రివ్యూ - హువావే పీ20 ప్రో.. ఆండ్రాయిడ్ ప్రపంచంలో మరో ఐఫోన్ ఎక్స్ కానుందా?

ఐఫోన్ సిరీస్ లో ఆపిల్ ఐఫోన్ ఎక్స్ 2017 సెప్టెంబరులో విడుదలైంది. 5.8 అంగుళాల సూపర్ రెటీనా డిస్ప్లే, ఫేసియల్ రికగ్నిషన్ తో సహా 7 ఎంపీ ట్రూ డెప్త్ కెమెరా, 14 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా, వైర్ లెస్ చార్జింగ్, ఏ11 బయోనిక్ చిప్ వంటి ఆకర్షణీయమైన అంశాలు ఉన్నాయి. మరి ఆండ్రాయిడ్ ఫోన్లలో దానికి దీటైన ఫోన్ ప్రస్తుతం ఏదైనా ఉందా? 2018 మార్చిలో విడులైన హువావే పీ20 ప్రో.. ఆండ్రాయిడ్ ప్రపంచంలో మరో ఐఫోన్ ఎక్స్ కానుందా? ఐఫోన్ ఎక్స్ కు దీటుగా హువావే పీ20 ప్రోలో ఉన్న ఫీచర్లు ఏమిటి? తెలుసుకుందాం.. 

కెమెరా సూప‌ర్‌
హువావే పీ20 ప్రోలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది లైకా ట్రిపుల్ కెమెరా సెటప్. 40 ఎంపీ ప్రైమరీ కెమెరా ఉండ‌డంతో పిక్చ‌ర్స్ క్రిస్ట‌ల్ క్లియ‌ర్‌గా, పూర్తి డిటెయిల్స్‌తో వ‌స్తాయి.  ఇక  20 ఎంపీ, 8 ఎంపీ రియర్ కెమెరాలు మంచి ఫోటోలు ఇస్తాయి.  ఫేస్ రికగ్నిషన్, ఆటోఫోకస్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది.  మొత్తంగా చూస్తే కెమెరా పనితీరు క్రిస్టల్ క్లియర్ గా ఉంటుంది. ట్రిపుల్ కెమెరా సెటప్ తో పాటు ఫోన్లో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫొటోలు మరింత క్వాలిటీగా వచ్చేందుకు తోడ్పడుతుంది. ఈ ఫోన్ కెమెరాతో తీసే ఫొటోలు ఐ ఫోన్ ఎక్స్‌, గూగుల్ పిక్సెల్ 2 ఫోన్ల కెమెరాతో వ‌చ్చే ఫొటోల‌తో ఈక్వ‌ల్ క్వాలిటీని ఇస్తున్నాయి. 

ప‌వ‌ర్‌ఫుల్ పెర్‌ఫార్మెన్స్ 
మంచి రెసొల్యూషన్ గల 6.10 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్‌ప్లే ఉంది.  వీటితోపాటు ఆపిల్ ఐఫోన్ ఎక్స్ ఫీచర్లకు దీటుగానే ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి.  

* 1.8 GHz ఆక్టా కోర్ ప్రాసెసర్,6జీబీ ర్యామ్‌తో ఇత‌ర ఆండ్రాయిడ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లకు దీటైన పెర్‌ఫార్మెన్స ఇస్తుంది.

* 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ దీనికి మ‌రో అడ్వాంటేజ్‌. కావ‌ల‌సినంత స్పేస్ ఇంట‌ర్న‌ల్‌గానే ఉండ‌డంతో యాప్స్ ఎన్నిఉన్నా కూడా ఫోన్ స్లో అయ్యే అవ‌కాశాలు త‌క్కువ‌. మ‌ల్టిపుల్ యాక్ష‌న్స్ ఒకేసారి చేసుకోవ‌చ్చు.

* 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఉండడంతో బ్యాక‌ప్ ప‌రంగానూ ఓకే.  

* ఈ ప్ల‌స్‌పాయింట్స్ అన్నీచూస్తే ఇప్ప‌టికే మార్కెట్లో ఉన్న ఆసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1 వంటి ఫ్లాగ్‌షిప్ ఫోన్ల‌కు దీటుగా నిల‌వ‌గ‌ల‌ద‌ని అంచ‌నా వేస్తున్నారు.
 

Huawei P20 Pro iPhone X in android Lika Triple camera setup హువావే పీ20 ప్రో ఆండ్రాయిడ్ ప్రపంచంలో మరో ఐఫోన్ ఎక్స్ లైకా ట్రిపుల్ కెమెరా సెటప్ Â