వ్య‌సనంగా మారిన‌వారికి మొబైల్ కేసినో యాప్స్ అందుబాటులోకి తేవ‌డంద్వారా త‌మ‌దైన మార్కెట్‌ను సృష్టించుకునేందుకు కేసినో ఆప‌రేట‌ర్లు ప్ర‌య‌త్నిస్తున్నారు. త‌ద‌నుగుణంగా కంప్యూట‌ర్ల‌క‌న్నా మొబైల్ ఫోన్ల‌లోనే జూద‌మాడే స్థితికి చేరేవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. రాబోయే కొన్నేళ్ల‌లో ఈ సంఖ్య విప‌రీతంగా పెరిగే ప్ర‌మాదం ఉందంటే అతిశ‌యోక్తి కాదు. కాబ‌ట్టి మొబైల్ కేసినో సైట్ లేదా యాప్‌లో క్రీడా వినోదం కోసం ఓ సారి ట్రైచేద్దామ‌ని మీరు భావిస్తున్న‌ట్ల‌యితే- వాటిలో ఉచిత గేమ్స్‌తో మాత్ర‌మే వినోదించండేం!

Android Casino Apps