ఏంటీ లింక్‌.. ఫ్రీ వైఫై మ్యాప్‌, ఫ్రీ వైఫై క‌నెక్ట్ 

మీరు ప్ర‌యాణిస్తున్నారు. అర్జెంట్‌గా ఒక మెయిల్ పంపాల్సి వ‌చ్చింది. ఈ స్థితిలో డేటా అయిపోతే ఏం చేస్తారు?.. మీ ప‌ని ఎలా పూర్త‌వుతుంది. ఇలాంటి ప‌రిస్థితిని మీరు కూడా ఎదుర్కొనే ఉంటారు. ఒక్కోసారి మీ ఫోన్లో డేటా ఉన్న క‌నెక్టివిటీ స‌రిగా లేక‌పోవ‌డం లేదా డేటా స్పీడ్ త‌క్కువ‌గా ఉండ‌డం లాంటి స‌మ‌స్య‌ల వ‌ల్ల మీరు అనుకున్న ప‌ని పూర్తి చేయ‌లేక‌పోతారు. ఇలాంటి ఇబ్బందిలో మీకు సాయం అందించ‌డం కోసం వ‌చ్చేసింది. లింక్‌. ఫ్రీ వైఫై మ్యాప్‌, ఫ్రీ వైఫై క‌నెక్ట్ ఇండియా. 

ఏంటీ దీని ప్ర‌త్యేక‌త‌!
లింక్ అనేది డ‌బ్ల్యూఏఎన్ఐ ట్రాయ్ కంప్ల‌యింట్ యాప్‌. దీని సాయంతో ఎయిర్‌పోర్ట్‌, రైల్వే, రైగ్ గూగుల్ వైఫై, జియో నెట్‌, మెట్రోల్లో మీరు ఉచితంగా వైఫై పొందే అవ‌కాశం ఉంటుంది. దిల్లీ, బెంగ‌ళూరు, ముంబయి లాంటి మెట్రో న‌గ‌రాల్లో ఉచితంగా వైఫై మ్యాప్‌ను క‌నుక్కోవచ్చు. మీ ప్ర‌యాణ అవ‌స‌రాలు తీర్చ‌డ‌మే కాదు.. మీకు గృహానికి సంబంధించిన వైఫై అవ‌సరాల‌ను తీర‌స్తుంది. దీని ద్వారా పొట‌న్షియ‌ల్ వైఫై హాట్‌స్పాట్స్‌కు ఉచితంగా వైఫై పొందే అవ‌కాశం ఉంది. 

ఫీచ‌ర్లు ఏమున్నాంటే..
1. లింక్ సాయంతో ఉచితంగా వైఫై హాట్‌స్పాట్‌కు క‌నెక్ట్ చేయ‌చ్చు. దీని వ‌ల్ల మీరు ఎలాంటి అంత‌రాయం లేకుండా వైఫైను ఆస్వాదించొచ్చు.

2. హోమ్ లైక్ వైఫై ఎక్స్‌పీరియ‌న్స్ కోసం దీన్ని ఉప‌యోగించొచ్చు. పార్ట‌న‌ర్ నెట్‌వ‌ర్క్స్ ఇది ఆటోమెటిక్‌గా క‌నెక్ట్ అవుతుంది.

3. ఇది మీ వైఫై వాడ‌కాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు ట్రాక్ చేస్తుంది. ఫ్రీ వైఫై ఇంట‌ర్నెట్ యూసేజ్ హిస్ట‌రీని ఇది యాక్సెస్ చేస్తుంది. 

4. దీని వ‌ల్ల మీరు ప్ర‌త్యేకించి ఖ‌రీదైన వైఫై హాట్ స్పాట్ డివైజ్‌లు కొనుక్కోవాల్సిన అవ‌స‌రం లేదు. 

Linq Free WiFi Map Free WiFi Connect India Portable WiFi లింక్ డ‌బ్ల్యూఏఎన్ఐ ట్రాయ్ కంప్ల‌యింట్ యాప్‌