జియో రాక ముందు ఇండియాలో మొబైల్ డేటా నెట్‌వర్క్ చాలా ఖరీదుగా ఉండడంతో యూజర్లు బ్రౌజింగ్ చేయాలంటే కూడా ఒకటి రెండుసార్లు ఆలోచించే పరిస్థితి. కానీ జియో వచ్చీ రావడమే రోజుకు 1జీబీ డేటా ఇవ్వడంతో యూజర్ల ఊహలకు రెక్కలు తొడిగినట్లయింది. అప్పటివరకు నెలకు 1జీబీతో సరిపెట్టుకున్నయూజర్లు ఒక్కసారిగా రోజు 1జీబీ అనడంతో డేటాను మ్యాగ్జిమం వాడుకోవడం మొదలుపెట్టారు. బ్రౌజింగ్, డౌన్‌లోడ్‌లతో ఆగలేదు. వీడియో కంటెంట్‌ను ఆన్‌లైన్లో చూడడం మొదలుపెట్టారు. అప్పటివరకు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ స్టార్ క్రికెట్ లాంటి కొన్ని యాప్స్ ఉన్నా వాటిని వినియోగించినవారు తక్కువే. డేటా చౌకగా వస్తుండడంతో మొబైల్ డేటాతో లైవ్ షోలు, టీవీ సీరియల్స్, సినిమాలు చూడడం బాగా పెరిగింది. ఇప్పుడు ఇండియన్ టెలికాం రెండు పెద్ద సంస్థలయిన ఎయిర్‌టెల్, జియోలు సొంతంగా టీవీ యాప్స్ కూడా తేవడంతో ఇది మరింత డెవలప్ అయిపోయింది. ఇప్పుడు ఎయిర్‌టెల్ వర్సెస్ జియో పోటీలో ఎవరు ముందున్నారో చూద్దాం.
ఛానల్స్‌లో జియోనే టాప్
ఛానల్స్ విషయంలో జియోనే టాప్. జియో టీవీ 585 ఛానల్స్‌ను ఇస్తోంది. హిందీ, ఇంగ్లీష్, తమిళ్, తెలుగు,కన్నడ, మలయాళం, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ ఉర్దూ లాంటి అన్ని పెద్ద భాషల్లో ఛానల్స్ జియోలో లభిస్తున్నాయి. ఆయా భాషల్లో డీటీహెచ్, కేబుల్ టీవీల్లో వచ్చే దాదాపు అన్ని ఛానళ్లు జియో టీవీలో చూడొచ్చు. దీనికితోడు జియో సొంత ఛానళ్లయిన జియో స్పోర్ట్స్, జియో ధనాధన్, జియో ఈవెంట్స్‌వంటివి వీటికి అదనం. ఎయిర్‌టెల్ 354 ఛానల్స్ అందిస్తుంది. దాదాపు జియో కంటే 230 ఛానల్స్ తక్కువ. పైగా ఎయిర్‌టెల్‌కు సొంత ఛానళ్లు లేవు. అయితే ఎయిర్‌టెల్ టీవీకి పిల్లల కామిక్ సీరియల్స్ అందించే హుక్ టీవీ, సినిమాలు అందించే ఈరోస్ నౌ, హాట్ స్టార్‌వంటివి ఉండడంతో నెట్టుకురాగలుగుతోంది. హెచ్‌డీఛానళ్ల విషయానికి వస్తే జియో 114 అంఇస్తే ఎయిర్‌టెల్ 36కే పరిమితమైంది.
ఇంటర్‌ఫేస్
యాప్స్ కాబట్టి ఇంటర్‌ఫేస్ ఎంత ఈజీగా ఉందనేది కూడా కీలకమే. ఆ విషయంలోనూ జియోనే ముందుంది. జియో టీవీ యాప్ హోం పేజీలోనే అన్ని ఛానల్స్ లిస్ట్ టీవీ షోలు, మూవీస్, స్పోర్ట్స్, లైవ్‌టీవీ ఇలా విభాగాల వారీగా కనిపిస్తుంది. హెచ్‌డీ, నాన్ హెచ్‌డీ ఛానళ్ల లిస్ట్ ఉంటుంది. దీనికితోడు రికార్డంగ్ ఆప్షన్ కూడా ఉండడం ప్లస్‌పాయింట్. ఏదైనా ప్రోగ్రామ్‌ను తర్వాత చూడాలంటే రికార్డ్ కూడా చేసుకోవచ్చు. ఎయిర్‌టెల్ ఇంటర్‌ఫేస్ జియో టీవీ యాప్ కంటే కాస్త భిన్నంగా ఉంటుంది. అయితే దీనిలోనూ విభాగాల వారీగా లిస్ట్ ఉంటుంది. ఇంటర్ ఫేస్ పరంగా రెండూ ఓకే అయినా జియో కాస్త ఈజీగా ఉండడం దీనికి ప్లస్‌పాయింట్.
యాక్సెస్
జియో టీవీని యాక్సెస్ చేయాలంటే మీ ఫోన్లో జియో సిమ్ ఉండాలి. వేరే మొబైల్ నెట్‌వర్క్‌తో మీరు జియో టీవీని యాక్సెస్ చేయలేరు. ఒకవేళ వైఫై కనెక్షన్‌తో యాక్సెస్ చేయాలన్నా యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఉండాలి.అయితే ఎయిర్‌టెల్ టీవీ అయితే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే చాలు ఏ నెట్‌వర్క్ మీదయినా చూడొచ్చు. అయితే దీనికి కూడా ఎయిర్‌టెల్ నెంబర్‌తో సైన్ ఇన్ అయి ఉండాలి.
డేటా వినియోగం
టీవీ యాప్ ఏదైనా మొబైల్‌లో టీవీ చూడాలంటే డేటా భారీగానే ఖర్చవుతుంది. జియో టీవీలో హెచ్‌డీ కంటెంట్‌ను చూడాలంటే 10 నుంచి 12 నిమిషాలకు300 ఎంబీ వరకు ఖర్చవుతుంది. జియోలో వీడియో క్వాలిటీని తగ్గించడానికి సెపరేట్ సెట్టింగ్ లేదు.అయితే ఒక్కసారి ఫుల్ స్క్రీన్ మోడ్‌లో కంటెంట్ చూడడం స్టార్ట్‌చేశాక దాని క్వాలిటీని తగ్గించుకునే అవకాశం ఉంది. ఎయిర్‌టెల్ టీవీలో డేటా వినియోగం మరింత ఎక్కువగా ఉంది. 10 నిముషాలు హెచ్‌డీ కంటెంట్ చూడాలంటే 350 ఎంబీ డేటా ఖర్చవుతుంది. అయితే ఎయిర్‌టెల్ టీవీలో డేటా వినియోగాన్నితగ్గించుకోవడానికి యాప్‌లో సెట్టింగ్ ఉంది. హై, మీడియం, లో అనే మూడు కేటగిరీల్లో నుంచి కావాల్సిన దాన్నిసెట్‌చేసుకోవచ్చు. హై నుంచి లోకి వచ్చేసరికి డేటా వినియోగం తగ్గుతుంది. అంతేకాదు ఈ యాప్‌లో మొబైల్ డేటా సేవర్ ఫీచర్ ఉంది. మొబైల్ డేటా కనెక్షన్ మీద చూస్తున్నప్పుడు హెచ్‌డీ వీడియో స్ట్రీమింగ్‌ను డిజేబుల్ చేస్తుంది. కాబట్టి డేటా వినియోగం విషయంలో ఎయిర్‌టెల్ టీవీ యాప్‌కే మంచి మార్కులు వేయొచ్చు. మొత్తంగా చూస్తే జియో టీవీ యాప్ ఫస్ట్ ఛాయిస్‌గా నిలుస్తుంది. హుక్‌లాంటి ఛానల్స్ సబ్‌స్క్రిప్షన్ ఉండడం, డేటా సేవర్ ఫీచర్ ఉండడంతో ఎయిర్‌టెల్ సర్వైవ్ అవుతోంది.
Jio Tv Vs Airtel TV Best Tv app   Live TV apps జియో టీవీ వరà±à°¸à±†à°¸à± ఎయిరà±â€Œà°Ÿà±†à°²à± టీవీ టీవీ యాపà±à°¸à±â€Œ బెసà±à°Ÿà± టీవీ యాపà±â€Œ