నోకియా ఫోన్ క్వాలిటీ విషయంలో రాజీపడదని పేరు. యాజమాన్యం మారినా నోకియా తన పేరును అలాగే నిలబెట్టుకుంటోంది. బిల్ట్ క్వాలిటీ విషయంలో సూపర్‌గా ఉండడంతో ఫోన్ కింద పడినా అంతగా డ్యామేజి కాదు. అయితే ఇంకా పాతచింతకాయపచ్చడి మార్కెటింగ్ స్ట్రాటజీలతోనే ముందెకెళ్లడం, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌పై సీరియస్‌గా దృష్టి పెట్టకపోవడంతో నో్కియా స్మార్ట్‌ఫోన్లు అంతగా సక్సెస్ కావడం లేదు. 2018లో నోకియా ఇప్పటికే చాలా స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ చేసింది. వీటన్నింటినీ పరిశీలించిన మార్కెట్, టెక్ నిపుణులు ఓవరాల్‌గా ఇచ్చిన రివ్యూ ఏమిటో చూడండి
వ్యూహాత్మక తప్పిదాలు
ఫీచర్ ఫోన్ల నుంచి స్మార్ట్‌ఫోన్లకు రావడానికి నోకియా చాలాకాలం తీసుకుంది. అదీ విండోస్ ఓఎస్‌తో ఫోన్లు తయారుచేసింది. ఆండ్రాయిడ్‌ను వెంటనే స్వాగతించకపోవడం నోకియా చేసిన మొదటి తప్పు. హెచ్ఎండీఏ గ్లోబల్ నోకియా ఫోన్ కొన్న తర్వాత ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫ్లాట్‌ఫామ్ మీద స్మార్ట్‌ఫోన్లు తయారుచేస్తోంది. అయితే నోకియా 2, నోకియా 3, నోకియా 5, నోకియా 5.1, నోకియా 5 ప్లస్, నోకియా 6, నోకియా 7 ప్లస్, నోకియా 6 ప్లస్, నోకియా 8, నోకియా 8 సెరాకో ఇలా బోల్డన్ని ఫోన్లు తెచ్చేసింది. బడ్జెట్ , మిడ్ రేంజ్, ప్రీమియం .. ఇలా అన్ని కేటగిరీల్లోనూ ఫోన్లు రిలీజ్ చేసింది. అన్ని వర్గాలనూ ఆకట్టుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తున్నామని నోకియా అనుకుంటోంది కానీ ఇది అంత మంచి మార్కెట్ స్ట్రాటజీ కాదని మార్కెట్ అభిప్రాయం. ఏదో ఒక ఫోన్ మంచి స్పెక్యులేషన్స్‌తో, సరసమైన ధరతో తీసుకొచ్చి మార్కెట్‌లో బాగా పేరు తెచ్చుకుంటే తర్వాత కొత్త మోడల్స్ తీసుకొచ్చినా యూజర్లు కొంటారు. అలాకాకుండా ఇలా కుప్పలు తెప్పలుగా ఫోన్లు రిలీజ్ చేస్తే ప్రయోజనం ఉండదు.
సాఫ్ట్‌వేర్‌లో వెనకబాటే
నోకియా హార్డ్‌వేర్ బాగున్నా సాఫ్ట్‌వేర్ విషయంలో ఇంకా వెనకబడే ఉంది. కెమెరా విషయంలో అయితే నోకియా ఇంకా 5 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ కెమెరాల దగ్గరే ఉండడం మనం చెప్పుకోవాల్సిన అంశం. మూడు, నాలుగువేల రూపాయల బేసిక్ స్మార్ట్ ఫోన్‌లో కూడా ఇంతకంటే ఎక్కువే మెగాపిక్సెల్స్ కెమెరాలు ఉంటున్నాయి. హానర్ 10, వన్‌ప్లస్ 30వేల నుంచి 35వేల లోపు ధరలో తీసుకొస్తున్న ఫోన్లలో కెమెరా కేక పుట్టిస్తోంది. కానీ అదే ధరకు అమ్ముతున్న నోకియా ఫోన్లలో కెమెరా మాత్రం సాదాసీదాగా ఉంటుంది. పిక్చర్ క్వాలిటీ విషయంలోనూ మిగిలిన కంపెనీల ఫోన్లతో పోల్చితే డల్‌గానే ఉంటుంది. ఫోన్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌పై అర్జెంట్‌గా ఫోకస్ చేయాలి.
సెక్యూరిటీ అప్‌డేట్స్‌తో లాభమెంత?
ఆండ్రాయిడ్ స్టాక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడం బాగానే ఉంది. సెక్యూరిటీ విషయంలోనూ నోకియా మంచి పాలసీనే ఫాలో అవుతోంది. నెలవారీ సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తోంది. అయితే నోకియా 7 ప్లస్‌లో లేటెస్ట్ సెక్యూరిటీ అప్‌డేట్ బోల్డన్ని బగ్స్ కూడా తీసుకొచ్చింది. అదీకాక అప్‌డేట్స్‌తో అంత బెటర్ ఎక్స్‌పీరియన్స్ కూడా రావడం లేదు. అవసరమైతే రెండు నెలలకోసారి ఇచ్చినా ఫరవాలేదు గానీ బగ్స్ లేని, బెటర్ పెర్‌ఫార్మెన్స్‌కు పనికొచ్చే అప్‌డేట్స్ అయితే బెటర్.
మిడ్ రేంజ్‌పై దృష్టి పెట్టాలి
15 వేల నుంచి 20 వేల ధరలో ఉన్న మిడ్ రేంజ్ సెగ్మెంట్‌పై దృష్టి పెడితే నోకియా బాగా నిలదొక్కుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రేంజ్‌లో ఫోన్లు కొనేవాళ్లే ఇండియాలో ఎక్కువ. అదీకాక షియోమి, హానర్, మోటో లాంటి ఫోన్లున్నా ఈ సెగ్మెంట్‌లో ఇంకా చాలా స్పేస్ ఉంది. అయితే నోకియా ఈ రేంజ్‌లో ఫోన్ తెచ్చినా ఇంకా ప్రీమియం బ్రాండేనన్న ఫీలింగ్‌తో భారీగా రేట్లు పెడుతోంది. ఉదాహరణకు స్నాప్‌డ్రాగన్ 630 ఎస్‌వోసీ ప్రాసెసర్‌తో వస్తున్న షియోమీ రెడ్‌మీ నోట్ 5 ప్రో 15వేల ధర ఉంది. ఆసుస్ జెన్‌ఫోన్‌లో ఇంకా కొంత తక్కువే ఉంది. అదే నోకియా త్వరలో ఇదే ప్రాసెసర్‌తో తేబోతున్న ఎక్స్6 మోడల్ ఫోన్ రూ.20 వేల వరకు ఉండొచ్చని మార్కెట్ అంచనా. ఇలా ప్రీమియం ప్రైస్ పెడితే యూజర్లు దరిచేరడం కష్టం.
Quick Review on Nokia smart phones nokia smart phones 2018 నోà±à°•ియా à°¸à±à°®à°¾à°°à±à°Ÿà±â€Œà°«à±‹à°¨à±à°²â€Œà°ªà±ˆ à°°à°¿à°µà±à°¯à±‚ మిడౠరేంజౠఫోనà±à°²â€Œà°ªà±ˆ దృషà±à°Ÿà°¿ Â