నోకియా తొలి ఫ్లాగ్‌షిప్  ఆండ్రాయిడ్ ఫోన్‌.. నోకియా 8 రివ్యూ 




 
సెల్‌ఫోన్ల‌లో ఒక‌ప్పుడు రారాజులా వెలుగొందిన నోకియా ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో నిల‌బ‌డేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. నోకియా 3, నోకియా 5, నోకియా 6 అని మూడు బ‌డ్జెట్ స్మార్ట్‌ఫోన్ల‌ను ఇప్ప‌టికే మార్కెట్లోకి తెచ్చింది.  లేటెస్ట్‌గా నోకియా 8 పేరుతో తొలిసారిగా ఆండ్రాయిడ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను రిలీజ్ చేసింది.  ఈ ఫోన్ నోకియా బ్రాండ్ నేమ్ నిల‌బెట్టేలా ఉందా లేదా తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చూడండి. 

డిజైన్‌, బిల్ట్ క్వాలిటీ 
ముందు వ‌చ్చిన బ‌డ్జెట్ ఫోన్ల మాదిరిగా కాకుండా నోకియా 8 మీద త‌యారీ కంపెనీ హెచ్ఎండీ గ్లోబ‌ల్ బాగా ఫోక‌స్ పెట్టింది. గెలాక్సీ ఎస్‌8లా బీజిల్‌లెస్ డిస్‌ప్లే లేకున్నా, హెచ్‌టీసీ యూ11 మాదిరిగా సూప‌ర్ ఆడియో ఫీచ‌ర్స్ లేక‌పోయినా, గెలాక్సీ నోట్ 8లాగా ఎస్ పెన్‌లాంటి ఫీచ‌ర్లు లేక‌పోయినా కూడా నోకియా 8 డిజైన్‌, బిల్ట్ క్వాలిటీ విష‌యంలో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాలేదు.  
* సాలిడ్‌, ఫ్లూయిడ్‌, కంప్లీట్ ప్యాకేజ్‌గా ఈ ఫోన్‌ను డిజైన్ చేసింది. 6000 సిరీస్ అల్యూమినియంతో సింగిల్ బ్లాక్ లో ఫ్రేమ్ ఫోన్‌కు మంచి ప్రొటెక్ష‌న్‌, సాలిడ్ నెస్ తీసుకొచ్చింది. డ్యూర‌బుల్‌గానే కాదు ప‌ట్టుకోవ‌డానికి కంఫ‌ర్ట‌బుల్‌గా కూడా ఉంది. 
* లుక్ కూడా ఎలిగెంట్ కాదు క్లాస్‌గా ఉంది. 
* ఫ్రంట్ ఎండ్‌లో గొరిల్లా గ్లాస్ 5, నోకియా లోగోతో చూడ‌డానికి ఎట్రాక్టివ్‌గా ఉంది. 5.3 ఇంచెస్ స్క్రీన్‌, బాట‌మ్‌లో హోం, బ్యాక్‌, మ‌ల్టీ టాస్క్ బ‌ట‌న్స్ ఉన్నాయి.  అయితే ప్ర‌స్తుతం ఫ్లాగ్‌షిప్ ఫోన్లు ఇస్తున్న‌ట్లుగా బీజిల్ లెస్ (ఎడ్జ్ టు ఎడ్జ్‌) డిస్‌ప్లే లేక‌పోవ‌డం కొద్దిగా డిజ‌ప్పాయింట్ చేస్తుంది. 

పెర్‌ఫార్మెన్స్ 
ప్ర‌స్తుతం ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో ది బెస్ట్  ప్రాసెస‌ర్‌గా చెబుతున్న స్నాప్‌డ్రాగ‌న్ 835 ప్రాసెస‌ర్‌ను నోకియా 8లోనూ ఇచ్చారు. 4జీబీ ర్యామ్‌, స్టాక్ ఆండ్రాయిడ్ లు క‌లిసి ఫాస్ట్‌, ఫ్లూయిడ్ , స్నాపీ పెర్‌ఫార్మెన్స్ ఇస్తున్నాయి. 
* ఆండ్రాయిడ్ 7.1.1 నూగ‌ట్ ఓఎస్‌తో వ‌చ్చిన నోకియా 8కు ఆండ్రాయిడ్ 8 (ఓరియో) అప్‌డేట్ కూడా అందుబాటులోకి వ‌చ్చేసింది. కాబ‌ట్టి ఓఎస్ ప‌రంగా అప్ టు డేట్‌.  గూగుల్ ఫోన్ల త‌ర్వాత ఆండ్రాయిడ్ ఓరియో అప్‌డేట్ అందుకున్న తొలి ఆండ్రాయిడ్ ఫోన్ నోకియా 8 మాత్ర‌మేన‌ని హెచ్ఎండీ చెబుతోంది.
* యాప్ క్రాషెస్‌, బ‌గ్స్ లేకుండా మంచి పెర్‌ఫార్మెన్స్ ఇస్తోంది.

డిస్‌ప్లే 
నోకియా 8లో 5.3 ఇంచెస్ క్వాడ్ హెచ్‌డీ ఐపీఎస్ ఎల్‌సీడీ డిప్‌ప్లే ఉంది. 2560 x 1440 పిక్సెల్స్ రిజ‌ల్యూష‌న్‌తో డిస్‌ప్లే క్రిస్ఫ్‌గా, పిక్సెల్ డెన్స్‌గా క‌నిపిస్తుంది.  తీక్ష‌ణ‌మైన స‌న్‌లైట్‌లో కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా క‌నిపించే హై బ్రైట్‌నెస్ డిస్‌ప్లే దీని స్పెషాలిటీ. 

కెమెరా
 Carl Zeiss ప‌వ‌ర్డ్ ఆప్టిక‌ల్స్‌తో కూడిన కెమెరాలు నోకియా 8లో వ‌న్ ఆఫ్ దిబెస్ట్ ఫీచ‌ర్స్ అని చెప్పాలి.  రియ‌ర్ సైడ్‌లో 13 మెగాపిక్సెల్ డ్యూయ‌ల్ కెమెరా సెట‌ప్ ఉంది. ఒక‌టి ఆర్‌జీబీ, మ‌రొక‌టి ఆప్టిక‌ల్  ఇమేజ్ స్టెబిలైజేష‌న్‌తో ఉన్నాయి. ఈ రెండు కెమెరాల‌తోనూ 4కే వీడియోను షూట్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా కూడా 13 మెగాపిక్సెల్‌. డిస్‌ప్లే ప్లాష్‌, ఫేజ్ డిటెక్ష‌న్ ఆటోఫోక‌స్ దీని స్పెషాలిటీస్‌.  లో లైట్‌లోనూ, ఎలాంటి కండిష‌న్స్‌లో తీసినా డెప్త్ ఇమేజెస్‌ను ఇస్తోంది. ఇక  మూడు కెమెరాల‌తో ఫ్రంట్‌, బ్యాక్ ఎండ్స్‌లో ఒకేసారి.. అది కూడా  ఇమేజ్‌, వీడియో ల‌ను ఒకేసారి తీయ‌గ‌లిగే బోతీ ఫీచ‌ర్ దీనికి పెద్ద ఎడ్వాంటేజ్. 
 

Nokia's Flagship android phone Nokia 8  Review  నోకియా 8 స్మార్ట్‌ఫోన్‌ ఫ్లాగ్‌షిప్ ఆండ్రాయిడ్ ఫోన్‌ Â